ప్లైస్టోసీన్: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు
పంక్తి 21:
 
=== గ్లేసియల్ లక్షణాలు ===
ప్లైస్టోసీన్‌లో గ్లేసియల్ చక్రాలు పునరావృతమౌతూ ఉండేవి. ఆ కాలంలో ఖండాంతర హిమానీనదాలు కొన్ని చోట్ల 40 వ అక్షాంశం వరకూ విస్తరించేవి. గరిష్ట గ్లేసియల్ సమయంలో, 30% భూమి మంచుతో కప్పబడి ఉండేదని అంచనా. దీనికి తోడు, మంచు పలకల అంచు దగ్గరి నుండి పెర్మాఫ్రాస్ట్ దక్షిణదిశలో విస్తరించి, [[ఉత్తర అమెరికా]]<nowiki/>లో కొన్ని వందల కిలోమీటర్ల మేర, [[యురేషియా]]<nowiki/>లో అనేక వందల కిలోమీటర్ల మేరా కప్పివేసేది. మంచుపలకల అంచు వద్ద సగటు వార్షిక ఉష్ణోగ్రత {{Convert|-6|°C|0}}, పెర్మాఫ్రాస్ట్ అంచు వద్ద, {{Convert|0|°C|0}} ఉండేది.
 
ప్రతిసారి గ్లేసియర్లు పెరిగినపుడు 1,500 నుండి 3,000 మీటర్ల మందాన ఖండాంతర మంచు పలకలలు ఏర్పడి, పెద్ద యెత్తున నీటిని మింగివేసేవి. ఫలితంగా భూమ్మీద యావత్తు సముద్ర మట్టం తాత్కాలికంగా 100 మీటర్లకు పైగా పడిపోయేది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్‌గ్లేసియల్ కాలాల్లో, తీరప్రాంతాలు మునిగిపోయేవి.
పంక్తి 115:
సముద్ర, భూ జంతుజాలాలు రెండూ ఆధునికమైనవే. అయితే [[మామత్|మామత్‌లు]], మాస్టోడాన్స్, ''డిప్రొటోడాన్'', ''స్మిలోడాన్'', [[పులి]], [[సింహం]], అరోచ్స్, చిన్న ముఖం గల ఎలుగుబంట్లు, జెయింట్ స్లోత్‌లు, ''గిగాంటోపిథెకస్'' తదితర పెద్ద క్షీరదాలు నేలపై నివసించేవి. [[ఆస్ట్రేలియా]], [[మడగాస్కర్]], [[న్యూజీలాండ్|న్యూజిలాండ్]], పసిఫిక్ ద్వీపాల వంటి ఏకాంత ప్రాంతాల్లో ఏనుగు పక్షి, మోవా, హాస్ట్ డేగ, ''క్వింకానా'', ''మెగాలానియా, మీయోలానియా'' వంటి పెద్దపెద్ద పక్షులు సరీసృపాలు వృద్ధి చెందాయి.
 
మంచు యుగాల్లో తీవ్రమైన వాతావరణ మార్పులు వృక్ష, జంతుజాలాలపై తీవ్ర ప్రభావాలు కలిగించాయి. మంచు పెరుగుతూ ముందుకు వచ్చేకొద్దీ ఖండాల్లోని విశాలమైన ప్రాంతాలు పూర్తిగా నిర్జనమై పోయేవి. చొచ్చుకు వచ్చే హిమానీనదానికి ముందు దక్షిణ దిశగా వెళ్తూ పోయే మొక్కలు, జంతువులూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. జీవన ప్రదేశం తగ్గడం, ఆహార సరఫరా తగ్గడం తీవ్రమైన వాతావరణ మార్పులు తెచ్చిపెట్టిన పెద్ద ముప్పు. ప్రధాన విలుప్త సంఘటన, ఇందులో [[మామత్|మామత్‌లు]], మాస్టోడాన్లు, సేబర్-పళ్ళ పిల్లులు, ''గ్లిప్టోడాన్లు'', ఉన్ని ఖడ్గమృగం, శివాతేరియం వంటి వివిధ జిరాఫిడ్‌లు; నేల స్లోత్‌లు, ఐరిష్ ఎల్క్, గుహ ఎలుగుబంట్లు, గోమ్‌ఫోథేర్, తోడేళ్ళు, చిన్న ముఖం గల ఎలుగుబంట్లు వంటి పెద్ద [[క్షీరదాలు]] అంతరించిపోయిన ఘటన ప్లైస్టోసీన్‌ చివర్లో మొదలై హోలోసిన్‌లో కొనసాగింది. ఈ కాలంలోనే [[నియాండర్తల్]]<nowiki/>లు కూడా అంతరించి పోయారు. ఆఖరి మంచు యుగం చివరిలో, శీతల రక్తపు జంతువులు, చెక్క ఎలుకల వంటి చిన్న క్షీరదాలు, వలస పక్షులు, తెల్లతోక జింక వంటి వేగవంతమైన జంతువులూ మెగాఫౌనా స్థానాన్ని ఆక్రమించి ఉత్తరానికి వలస వెళ్ళాయి.
 
ఈ విలుప్త ఘటనల ప్రభావం ఆఫ్రికాపై పెద్దగా లేదు. [[ఉత్తర అమెరికా|ఉత్తర అమెరికాలో]] మాత్రం చాలా తీవ్రంగా ఉంది. అక్కడ స్థానిక [[గుర్రము|గుర్రాలు]], [[ఒంటె|ఒంటెలు]] తుడిచిపెట్టుకు పోయాయి.
పంక్తి 130:
శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల [[మానవ పరిణామం|పరిణామం]] ప్లైస్టోసీన్ సమయంలో జరిగింది. <ref>{{Cite journal|last=Rogers|first=A.R.|last2=Jorde|first2=L.B.|year=1995|title=Genetic evidence on modern human origins|url=|journal=Human Biology|volume=67|issue=1|pages=1–36|jstor=41465052|pmid=7721272}}</ref> <ref>{{Cite journal|last=Wall|first=J.D.|last2=Przeworski|first2=M.|year=2000|title=When did the human population start increasing?|journal=[[Genetics (journal)|Genetics]]|volume=155|issue=|pages=1865–1874|pmc=1461207|pmid=10924481}}</ref> ప్లీస్టోసీన్ ప్రారంభంలో ''పరాంత్రోపస్'' జాతి ఉనికిలో ఉంది. కాని దిగువ పాతరాతియుగం కాలానికిఅవి కనుమరుగయ్యాయి. అలాగే మానవుల తొలి పూర్వీకులూ ఉన్నారు. ప్లీస్టోసీన్‌లో ఎక్కువ భాగానికి చెందిన శిలాజ రికార్డులలో కనిపించే ఏకైక [[హోమినిని|హోమినిన్]] జాతి ''[[హోమో ఎరెక్టస్]]'' . సుమారు 18 లక్షల సంవత్సరాల క్రితం నాటి ''హోమో ఎరెక్టస్‌తో'' పాటు అషూలియన్ రాతి పనిముట్లు కూడా కనిపించాయి. ''ఎ. గార్హి'' జాతి, తొలి ''హోమో'' జాతులూ ఉపయోగించిన మరింత ప్రాచీనమైన ఓల్డోవాన్ పనిముట్ల స్థానంలో ఇవి వచ్చాయి. మధ్య పాతరాతియుగంలో ''హోమోలో'' మరింత వైవిధ్యమైన పరిణామం కనిపిస్తుంది. 200,000 సంవత్సరాల క్రితం కనిపించిన ''[[హోమో సేపియన్స్]]'' కూడా ఇందులో భాగమే
 
మైటోకాన్డ్రియల్ టైమింగ్ టెక్నిక్స్ ప్రకారం, ఈమియన్ స్టేజ్ లోని మధ్య పాతరాతియుగంలో రీస్ గ్లేసియేషను తరువాత [[హోమో సేపియన్స్|ఆధునిక మానవులు]] ఆఫ్రికా నుండి వలస వచ్చారు. ప్లైస్టోసీన్ చివర్లో మంచు లేని ప్రపంచం అంతటా వీరు విస్తరించారు. <ref>{{Cite journal|last=Cann|first=R.L.|last2=Stoneking|first2=M.|last3=Wilson|first3=A.C.|date=1 January 1987|title=Mitochondrial DNA and human evolution|url=|journal=Nature|volume=325|issue=6099|pages=31–36|bibcode=1987Natur.325...31C|doi=10.1038/325031a0|pmid=3025745}}</ref> <ref>{{Cite journal|last=Templeton, A. R.|date=7 March 2002|title=Out of Africa again and again|url=http://www.bioguider.com/ebook/biology/pdf/Templeton_n2002.pdf|journal=[[Nature (journal)|Nature]]|volume=416|issue=6876|pages=45–51|bibcode=2002Natur.416...45T|doi=10.1038/416045a|pmid=11882887}}</ref> ఈ మానవులు అప్పటికే ఆఫ్రికా నుండి బయట పడ్డ [[పురాతన మానవులు|పురాతన మానవ]] రూపాలతో జాత్యంతర సంపర్కం చేసుకుని, పురాతన మానవ జన్యు పదార్థాన్ని ఆధునిక మానవ జన్యు కొలనులో చేర్చుకున్నారు. <ref>{{Cite journal|last=Eswarana|first=Vinayak|last2=Harpendingb|first2=Henry|last3=Rogers|first3=Alan R|date=July 2005|title=Genomics refutes an exclusively African origin of humans|journal=Journal of Human Evolution|volume=49|issue=1|pages=1–18|doi=10.1016/j.jhevol.2005.02.006|pmid=15878780}}</ref>
 
== ఇవి కూడా చూడండి ==
 
* [[భూవైజ్ఞానిక కాల రేఖ]]
 
== నోట్స్ ==
"https://te.wikipedia.org/wiki/ప్లైస్టోసీన్" నుండి వెలికితీశారు