"ఎనిమిది" కూర్పుల మధ్య తేడాలు

సాలెపురుగుకి ఎనిమిది పాదాలుంటాయి కాని, దానిని అష్టపది అని అనరు.
 
బుద్ధుడు బోధించినది [[అష్టాంగ మార్గం]]. ఆ మార్గాలు ఏమిటయ్యా అంటే – సమ్యగ్‌దృష్టి, సమ్యస్సంకల్పం, సమ్యగ్వాక్కు, సమ్యక్కర్మ, సమ్యగ్జీవనం, సమ్యగ్‌వ్యాయామం, సమ్యక్‌స్మృతి, సమ్యక్‌సమాధి.
 
ఎనిమిది శరీర అవయవాలతో చేసేదే సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ నమస్కారం మగవారే చెయ్యవచ్చుట.
అష్టాగ్నులు, అష్టకష్టాలు, అష్టకర్మలు, అష్టగణపతులు, అష్టలక్ష్మిలు, అష్టదిక్పాలకులు, అష్టదిగ్గజాలు, …, ఇలా ఎన్నో అష్ట మాటలు మన భాషలో ఉన్నాయి.
 
[[పాణిని]] రచించిన వ్యాకరణ గ్రంథంలో ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి కనుక దానిని [[అష్టాధ్యాయి]] అన్నారు.
 
అష్టభాషలలో [[సంస్కృతం]], [[ప్రాకృతం]], శౌరసేని, మాగధి, పైశాచి, చూళికాపైశాచి, అపభ్రంశం, [[తెలుగు]] ఉన్నాయనిన్నీ ఇందులో తెలుగు ఉండడం గమనించదగ్గ విషయమనిన్నీ మనవి చేసుకుంటున్నాను.
 
ఒక్క తెలుగు భాషలోనే [[అష్టావధానం]] అనే ప్రక్రియ మొదలయింది. కన్నడంలో కూడ ప్రయత్నాలు జరిగేయని విన్నాను కాని ఇది తెలుగు వారి సొత్తేమో అని అనిపిస్తూ ఉంటుంది. మరో విషయం. ఈ రోజుల్లో అష్టావధానులకి అమెరికాలో ఉన్న పలుకుబడి, గిరాకి ఇండియాలో ఉన్నట్లు కనిపించదు.
 
“అష్టవర్షా భవేత్కన్యా” అన్న శ్లోకాన్ని ఉదహరిస్తూ మనవాళ్లు ముక్కుపచ్చలారని అమ్మాయిలకి పెళ్లిళ్లు చేసేసి వాళ్లని అష్టకష్టాలు పెట్టేసేవారు.
 
బ్రహ్మో దైవస్తదైవార్ష: ప్రజాపత్యస్తధాసురః |
గాంధర్వో రాక్షసశ్చైవ పైశాశ్చా ష్టమో 2 ధమః || ([[మనుస్మృతి]] 3-21)
 
బ్రహ్మము, దైవము, అర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గంధర్వం, రాక్షసము, పైశాచికం, అని వివాహాలు ఎనిమిది రకాలు. వీటిల్లో మొదటి నాలుగు రకాలు ఈ రోజుల్లో జరగడం లేదు.
అష్టా, చెమ్మా అనే ఆటలో అష్టా అంటే ఎనిమిది ఎలా వచ్చిందో ఊహించవచ్చు కాని చెమ్మా అంటే నాలుగెలా అయిందో ఊహకి అందడం లేదు. చార్ లోంచి వచ్చిందేమో.
 
ఎనిమిదికి భారత, భాగవత కథలలో కొంత ప్రత్యేకత ఉంది. అష్టవసువుల్లో ఎనిమిదవ వాడే [[భీష్ముడు]]. శ్రీకృష్ణుడుశ్రీ [[కృష్ణుడు]] దేవకీ వసుదేవులకి అష్టమి నాడు పుట్టిన ఎనిమిదవ సంతానం, పైపెచ్చు దశావతారాలలో ఎనిమిదవ అవతారం.
 
చైనాలో[[చైనా]]లో 8 కి అదృష్టానికి అవినాభావ సంపర్కం ఉంది. వాళ్ళకి 8 మీద ఎంత మోజు అంటే బైజింగ్ ఒలింపిక్ కార్యక్రమాన్ని 2008 ఆగస్టు 8 తేదీన సాయంకాలం 8 గంటల 8 నిమిషాల 8 సెకండ్లకి మొదలు పెట్టేరు.
 
కొలమానాలలో - అమెరికాలో 8 ఔన్సులు[[ఔన్సు]]లు ఒక కప్పు; 8 [[పైంట్లు]] ఒక [[గేలను]]; బ్రిటన్ లో 8 ఫర్లాంగులు ఒక [[మైలు]].
 
కొలమానాలలో - అమెరికాలో 8 ఔన్సులు ఒక కప్పు; 8 పైంట్లు ఒక గేలను; బ్రిటన్ లో 8 ఫర్లాంగులు ఒక మైలు.
==గణితంలో ఎనిమిది==
దశాంశ పద్ధతిలో ఒక సంఖ్యని 8 చేత నిశ్శేశంగా భాగించగలమో లేమో తెలుసుకోవాలంటే ఆ సంఖ్య చివర ఉన్న మూడంకెల సంఖ్యని 8 చేత నిశ్శేశంగా భాగించగలిగితే చాలు. ఉదా: 680 ని 8 చేత నిశ్శేషంగా భాగించగలం. 56680 ని కూడ 8 చేత నిశ్శేషంగా భాగించగలం.
7,887

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2784089" నుండి వెలికితీశారు