తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

లింక్
లింక్
పంక్తి 60:
*'''[[గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి|గోవిందరాజ స్వామి దేవాలయం:]]''' తిరుపతిలో మేఘాలను తాకేంత పెద్దదా అనిపించే అద్భుత [[రాజగోపురం]]తో తిరుపతికే ప్రత్యేక శోభను కలుగజేస్తున్న గోవిందరాజస్వామి ఆలయం ఉంది. క్రీ.శ. 1130లో [[రామానుజాచార్యులు]] ఈ ఆలయాన్ని భక్తజనాంకితం చేశారు. ఈ [[రాజగోపురం|రాజగోపురాన్ని]] 1624లో స్వామిభక్తుడు [[మట్లి అనంతరాజు]] నిర్మించారు. గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అనేకానేక ఆలయాలు ఉన్నాయి. గతంలో ఇది [[శ్రీకృష్ణ ఆలయం]] అయినా, నాటి మూలవిరాట్‌ అయిన [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుని]] మీద తురుష్కుల విధ్వంస చర్యలవల్ల ఆ విగ్రహం పూజార్హత కోల్పోవటంతో, ఆలయం క్రమంగా గోవిందరాజస్వామి పరమయిందని అంటారు. తిరుమలలోని [[శ్రీ వేంకటేశ్వరుడు|వేంకటేశ్వరుని]] పెద్దన్నగా భక్తులు కొలిచే గోవిందరాజస్వామి వారి ఆలయంలో కొన్ని పూజలూ పునస్కారాలూ తిరుమల ఆలయ పూజలతో ముడిపడి ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారి తలకింద ఒక పెద్ద కుంచం ఉంటుంది. వేంకటేశ్వరుడు తన వివాహ సమయంలో, [[కుబేరుడు|కుబేరుడి]] వద్ద తీసుకున్న రుణాన్ని సకాలంలో, సరిగ్గా తీర్చే బాధ్యతలో నిమగ్నమయిన గోవిందరాజస్వామి, ఆ ధనాన్ని కొలిచి కొలిచి అలసిసొలసి, రవ్వంత విశ్రమిస్తున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయంలోని విగ్రహం!
*'''[[కోదండ రామాలయం, తిరుపతి|కోదండ రామాలయం]]:''' ఈ [[ఆలయం]]లోని ప్రత్యేకత ఏమిటంటే, [[సీత|సీతమ్మతల్లి]] [[రామావతారము|రాములవారికి]] కుడివైపున ఉండటం! ఇది [[వైఖానసశాస్త్రం|వైఖానసశాస్త్ర]] సంప్రదాయం. భద్రాచల రాముడి విగ్రహాన్ని మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకొంటే, అక్కడ సీతమ్మతల్లి, రాములవారి ఎడమవైపు తొడమీద కూర్చున్నట్లున్న దృశ్యం గుర్తొస్తుంది!
*'''[[కపిలతీర్థం]]:'''కపిల మహాముని యొక్క తపోఫలితానికి మెచ్చి ఈశ్వరుడు ఆవిర్భవించిన క్షేత్రం. [[టిటిడి]] యొక్క పర్యవేక్షణలో ఉన్న ఆలయాలలో ఈ ఆలయం కూడా చెప్పుకోదగినది. తిరుమల గిరులకు ఆనుకొని ఉన్న ఈ ఆలయం మరియు ఇక్కడి జలపాతాలు మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. తిరుపతిలో దర్శించదగిన ఆలయాలలో ఇది చెప్పుకోతగినది.
*'''వరదరాజ స్వామి దేవాలయం:'''ఇది [[కపిల తీర్థం రోడ్డు]] లేదా [[కే టీ రోడ్డు]]లో ఉంది. 1990 ల ప్రాంతంలో ఈ గుడిని జీర్ణోధరణ గావించారు. ఇక్కడ సన్నిధిలో శ్రీ నృసింహస్వామి మరియు శ్రీ సుదర్శనచక్రతాళ్వార్లు ఏకశిలలో పూజలందుకుంటున్నారు. శ్రీ సుదర్శనచక్రతాళ్వార్లు గోవిందరాజస్వామి దేవాలయం సన్నిధిలో కూడా పూజలందుకుంటున్నారు.
*'''జీవకోన:'''జీవకోన కపిల తీర్తానికి కొంచెం దూరంలో వున్న తిరుపతి రూరల్ మండలం. ఇక్కడ ప్రకృతి సహజసిద్దంగ ఏర్పడ్డ శివలింగం చూడవచ్చు. కొండపక్కన అటవీ ప్రాంతంలో జాలువారేజలపాతం మద్య ఈశ్వరుని దర్శనం అద్భుతం.
"https://te.wikipedia.org/wiki/తిరుపతి" నుండి వెలికితీశారు