శ్రీశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

106.76.213.211 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2774438 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
చి చిన్న సవరణ
పంక్తి 151:
;తెలుగు భాష గురించి:
 
:తెలుగే మన జాతీయ భాష కావాలనేది నా అభిమతం.ఇది భాషా దురభిమానంతో అంటున్న మాటకాదు. తెలుగు భారతదేశం అంతకీ జాతీయభాష కాగల అర్హత గలదని జె.బి.యస్.హాల్డేన్ అన్నారు. సంస్కృత పదాలను జీర్ణించుకున్న కారణంచేత అటు ఉత్తరాదివారికీ, ద్రావిడ భాషా కుటుంబంలో ఒకటి కావడంవల్ల ఇటు దక్షిణాది వారికీ తెలుగు నేర్చుకోవడం చాలా సులభమని హాల్డేన్ పండితుని వాదన. దేశంలో హిందీ భాషదే మొదటిస్థానమయినా, ఆ భాష మాట్లాడే వాళ్ళంతా కలిపి నలభై శాతానికి మించరు. అంతేకాక హిందీ ఒక చిన్నచెట్టుకు పరిమితం! రెండవ భాష అయిన తెలుగు సుమారు ఆరుకోట్ల మంది ఆంధ్రులకు మాతృభాష! పైగా తెలుగువారు దేశమంతటా, అన్ని రాష్ట్రాలలోనూ వ్యాపింఛివ్యాపించి ఉన్నారు.
 
;తెలుగు కవిత్రయం గురించి :
పంక్తి 161:
==== కవిసామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] తో స్పర్థ ====
 
:శ్రీశ్రీకి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణకు మధ్య గల స్పర్థ ప్రసిద్ధమైనది. విశ్వనాథ సత్యనారాయణ అంటే శ్రీశ్రీకి ఒకవిధమైన గురుభావం ఉండేది. శ్రీశ్రీ కవిత్వం ప్రారంభించిన సమయంలో ఆయనపై విశ్వనాథ సత్యనారాయణ ప్రభావం చాలా గాఢంగా ఉంది. ఆయన శైలిలో కవిత్వం రాయాలని తీవ్రమైన ప్రయత్నం చేసేవారు. తాను మద్రాసులో ఉన్న రోజుల గురించి చెప్తూ:'''మదరాసులో ఉన్న రోజుల్లో నన్ను బ్రతికించినవారు ఇద్దరే. ఒకరు మున్సిపాలిటీ కుళాయి వాళ్లు, రెండోది విశ్వనాథ సత్యనారాయణ పద్యాలు''' అని చెప్పుకున్నారు. 1934లో శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు వ్రాస్తున్న సమయంలో కవిత్వాన్ని గురించి, కవి గురించి గొప్ప తాత్త్వికత, వాస్తవికత మేళవించి వ్రాసిన ఆత్మాశ్రయ గేయం ''కవితా ఓ కవితా'' నవ్యసాహిత్య పరిషత్ వేదికపై చదివారు. అప్పటి అధ్యక్షుడు, అప్పటికే కవిగా సుప్రఖ్యాతుడు అయిన విశ్వనాథ నాటి వర్థమాన కవి అయిన శ్రీశ్రీని ఆనందబాష్పాలతో వేదికపైన నడిచివచ్చి గుండెలకు హత్తుకున్నారు. ఆ గీతాన్ని ఎంతగానో పొగడి శ్రీశ్రీ కవితా సంకలనాన్ని(మహాప్రస్థానంగా వెలువడింది) తానే ప్రచురిస్తానని, దీనికి ముందుమాట రాయాలని చలాన్ని కోరారు. ముందుమాట వ్రాయించేందుకు చింతా దీక్షితుల మధ్యవర్తిత్వాన్ని కూడా నెరిపారు. కానీ అప్పటికి విశ్వనాథ పేరున్న కవే అయినా ఆర్థికంగా ఏ ఆధారంలేక దేశమంతా వాగ్మిగా తిరుగుతున్న నిరుద్యోగి. వేరొకరి పుస్తకం ప్రచురించగల సమర్థుడు కాదు. ఏవో కారణాల వల్ల మహాప్రస్థానాన్ని ఆయన ప్రచురించలేదు. నళినీమోహన్ అనిఅనే సాహిత్యాభిలాషి ముద్రించారు.
విశ్వనాథ శ్రీశ్రీపై ఇంతగా ఆప్యాయత చూపినా, శ్రీశ్రీకి విశ్వనాథ కవితాశక్తిపై చిన్ననాటి నుంచి ఎంతో అభిమానం (కొన్నేళ్ళు హీరోవర్షిప్) ఉన్నా వారిద్దరి వ్యతిరేక భావాలు విభేదాలు తీసుకుచ్చాయి. భావాలకు మించి విశ్వనాథకున్న కుండబద్దలు గొట్టే మాట, శ్రీశ్రీలోని మాట తూలే లక్షణం మరింత ఆజ్యం పోశాయి. విశ్వనాథ రచించిన రామాయణ కల్పవృక్షం గొప్ప రచన కాదని శ్రీశ్రీ అభిప్రాయం. నిజానికి తన అన్ని రచనల్లోనూ విశ్వనాథకు రామాయణంపైనే అభిమానం ఒక పాలు ఎక్కువ. దీనిని వెక్కిరిస్తూ ఒక్కడైనా రామాయణ కల్పవృక్షం చదివానంటే విశ్వనాథ పొంగిపోతాడనీ, సంస్కృతం రాకున్నా వాల్మీకం అర్థమైంది గానీ తెలుగు వచ్చినా కల్పవృక్షం అర్థంకాలేదని చాలాచాలా మాటలే మాట్లాడారు. విశ్వనాథకు సంస్కృతం అంత బాగా రాదని చెప్పడం కోసం, 'సంస్కృతంలో విశ్వనాథ కంటే గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప పండితుడు' అని ప్రకటించాడు శ్రీశ్రీ. దీనిపై శ్రీశ్రీ జీవితచరిత్రకారుడు ''శ్రీశ్రీకి విశ్వనాథ సంస్కృత పాండిత్యం ఈర్ష్య పుట్టించిందనిపిస్తుందని'', లేని పక్షంలో దీనికి మరోకారణం కనిపించదని వ్యాఖ్యానించారు. ''తనంతటి మహాకవి వెయ్యేళ్ళ వరకూ పుట్టడ''ని విశ్వనాథ తన గురించి తానే ప్రకటించుకోగా, శ్రీశ్రీ ''నిజానికాయన వెయ్యేళ్ళ కిందటే పుట్టాడ''ని అన్నాడు.<br />
ఈ వాగ్వాదాలకు పరాకాష్ఠగా మొదటి తెలుగు మహాసభల వివాదం సాగింది. దీనిలో విశ్వనాథ, శ్రీశ్రీ పేరున ఈ మహాసభలను వ్యతిరేకిస్తూ ఒక లేఖ పత్రికలకు విడుదల కాగా తన సంతకాన్ని శ్రీశ్రీయే ఫోర్జరీ చేశారని విశ్వనాథ ఆరోపించారు. ఆ మహాసభలకు విశ్వనాథ హాజరుకాగా, శ్రీశ్రీ వ్యతిరేకించడం, బహిష్కరణకు పిలుపునివ్వడం వల్ల ఒక రాత్రి బొలారం పోలీస్ స్టేషన్లో నిద్రచేశారు. ఈ ఆరోపణ ప్రత్యారోపణలు వారిద్దరి నడుమ సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతీశాయి. మళ్ళీ విశ్వనాథను నన్నయ ఉన్నంతకాలం ఉంటారని, ఐతే తిక్కన-వేమన-గురజాడ అనే కవిత్రయంలో మాత్రం చేరరని వ్యాఖ్యలూ చేశారు. విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలను చివరి వరకూ ప్రశంసించారు. ఆయన మరణానంతరం విశ్వనాథను గొప్పగా ప్రశంసిస్తూ ''కొండవీటి పొగమబ్బు/తెలుగు వాడి గోల్డునిబ్బు/మాట్లాడే వెన్నెముక/పాటపాడే సుషుమ్న/మాట్లాడే ద్విపద/సత్యానికి నా ఉపద'' అంటూ రాసిన కవిత సుప్రఖ్యాతం. చివరి వరకూ వారిద్దరి నడుమ ఒకరు మరొకరి కవితా శక్తులను కొన్ని పరిమితులకు లోబడి ప్రశంసించుకోవడమూ, ఒక్కోమారు బయటపడి ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడమూ, తుదకీ అనురాగం-ద్వేషాల దాగుడుమూతలాట సాగింది.
పంక్తి 173:
*ఆ రోజుల్లో శ్రీశ్రీ [[రాజమండ్రి]] ఆర్యాపురంలో అద్దెకు ఉండేవారు-[[గురజాడ అప్పారావు]] '[[కన్యాశుల్కం]]' నాటకాన్ని సినిమాగా తీయాలని. ఆ సందర్భంలో శ్రీశ్రీకి నా గురించి ఎలాగో తెలిసింది 'ఆర్ట్స్ కాలేజీలో ఒక కుర్రాడున్నాడని, ఆయన రాసిన కవితల్ని , పద్యాలని బాగా వినిపిస్తాడని'. అప్పటికి శ్రీశ్రీకి 30 ఏళ్లుంటాయి. వీరికి 16 ఏళ్లు. ఒకరోజు ఆయన హాస్టల్‌కు వచ్చి 'ఇక్కడ జగన్నాథరావు ఎవరు?' అని అడిగారు. 'నేనే' అని బదులిచ్చారు వీరు. అప్పటిదాకా ఆయనే శ్రీశ్రీ అని వీరికి తెలీదు. 'నీవు శ్రీశ్రీ కవితల్ని రిసైట్ చేస్తావట కదా, ఏదీ చెప్పు?' అన్నారు.
 
'అవును. కానీ ఇప్పుడు చెప్పే మూడ్ లేదు' అన్నారు. 'మరి మూడ్ ఎప్పుడు వస్తుందో చెప్పు. అప్పుడు వస్తాను' అన్నారు శ్రీ శ్రీ. 'సాయంత్రం' అన్నారు వనమాలి. మళ్లీ సాయంత్రం వచ్చారు శ్రీశ్రీ. ఇద్దరం కలిసి [[గోదావరి]] స్టేషను దగ్గర్లో ఉన్న ఒక లంకకు నావలో వెళ్లి, ఇసుకలో కూర్చురు. అప్పుడు చెప్పారు 'తనే శ్రీశ్రీ' అని. తనతో నండూరి ఎంకిపాటలు కూడా పాడించుకున్నారు శ్రీ శ్రీ . అలా మొదలయ్యింది వారిమధ్య స్నేహం. ఇద్దరి మధ్యా పదిహేనేళ్ల వయసు తేడా ఉన్నా మంచి స్నేహితులయ్యారు. సినిమా షూటింగ్ లేనప్పుడు ఇద్దరం కలుసుకునే వాళ్ళు. (జగన్నాథరావు వనమాలి [[జె.ఆర్. వనమాలి]]గా సుప్రసిద్ధుడు. అంచెలంచెలుగా ఎదిగి 20 ఏళ్లక్రితం 'వర్డ్స్ అండ్ వాయిసెస్' అనే సంస్థని ముంబాయిలో స్థాపించాడు. సినినాసినిమా మరియు ప్రకటన రంగాల్లో ఇప్పుడు నిష్ణాతులుగా పేరుతెచ్చుకున్న ఎందరో కళాకారులకు వనమాలి తొలి గురువు. థియేటర్ ఆర్ట్స్ రంగంలో 'వాయిస్ ఆర్టిస్ట్'గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా పొందాడు. )
=== యోగ్యతా పత్రం ===
 
పంక్తి 185:
 
అయితే శ్రీశ్రీ ఆ పాఠకుడి ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు: "మీరు సార్ధక నామధేయులంటాను"
* శ్రీశ్రీ పుట్టుకతొ మనిషి, వృద్దాప్యంలో మహారిషిమహార్షి, మద్యలో మాత్రమే కవి, ఏప్పటికీ ప్రవక్త. ( శ్రీశ్రీ గారి మరణానంతరం ఈనాడు దిన పత్రికకు వేటూరి గారు వ్రాసిన వ్యాసం నుండి.)
 
==మూలాలు, వనరులు==
"https://te.wikipedia.org/wiki/శ్రీశ్రీ" నుండి వెలికితీశారు