నందమూరి తారక రామారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 37:
}}
 
[[తెలుగు]]వారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే '''నందమూరి తారక రామారావు''' ([[మే 28]], [[1923]] - [[జనవరి 18]], [[1996]]) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన [[ఎన్.టి.ఆర్]], [[ఎన్.టి.రామారావు]]గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, [[తెలుగు]], [[తమిళం]] మరియు [[హిందీ]] భాషలలో కలిపి దాదాపు 400 [[సినిమా|చిత్రాలలో]] నటించారు. తన [[ప్రతిభ]]<nowiki/>ను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. '''విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు'''గా బిరుదాంకితుడైన ఆయన, అనేక [[పౌరాణిక చిత్రాలు|పౌరాణిక]], [[జానపద చిత్రాలు|జానపద]], [[సాంఘిక చిత్రాలు|సాంఘిక]] చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, [[రాముడు]], [[కృష్ణుడు]] వంటి [[పౌరాణిక చిత్రాలు|పౌరాణిక]] పాత్రలతో [[తెలుగు]] వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో [[ఎన్.టి.ఆర్]] 13 [[చరిత్ర ఆధారిత చిత్రాలు|చారిత్రకాలు]], 55 [[జానపద చిత్రాలు|జానపద]], 186 [[సాంఘిక చిత్రాలు|సాంఘిక]] మరియు 44 [[పౌరాణిక చిత్రాలు|పౌరాణిక]] చిత్రాలు చేసారు. రామారావు [[1982]] [[మార్చి 29]]న [[తెలుగుదేశం]] పేరుతో ఒక [[రాజకీయ పార్టీ|రాజకీయ]] పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే [[ఆంధ్ర ప్రదేశ్]]లో [[భారత జాతీయ కాంగ్రెసు|కాంగ్రెస్ పార్టీ]] ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 87 సంవత్సరాల పాటు [[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా]] పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు.<ref name=ntr.telugudesam />
 
==బాల్యము, విద్యాభ్యాసము==