త్రినాథ వ్రతకల్పం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎త్రినాథ వ్రత కథ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బార్య → భార్య using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 233:
 
; గ్రుడ్డివానికి చూపు - కుంటివానికి కాళ్ళు వచ్చుట :
ఇట్టి స్థితిలో గ్రుడ్డివాడొకడు త్రోవను బోయే వారితో అన్నా మీరెవరు మీపేరేమిటి ? మీరెక్కడకు వెళ్ళు చున్నారు ? అనెను వారు మేళా చూచుట కనిరి .అది విని గ్రుడ్డి వారు నాకు కండ్లు కానరావు .మీరందరూ నేత్రములతో చూస్తారు .నేను దేనితో చూస్తాను. అని అనగా గ్రుద్దివాడా ! త్రినాధ స్వామీ వారిని భజింపుము నీ కన్నులు బాగుగా కనపడును. ప్రభువుల వారి మహిమ చూడ వచ్చును. అని చెప్పి, వారంతా మేళా వద్దకు ప్రవేశించారు .గ్రుడ్డి వాడు ఆ త్రోవలో కూర్చుని స్వామివారి భజన చేయుచుండగా కొంచెము కన్నులు కన్పించినవి .అప్పుడు గ్రుడ్డివాడు కొంత దూరము పోయినాడు .దారిలో ఒక పొట్ట వాడు కూర్చుని యున్నాడు .వానిని చూసి నీవు గ్ర్ద్ది వాడవు ఇంత కష్టంతో ఎక్కడకు వెళ్లుచున్నావు అని అడిగినాడు .గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు .అన్నా ! నేను మేళాను చూచుటకు వెళ్ళు చున్నాను ఆ మాటలు పొట్టవాడు విని " స్వామి వారి దయ నా మీద లేదు .చేతులు ,కాళ్ళు ,పొట్ట ,నేనెలాగున నడువగలను? నీకు కాళ్ళున్నవి దేక్కుని వెళ్ళగలవు , అంత గ్రుడ్డివాడు చెప్పు చున్నాడు " నీవు త్రినాధ స్వామి వారిని భజింపుము .నీ కాళ్ళు చేతులు బాగౌతవి .క్షణంలో ఇద్దరం కలసి వెడలిపోదాము.నేను కేవలం గ్రుడ్డివాడిని ఎ మాత్రం కన్నులు కనిపించుటలేదు .త్రినాధ స్వామి వారిని భజించి నాను కనుక, కొంచెము కనిపిస్తున్నది .అందుచే, నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు . అని చెప్పగా పొట్టవాడు త్రినాధా! త్రినాధా ! అని భజించాడు..గ్రుడ్డి అన్నా ! నీకు కాళ్ళున్నవి, నడవ గలవు, నేను ఎలాగు నడవ గలను .నన్ను నీ భుజము మీద కూర్చో బెట్టుకొన నెమ్మదిగా నడచి వెళ్ళు నేను త్రోవ చూపుతుంటాను. నిశ్చింతగా ఇద్దరమూ మేళాకు చేరుకుందాము. అని పొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విని గ్రుడ్డివాడు పొట్టవానిని భుజముపై కూర్చో బెట్టుకుని మెల్లగా నడచి పోతున్నాడు.నేస్తం ! నా నేత్రాలు నిర్మలంగా కనిపించు చున్నవి అని అనగా పొట్టవాడుసొట్టవాడు అయ్యా ఇప్పుడు నడచి పోగలను ఈ విధంగా గ్రుడ్డివాడు, పొట్టవాడుసోట్టవాడు కలసి త్రినాధ స్వామి మేళా దగ్గరకు ప్రవేశించి నారు .
 
; త్రినాధులు వైష్ణవ భక్తుని రక్షించుట - మూర్ఖపు గురువును శిక్షించుట :
పంక్తి 240:
; గురువు పశ్చాత్తాప పడి మేళా చేయగా త్రినాధులు కరుణించుట :
వారిని చూచి గురువు మూర్చబోయాడు శిష్యుడు పట్టుకుని లేపి కూర్చుండ బెట్టి, ముఖముపై నీళ్ళు చల్లి" అయ్యా ! తమరు త్రినాధ స్వామివారికి అపరాదులు, త్రినాధ మేళాను పాడు చేసినారు. అందుకే మీకిది ప్రతిఫలము .మీరు నిష్టతో స్వామీ వారి మేళాను చేసిన యెడల మీ భార్యా కుమారులు బ్రతుకుతారు." అని శిష్యుడనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా, వెంటనే భార్యా కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాధ మేళా పాడుచేసినందుకు తగిన శిక్ష దొరికింది ."నేను మూర్ఖుడను ,అధముడను ప్రభువులవారి మహిమ తెలిసికొనలేకపోతిని " అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్దములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు . నూనె కాండము చెల్లినది .ప్రభువుల వారి పూజ కావచ్చినది .ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకుని సేవించి సుఖమనుభవించారు.
 
==ఫలశ్రుతి==
ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టు వ్యాధి గ్రుడ్డి తనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటెగా హాస్యము చెప్పిన యెడల నడ్డి తనము, గ్రుడ్డి తనము కలుగుతుంది. ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలెను. చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరు వేరుగా పూజించవలెను. నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలెను. తాంబూలము మూడు భాగములు చేసి ఉంచవలెను. త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలెను. మూడు దీపములు వెలిగించి "ఓ త్రినాధ స్వాములారా దయ చేయండి" అని అనవలయును. అంతా సమర్పించి త్రినాధ స్వాములవారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినవలయును. ప్రసాదము అందరూ పంచుకుని సేవించ వలెను. ఈ విధముగా త్రినాధులను పూజించి తరించండి " అని ఈ కథను సీతా దాసు చెప్పి యున్నారు.
"https://te.wikipedia.org/wiki/త్రినాథ_వ్రతకల్పం" నుండి వెలికితీశారు