శతానంద మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
తరువాత కాలంలో గౌతముడు అహల్యను శపించుట, శ్రీరాముని జననము, వనవాసము, యాగ రక్షణ కొరకు విశ్వామిత్రుని వెంట జనుట, శతానందుని తల్లిని శాపవిమోచనము జరిగి [[శ్రీరాముడు]] మిధిలకు వచ్చినప్పుడు, జనక మహారాజుతో శతానందుడు వారికి స్వాగతము పకికెను. శ్రీరాముడు శివధనుర్భంగము గావించి సీతను వివాహమాడునపుడు దశరథుని వైపు వసిష్టుడు, జనకుని వైపు శతానందుడు గోత్రప్రవరాదులు చెప్పి సీతారామ కల్యాణమును జరిపించిరి.
 
 
అతనికి [[సత్యధృతి]] అను కుమారుడు కలిగెను. అతడు పుట్టగానే చేత [[బాణము]] వుండిన కారణమున ఆతనికి 'శరద్వంతుడు' అని పేరు వచ్చెను. అప్పటినుండే శరము విడువక అతని మనస్సు వేదశాస్త్రాది విద్యలందు కంటె ధనుర్వేదమందే లగ్నము కాజొచ్చెను. సత్యధృతి మహాతప మొనరించి ధనుర్వేదమును, వివిధాస్త్రములను సాధించెను. ఈతని తపోభంగమును చెరప, [[ఇంద్రుడు]] జాలవతి అను దేవకన్యను పంపెను. మహా సౌందర్యవతి అయిన ఆమెను చూచినదే సత్యధృతి చేతిలోని విల్లమ్ములు జారి క్రిందపడెను. అది గ్రహించి తన కామోద్రేకమును నిగ్రహించుకొనెను. కాని, అతనికి తెలియకుండకుండా రేతః పతనమై అది రెల్లుగడ్డిలో పడెను. అది రెండు భాగములై అందుండి ఒక బాలుడు, ఒక బాలిక జన్మించిరి. కొంతకాలమునకు [[శంతన మహారాజు]] వేటాడుచు అక్కడికి వచ్చి వారిని చూచి తన బిడ్డలుగా పెంచుకొనెను. వారికి జాతక కర్మాది సంస్కారములు గావించి తనచే కృపతో పెంచబడిరి కావున వారికి [[కృపుడు]], [[కృపి]] అని నామకరణము చేయించెను. ఈ సంగతి గ్రహించిన సత్యధృతి శంతనునితో తన సంగతి చెప్పి కృపునకు చతుర్విధ ధనుర్వేదములును నానా విధ శాస్త్రములను నేర్పెను. అతడే విలువిద్యయందు పరమాచార్యుడై భీష్ముని ప్రార్ధనమున కౌరవ పాండవులకు గురువు అయ్యెను.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శతానంద_మహర్షి" నుండి వెలికితీశారు