తేనీరు: కూర్పుల మధ్య తేడాలు

+డార్జిలింగ్ తేనీరు లింకు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Tea leaves steeping in a zhong čaj 05.jpg|right|thumb|220px|గిన్నెలో ఆకుపచ్చ తేయాకు.]]
'''తేనీరు''' ([[ఆంగ్లం]] Tea) ఒక [[పానీయం]]. [[తేయాకు]]ను నీటిలో మరిగించి వచ్చిన ద్రావకాన్ని [[తేనీరు (టీ)]] అంటారు. మానవ దేహానికి ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్ధాలలో టీ ప్రథమ స్థానంలో ఉంటుంది. దీనిలో [[పంచదార]], [[పాలు]] కలుపుకొని త్రాగుతారు.
 
== ఉపయోగాలు ==
నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ త్రాగడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపడం జీవితంలో ఓ అంతర్భాగమైపోయింది. సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికిపైగా టీ సేవిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం మానసిక విశ్రాంతి కోసం కాఫీ సేవించడం అలవాటుగా ఉండేది. ఇళ్ళలో కూడా కాఫీ మాత్రమే వాడుకలో ఉండేది. ఫిల్టర్ కాఫీ బాగా వాడుకలో ఉన్న రోజుల్లో ఇన్‌స్టంట్ కాఫీలు రావడం, వాటితోపాటు పలు రకాల టీ పౌడర్లు మార్కెట్‌లోకి విడుదల కావడం, టీకి జనసామాన్యంలో అధిక వినియోగం ఏర్పడడం, పైగా అది సామాన్య మానవుడికి అందుబాటు ధరలలో లభించడం టీకి మరింత ప్రాధాన్యత పెరగడానికి దోహదపడింది.
 
== ఉత్పత్తి ==
దాదాపు ప్రతి దేశంలోనూ టీ వినియోగంలో ఉన్నా [[భారతదేశం]] ఉత్పాదించే టీ వైవిధ్యానికీ, విశిష్టతకూ ప్రసిద్ధి పొందింది. పశ్చిమ బెంగాల్ లోని [[డార్జిలింగ్ తేనీరు|డార్జిలింగ్ టీ]] మిక్కిలి నాణ్యమైనది. ఇది సువాసనభరితమైనది. ముఖ్యంగా ఇక్కడి మంచుతో కూడిన హిమాలయ పర్వత వాతావరణ పరిస్థితుల వల్ల మరియు ఈ ప్రదేశంలో భూసార రచనా విధానం వల్ల ఇక్కడ ఉత్పత్తి కాబడే టీకి ప్రత్యేక రుచి, సువాసన సిద్ధిస్తుంది. భారతదేశంలో [[తేయాకు]] సాగు ప్రాతిపదికగా అనేక మందికి జీవనోపాధి కలుగుతోంది. ఈ రంగంలో సుమారు 20 లక్షల మంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ శ్రామికులు ఉన్నారు. వీరిలో 50 శాతం స్త్రీలు.
"https://te.wikipedia.org/wiki/తేనీరు" నుండి వెలికితీశారు