విద్య: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 112:
మనం ఈ రోజు అవలంబిస్తున్నవన్నీ ఐరోపా వాసుల విద్యావిధానాన్నే. విద్య, ఐరోపా మరియు అమెరికా వాసులు ప్రవచించిందే విద్య అనే మూఢ విశ్వాసాలనుండి ప్రపంచం బయట పడాలి. ఆసియాకూడా విజ్ఞాన ఖని. అందులోనూ భారత్, చైనా మరియు అరేబియా, విద్యా విజ్ఞానాలకు పుట్టినిల్లు. ప్రపంచానికి మన కాంట్రిబ్యూషన్ ఏపాటిది అని తెలియజేయాలంటే, మన పురాతన, జ్ఞాన సంపన్నుల గూర్చి శోధన అవసరం. [[నికోలస్ కోపర్నికస్]] ప్రపంచానికంతటికీ తెలుసు కాని [[ఆర్యభట్ట]] మన దేశంలో మనవారిలో కొందరికే తెలుసు. దీనికి కారణం, మనవారందించిన విజ్ఞానాన్ని మనం ఇంకా శోధించి, పొడిగించి ప్రపంచానికి అందివ్వక పోవడమే.
 
== ఇతర విషయాలు ==
 
విద్య పరమార్ధం విజ్ణానమే కాని ఉద్యోగం కాదు. అయితే నేడు దేశంలో విద్య యొక్క నిర్వచనం, పరమార్ధం మారిపోతున్నది. పూర్వం విద్యార్థులు విజ్ణాన సముపార్జన కోసం విద్యను అభ్యసించేవారు. నేటి విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం విద్యను అభ్యసిస్తున్నారు. ఇది బహు దురదృష్టకరము. మనిషి బ్రతుకడానికి వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం అను మూడు రకాలుగా ఉంది. విద్య వలన ఈ మూడింటినీ సమర్ధవంతంగా నిర్వర్తించవచ్చును. రైతులకు విద్య తోడైతే తమ వ్యవసాయ వృత్తిలో అధ్బుతంగా రాణించవచ్చును. పదిమందిలో దూసుకువెళ్ళిపోయి, ధైర్యం, స్వశక్తి మీద నమ్మకం ఉన్నవారు వ్యాపారం చేసుకొనేవారికి విద్య అండగా ఉంటుంది. ఇక ఉద్యోగం అనేది అతి హీన పరిస్థితుల్లో తినడానికి లోటు లేకుండా చేసుకొనే పనిగా చెప్పవచ్చు. అయితే నేటి అధ్యాపకులు తమ విద్యార్థులకు సమకాలీన సమాజ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కాకుండా కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నారు. దీని వలన దేశంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. చదువుకి, సంపాదనకి సంబంధం లేదని, సంపాదనకి కావాల్సింది తెలివితేటలు, చదువు లేనివారు సైతం కోట్లు సంపాదిస్తున్నారు అని, పదిమందికీ జీతాలిచ్చే ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయినా కనీసం నెలజీతం తీసుకొనే దిగువస్థాయి అవకాశం విద్యవల్ల దక్కుతుంది అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గ్రహించవలసియున్నది.
"https://te.wikipedia.org/wiki/విద్య" నుండి వెలికితీశారు