కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

ఇది సరి అయినది
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ఇది సరి అయినది కాదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
=== పుట్టు పూర్వోత్తరాలు ===
కమ్మ అన్న పదం సా.శ. ఒకటో శతాబ్దం నుంచి ఉంది.<ref>[http://www.archive.org/details/andhrulacharitra025965mbp ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232]</ref> కమ్మవారి పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర విషయంలో పలు సిద్ధాంతాలు, వాదనలు ఉన్నాయి. గుండ్లకమ్మ వాగు పరిసర ప్రాంతాలను ప్రాచీన ప్రాంత విభాగమైన [[కమ్మనాడు]]గా పిలిచేవారనీ, ఆ ప్రాంతంతో మూలాలు ముడిపడివుండడంతో ఈ కులానికి కమ్మ అన్న పేరు వచ్చినట్టు చెప్తారు. ప్రధానంగా దీని ప్రకారం వీరు ఈ ప్రాంతానికి స్థానికులు, వ్యవసాయదారులు. 1940ల నుంచి పలువురు కమ్మ కులస్తులైన చరిత్రకారులు రాసిన కుల చరిత్రల్లో మూలాలకు సంబంధించి మరో కథనం వ్యాప్తిలో ఉంది. దాని ప్రకారం వీరు సామాన్య శక పూర్వం గంగా మైదానంలోని కర్మ రాష్ట్రానికి చెందిన బౌద్ధులనీ, సా.శ.పూ. 184 సమయంలో రాజ్యానికి వచ్చిన పుష్యమిత్ర సుంగుని అణచివేత తట్టుకోలేక పెద్ద సంఖ్యలో దక్షిణాదిన ఉన్న కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి వలసవచ్చారనీ చెప్తారు. సంస్కృతంలోని కర్మ పదం పాళి భాషలోని కమ్మగా మారిందనీ, ఆ పదాన్నే వీరు వెంట తీసుకువచ్చి తమను కమ్మ కులస్తులుగా చెప్పుకున్నారనీ ఈ ప్రత్యామ్నాయ కథనం చెప్తోంది. ఈ సిద్ధాంతం కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని బౌద్ధ సంస్కృతిని వారు కమ్మ రాష్ట్రం నుంచి తీసుకువచ్చారని పేర్కొంటోంది. మరికొన్ని భేదాలతో ఇటువంటి సిద్ధాంతాలు విరవిగా కనిపిస్తున్నాయి. సా.శ. పదో శతాబ్దం నుంచి కమ్మ వారు కులంగా ఉన్నట్టు ప్రస్తావనలు ఉన్నాయి. ఐతే [[కమ్మనాడు]] సంబంధించిన మిగతా వర్గములను కూడ చారిత్రకముగా కమ్మబ్రాహ్మణులు, కమ్మకాపులు, కమ్మకోమటులు అని పిలిచేవారు. కాలక్రమములో ఈ భౌగోళిక సూచన కమ్మవారికి మాత్రమే కులనామముగా మిగిలిపోయింది.
===పరిశోధన===
 
ఆధునిక విజ్ఞాన పరముగా తెలుగువారిలోని కమ్మవారిలో మధ్యాసియా వాసులలో గుర్తించిన M124 జన్యువు 75% శాతం ఉంది. ఈ జన్యువు ఉత్తర భారతములోని వారణాసి ప్రాంతంలో నివసించు జౌంపూర్ (Jaunpur) క్షత్రియులలో 80% శాతం ఉంది. దీనిని హాప్లో గ్రూపు haplogroup R2 అంటారు. ఐరోపా, ఉత్తర భారత ఆర్యులలో హాప్లోగ్రూపు R2 నకు సమీపములో ఉండే హాప్లోగ్రూపు R1a1(M17) ఉంది. <ref>Sahoo, S.; et al. (2006), "A prehistory of Indian Y chromosomes: Evaluating demic diffusion scenarios", Proceedings of the National Academy of Sciences, 103 (4): 843–8</ref>. ఈ పరిశోధన ఇంకా ఎక్కువమంది నమూనాలు సేకరించి నిశితముగా చేయవలిసిన అవసరమున్నది.
 
== వృత్తులు ==
కమ్మ కులస్తులు చారిత్రకంగా సైన్యాధ్యక్షులుగా, పరిపాలకులుగా పాలన, రాజకీయ వృత్తుల్లో పలు హోదాల్లో పనిచేశారు. 20వ శతాబ్ది తొలినాళ్ళకు కమ్మవారు ప్రధానంగా వ్యవసాయదారులుగా ఉండేవారు. వీరు ప్రత్యేకించి వ్యవసాయ వృత్తిలో మంచి పేరు సంపాదించుకున్నారు. 20వ శతాబ్ది మలిభాగం నుంచి వివిధ వృత్తుల్లోకి ప్రవేశించి, విజయం సాధించడం పెరిగింది. సినిమా, ఆతిథ్యం, వైద్యం, విద్య, పత్రికలు, మీడియా - వంటి అనేక రంగాల్లో కమ్మవారు ప్రవేశించి వ్యక్తులుగానూ, సంస్థల అధిపతులుగానూ స్థిరపడ్డారు.
"https://te.wikipedia.org/wiki/కమ్మ" నుండి వెలికితీశారు