నవోదయ రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''నవోదయ రామమోహనరావు'''గా అందరికీ సుపరిచితులు ''అట్లూరి రామమోహనరావు'' నవోదయ పుస్తక ప్రచురణ సంస్థ, నవోదయ పుస్తకాల అంగడి యజమాని.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1934]], [[ఆగస్టు 1]]న [[కృష్ణా జిల్లా]] [[ఉంగుటూరు (కృష్ణా జిల్లా)|ఉంగుటూరు]] గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. తన 28వ యేట నుండి పుస్తక ప్రచురణరంగంలో ప్రవేశించి ఆరు దశాబ్దాలకు పైగా అదే రంగంలో ఉన్నాడు. ఇతనికి ముగ్గురు అక్కలు. తల్లి మతిస్థిమితం లేకపోవడంతో ఇతడు తన పెద్దక్క శేషారత్నం సంరక్షణలో పెరిగాడు. ఇతడు ప్రాథమిక విద్యను ఉంగుటూరులో, హైస్కూలు విద్యను [[గుడివాడ]]లో చదివాడు. ఇతడు కమ్యూనిస్టు పార్టీపై మక్కువతో ఆ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నాడు. గుడివాడలో చదివే సమయంలో కమ్యూనిస్టులపై నిర్భందం కారణంగా అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయాడు. తరువాత [[కైకలూరు]]లో తన బావ వద్ద ఉంటూ పదవ తరగతి పూర్తి చేశాడు. పై చదువులు చదివే స్తోమత లేకపోవడంతో నెలకు 50 రూపాయల జీతానికి విశాలాంధ్ర ప్రచురణాలయంలో పనిచేశాడు. అక్కడ అతనికి కమ్యూనిస్టు పార్టీతో మరింత సంబంధం ఏర్పడింది. కమ్యూనిస్టు నేతలతో పరిచయాలు పెంచుకున్నాడు. 1955లో పర్వతనేని ఝాన్సీలక్ష్మితో వివాహం జరిగింది. 1960లో ఇతని బావ తను స్థాపించిన నవోదయ పబ్లిషర్స్ సంస్థను ఇతనికి అప్పగించాడు. ఈ సంస్థకుసంస్థను కష్టపడి అభివృద్ది చేసి గుంటూరు, మద్రాసులలో శాఖలను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌]]లో ప్రధానమైన పుస్తక ప్రచురణ సంస్థగా రాణించింది. ఈ సంస్థనుండి [[శ్రీశ్రీ]], [[రావిశాస్త్రి]], [[ముళ్ళపూడి వెంకటరమణ]], [[బాపు]], [[గొల్లపూడి మారుతీరావు]], [[నండూరి రామమోహనరావు]], [[ఇంద్రగంటి శ్రీకాంతశర్మ]], [[నార్ల వెంకటేశ్వరరావు]] వంటి రచయితల పుస్తకాలు వెలుగు చూశాయి<ref name="ఈనాడు">{{cite news |last1=విలేకరి |title=నవోదయ రామ్మోహనరావు ఇకలేరు |url=https://web.archive.org/web/20191217054513/https://www.eenadu.net/statenews/2019/12/16/219069703 |accessdate=17 December 2019 |work=ఈనాడు దినపత్రిక |date=16 December 2019}}</ref>.
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/నవోదయ_రామమోహనరావు" నుండి వెలికితీశారు