భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 114:
న్యాయవ్యవస్థలో పరమోన్నత న్యాయస్థానమైన [[సుప్రీం కోర్టు]], మరియు అప్పిలేట్ కోర్టులు, హైకోర్టులు ఉంటాయి. కోర్టులకు సూచనలు, ఆదేశాలు, రిట్లు ఇచ్చే అధికారం ఉంది. రిట్లలో [[హెబియస్ కార్పస్]], [[మాండమస్]], [[నిషేధం]], [[కోవారంటో]] మరియు [[సెర్టియోరారి]] అనే వివిధ రకాలుగా ఉన్నాయి. భారతీయ కోర్టులు రాజ్యాంగ శక్తులు; ఇవి రాజకీయ జోక్యం లేనివి. న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు అరుదుగా ఏర్పడే ఘర్షణను రాష్ట్రపతి మధ్యవర్తిత్వం వహించి నివారిస్తారు.
 
స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక భాగం, కేంద్ర ప్రభుత్వంలో [[భారత జాతీయ కాంగ్రెసు]] పార్టీ అధికారంలో ఉంటూ వచ్చింది. స్వాతంత్ర్యానికి పూర్వం అతిపెద్ద రాజకీయ పక్షం కావడం చేత, స్వాతంత్ర్యం తరువాత దాదాపు 40 ఏళ్ళపాటు దేశరాజకీయాల్లో కాంగ్రెసు గుత్తాధిపత్యం వహించింది. [[1977]]లో [[జనతా పార్టీ]]గా ఏర్పడ్డ ఐక్య ప్రతిపక్షం కాంగ్రెసును ఓడించి, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ఇటీవలి కాలంలో, భారత ఓటర్లపై గల పట్టును కాంగ్రెసు పార్టీ కోల్పోతూ వచ్చింది. [[సార్వత్రిక ఎన్నికలు 2004|2004 సార్వత్రిక ఎన్నికలలో]] అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెసు పార్టీ, వివిధ చిన్న పార్టీలతో కలిసి [[సంకీర్ణ ప్రభుత్వాన్నిప్రభుత్వా]]న్ని ఏర్పాటు చేసింది. హిందూ వాద పార్టీ అయిన [[భారతీయ జనతా పార్టీ|భాజపా]] ప్రధాన ప్రతిపక్షమైంది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కారణంగా [[1996]] తరువాత ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణాలేకాగా 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయింది .ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పదిశాతం లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం కూడా కష్టంకాగా భారతీయ జనతా పార్టీ మాత్రం మొదటిసారిగా అత్యధిక స్థానాలను గెలుచుకోవడం విశేషం.
 
ఇంకా చూడండి:
"https://te.wikipedia.org/wiki/భారతదేశం" నుండి వెలికితీశారు