శతానంద మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
==జననము==
గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు దాంపత్య బ్రహ్మచర్యమును గడిపిన పిమ్మట అహల్యను ఆదరించి వలసిన కోరిక కోరుమనెను. ఆమె స్త్రీసహజమగు మాతృత్వాన్ని కాంక్షించింది. గౌతముడానందించి యోగబలమున నవయువకుడై అహల్యాకాంత నిండు యౌవనమునకు పండువెన్నెలయై సర్వలోకములందలి మనోహర కేళీవనముల నూరుచోట్ల నూరువిధములగు రత్యానందము నామెను అనుభవింపజేసి ఆమె కోరికను తీర్చెను. ఫలితముగా ఆమె గర్భము ధరించి నవమాసములు మోసి పుత్రరత్నమును పొందెను. అహల్యాగౌతముల శాతవిధానందఫల మగుటచేత అతనికి గౌతముడు "శతానందుడు" అని సార్ధక నామకరణము చేసెను.
 
==జీవిత విశేషాలు==
శతానందుడు తండ్రి గౌతముని వద్దనే సమస్త వేదశాస్త్రాది విద్యలు అభ్యసించి బ్రహ్మచర్యాశ్రమము పాటించుచు మహా తపశ్శాలి అయ్యెను.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శతానంద_మహర్షి" నుండి వెలికితీశారు