కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

ఇది సరి అయినది కాదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 7:
కమ్మ అన్న పదం సా.శ. ఒకటో శతాబ్దం నుంచి ఉంది.<ref>[http://www.archive.org/details/andhrulacharitra025965mbp ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232]</ref> కమ్మవారి పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర విషయంలో పలు సిద్ధాంతాలు, వాదనలు ఉన్నాయి. గుండ్లకమ్మ వాగు పరిసర ప్రాంతాలను ప్రాచీన ప్రాంత విభాగమైన [[కమ్మనాడు]]గా పిలిచేవారనీ, ఆ ప్రాంతంతో మూలాలు ముడిపడివుండడంతో ఈ కులానికి కమ్మ అన్న పేరు వచ్చినట్టు చెప్తారు. ప్రధానంగా దీని ప్రకారం వీరు ఈ ప్రాంతానికి స్థానికులు, వ్యవసాయదారులు. 1940ల నుంచి పలువురు కమ్మ కులస్తులైన చరిత్రకారులు రాసిన కుల చరిత్రల్లో మూలాలకు సంబంధించి మరో కథనం వ్యాప్తిలో ఉంది. దాని ప్రకారం వీరు సామాన్య శక పూర్వం గంగా మైదానంలోని కర్మ రాష్ట్రానికి చెందిన బౌద్ధులనీ, సా.శ.పూ. 184 సమయంలో రాజ్యానికి వచ్చిన పుష్యమిత్ర సుంగుని అణచివేత తట్టుకోలేక పెద్ద సంఖ్యలో దక్షిణాదిన ఉన్న కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి వలసవచ్చారనీ చెప్తారు. సంస్కృతంలోని కర్మ పదం పాళి భాషలోని కమ్మగా మారిందనీ, ఆ పదాన్నే వీరు వెంట తీసుకువచ్చి తమను కమ్మ కులస్తులుగా చెప్పుకున్నారనీ ఈ ప్రత్యామ్నాయ కథనం చెప్తోంది. ఈ సిద్ధాంతం కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని బౌద్ధ సంస్కృతిని వారు కమ్మ రాష్ట్రం నుంచి తీసుకువచ్చారని పేర్కొంటోంది. మరికొన్ని భేదాలతో ఇటువంటి సిద్ధాంతాలు విరవిగా కనిపిస్తున్నాయి. సా.శ. పదో శతాబ్దం నుంచి కమ్మ వారు కులంగా ఉన్నట్టు ప్రస్తావనలు ఉన్నాయి. ఐతే [[కమ్మనాడు]] సంబంధించిన మిగతా వర్గములను కూడ చారిత్రకముగా కమ్మబ్రాహ్మణులు, కమ్మకాపులు, కమ్మకోమటులు అని పిలిచేవారు. కాలక్రమములో ఈ భౌగోళిక సూచన కమ్మవారికి మాత్రమే కులనామముగా మిగిలిపోయింది.
== వృత్తులు ==
కమ్మ కులస్తులు చారిత్రకంగా మహారాజులుగా, సైన్యాధ్యక్షులుగా, పరిపాలకులుగా పాలన, రాజకీయ వృత్తుల్లో పలు హోదాల్లో పనిచేశారు. 20వ శతాబ్ది తొలినాళ్ళకు కమ్మవారు ప్రధానంగా వ్యవసాయదారులుగా ఉండేవారు. వీరు ప్రత్యేకించి వ్యవసాయ వృత్తిలో మంచి పేరు సంపాదించుకున్నారు. 20వ శతాబ్ది మలిభాగం నుంచి వివిధ వృత్తుల్లోకి ప్రవేశించి, విజయం సాధించడం పెరిగింది. సినిమా, ఆతిథ్యం, వైద్యం, విద్య, పత్రికలు, మీడియా - వంటి అనేక రంగాల్లో కమ్మవారు ప్రవేశించి వ్యక్తులుగానూ, సంస్థల అధిపతులుగానూ స్థిరపడ్డారు.
 
=== రాజ్యపాలన, సైనిక వృత్తి ===
పంక్తి 31:
20వ శతాబ్దికి ముందు భారతదేశంలో ఇతర వ్యవసాయ కులాలలానే వీరిలోనూ అక్షరాస్యత శాతం, ఉన్నత విద్య తక్కువగా ఉండేది. 20వ శతాబ్ది తొలి దశకాల నుంచే సాంఘిక చైతన్యం పెరిగి సంఘీభావం మద్దతు కావడంతో అక్షరాస్యత పెరిగింది. ఈ పెరుగుదలలో 20వ శతాబ్ది తొలినాళ్ళలో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతరుల్లో విద్య, ఉద్యోగాలు పెరగాలని బ్రాహ్మణేతరులైన జమీందారులు ప్రారంభించిన బ్రాహ్మణేతరోద్యమ ప్రభావం కూడా ఉంది. కమ్మ మహాజన సభ అన్న కులసంఘం కమ్మవారిలో విద్యాభివృద్ధి ఆవశ్యకతను విస్తారంగా, సుదీర్ఘకాలం చేసిన ప్రచారం త్వరితగతిన వీరిలో విద్యాభివృద్ధి చెందడానికి ఒక ప్రధానమైన కారణంగా నిలిచింది. వీరిలో సంపన్నులు పిల్లల విద్య కోసం అవసరమైన ఖర్చు భరించారు. చుట్టరికాల నెట్‌వర్క్, కులాభివృద్ధిని కేంద్రంగా చేసుకున్న విద్యాసంస్థలు, హాస్టళ్ళు వంటివి కమ్మవారిలో విద్యాభివృద్ధి చాలా ప్రోత్సహించాయి.{{sfn|A. Satyanarayana|2002|58}}
 
విద్యాభివృద్ధి, అక్షరాస్యత కారణంగా బ్రాహ్మణులు ఆధిక్యతతో ఉన్న ఉద్యోగాల్లోకి క్రమేపీ కమ్మవారు ఇతర వ్యవసాయ కులాలతో పాటుగా సంఖ్యలో పెరుగుతూ వచ్చారు. 20వ శతాబ్ది ఉత్తరార్థంలో వైద్యం, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యలు సహా పలు ఉన్నత విద్యావకాశాలు స్వీకరించి ఆయా ఉద్యోగాల్లో పనిచేశారు.
 
== రాజకీయం ==
"https://te.wikipedia.org/wiki/కమ్మ" నుండి వెలికితీశారు