"శతానంద మహర్షి" కూర్పుల మధ్య తేడాలు

శతానందుడు తండ్రి గౌతముని వద్దనే సమస్త వేదశాస్త్రాది విద్యలు అభ్యసించి బ్రహ్మచర్యాశ్రమము పాటించుచు మహా తపశ్శాలి అయ్యెను. ఈతని బుద్ధివైభవము, జ్ఞానసంపద, శీలగౌరవము, తపోనిరతి విని [[జనక మహారాజు]] తన ఆస్థాన పురోహితునిగా వుండుమని అర్ధించెను. గౌతమ మహర్షి ఆనందించి, గుణశీలవతి అయిన కన్యామణితో వివాహమొనరించి భార్యాసహితునిగా శతానందుని జనక చక్రవర్తికి కులగురువుగా మిథిలా నగరమునకు పంపెను.
 
తరువాత కాలంలో గౌతముడు అహల్యను శపించుట, శ్రీరాముని జననము, వనవాసము, యాగ రక్షణ కొరకు విశ్వామిత్రుని వెంట జనుట, శతానందుని తల్లిని శాపవిమోచనము జరిగి [[శ్రీరాముడు]] మిధిలకు వచ్చినప్పుడు, జనక మహారాజుతో శతానందుడు వారికి స్వాగతము పకికెను. శ్రీరాముడు శివధనుర్భంగము గావించి సీతను వివాహమాడునపుడు దశరథుని వైపు వసిష్టుడు, జనకుని వైపు శతానందుడు గోత్రప్రవరాదులు చెప్పి సీతారామ కల్యాణమును జరిపించిరి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/278357" నుండి వెలికితీశారు