తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

లింక్
లింక్
పంక్తి 38:
==చరిత్ర==
 
[[రామానుజాచార్యుడు|రామానుజాచార్యులు]] కొండ కింద [[గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి|గోవిందరాజస్వామి ఆలయాన్ని]] ఏర్పాటుచేయడంతో తిరుమల చరిత్రకు బీజం పడింది. తన శిష్యుడైన యాదవరాజును రామానుజులు ప్రోత్సహించి అప్పటికే ఉన్న చెరువు పక్కన ఆలయ నిర్మాణం ప్రారంభించేలా చేశారు. యాదవరాజు దేవాలయాన్ని నిర్మించడం పూర్తయ్యాకా క్రమంగా చుట్టూ అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరిట ''[[రామానుజపురం (గంభీరావుపేట్)|రామానుజపురం]]'' అని నామకరణం చేశారు. రామానుజపురమే కాక యాదవరాజు చాలా గృహాలు నిర్మించారు. [[శ్రీశైలపూర్ణుడు]], [[అనంతాచార్యులు]] వంటి భక్తులకు నివాసాలు ఏర్పాటుచేశారు. దేవాలయానికి తూర్పున ధాన్యాగారం, వాయువ్యదిశలో అంగడి వీధి నిర్మించి నేటి తిరుపతి నగరానికి ఆనాడు పునాదివేశారు.<ref name="తిరుమల చరితామృతం 57">తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో బుక్స్:2013:పేజీ 57</ref>
==శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం==
శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాచీనతకు చాలా సాహిత్యపరమైన ఆధారాలు, శాసనాధారాలు ఉన్నాయి. విజయనగర చక్రవర్తి [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవరాయలు]] తిరుపతి వేంకటేశ్వరస్వామిని చాలా మార్లు దర్శించుకొని కానుకలు సమర్పించాడు. [[చంద్రగిరి]] కోట నుంచి [[తిరుమల]] గిరుల పైకి చేరుకోవటానికి అతి సమీప కాలి మార్గమైన [[శ్రీ వారి మెట్టు]] ద్వారా [[శ్రీ కృష్ణదేవ రాయలు]] తరచూ స్వామి దర్శనమునకు డోలీపై వెళ్ళేవాడు. 9వ శతాబ్దంలో [[కాంచీపురము|కాంచీపురాన్ని]] పరిపాలించిన [[పల్లవులు]], ఆ తరువాతి శతాబ్దపు [[తంజావూరు]] [[చోళులు]], [[మదురై]]ని పరిపాలించిన [[పాండ్యులు]], [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] చక్రవర్తులు, సామంతులు ఈ వేంకటేశ్వరస్వామి భక్తులై కొలిచారు. ఒకరిని మించి మరొకరు పోటీపడి ఆలయనిర్వహణకు, సేవలకు దానధర్మాలు చేశారు. విజయనగర సామ్రాజ్య పరిపాలనలో ఆలయానికి చాలా సంపద చేకూరింది. శ్రీ కృష్ణదేవరాయలు తన ఇద్దరు భార్యల విగ్రహాలను, తన విగ్రహాన్ని, ఆలయ మండపం పై ప్రతిష్ఠింపజేశాడు. ప్రధాన ఆలయంలో [[వేంకటపతి రాయలు|వేంకటపతి రాయల]] విగ్రహం కూడా ఉంది. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత, దేశం నలుమూలల ఉన్న చాలామంది చిన్న నాయకులు, ధనవంతులు దేవాలయాన్ని పోషించి కానుకలు బహూకరించడం కొనసాగించారు. [[మరాఠీ భాష|మరాఠీ]] సేనాని, [[రాఘోజీ భోంస్లే]] ఆలయాన్ని సందర్శించి గుడిలో నిత్య పూజా నిర్వహణకై శాశ్వత దాన పథకాన్ని స్థాపించాడు. ఈయన వేంకటేశ్వర స్వామికి ఒక పెద్ద మరకతాన్ని, విలువైన వజ్రవైఢూర్యాలను బహూకరించాడు. ఆ మరకతం ఇప్పటికీ రాఘోజీ పేరుతో ఉన్న ఒక పెట్టెలో భద్రంగా ఉంది. ఆ తరువాతి కాలంలో పెద్ద పెద్ద దానాలు చేసిన వారిలో [[మైసూరు]] మరియు [[గద్వాల]] పాలకులు చెప్పుకోదగినవారు. హిందూ సామ్రాజ్యాల తరువాత, పాలన [[కర్ణాటక యుద్ధాలు|కర్ణాటక]] ముస్లిం పాలకుల చేతిలోకి, ఆ తరువాత బ్రిటీషు వారికి వెళ్లింది. తిరుపతి గుడి కూడా వారి పర్యవేక్షణ కిందికి వచ్చింది. అయితే చరిత్రపరంగా ఆలయం మొదట బౌద్ధ / జైన దేవాలయమనిbవాదించే చరిత్రకారులు లేకపోలేదు <ref>http://prearyan.blogspot.in/2010/03/tirupati-balaji-is-jain-temple-of.html</ref><ref>Tirupati Balaji was a Buddhist Shrine - by Prof. Dr. M. D. Nalawade, M.A., B.Ed., LL. B., Ph. D.,Ex- Registrar, Retd. Professor and Head of History Dept. Pune University</ref>
[[File:MS Subbalaxmi. Tirupati (1).JPG|thumb|right|తిరుపతిలో ఎం.ఎస్.సుబ్బలక్ష్మి విగ్రహము]]
 
"https://te.wikipedia.org/wiki/తిరుపతి" నుండి వెలికితీశారు