వికీపీడియా చర్చ:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/ప్రాథమిక ప్రతిపాదన: కూర్పుల మధ్య తేడాలు

చిన్న మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
* పరిధి?: కనీసం తెలుగు భాష మాట్లాడగలిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు సంబంధించిన కృషి వివిధ ప్రాజెక్టుల్లో (వికీమీడియా కామన్స్, వికీడేటా, ఇంగ్లీష్‌ వికీపీడియా, ఇలా) చేసే వికీమీడియన్లను కలుపుకుపోగలిగేలాంటి లక్ష్యాలు, పరిధితో ఉండాలని నా ఉద్దేశం. ఇందువల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి: ఒకటి- కొద్ది కొద్దిగా మిగిల్చిన పరిధుల్లో ఇతరులు వేరే పోటీ గ్రూపులు ఏర్పాటుచేయగలిగే అవకాశం నివారించడం, రెండు- పరిధి ఆ మేరకు విస్తరిస్తే సామర్థ్యం, ఆసక్తి ఉన్న ఇతర వికీపీడియన్లు కూడా మనతో చేరే వీలివ్వడం. ఇదలా ఉంచి: మన గ్రూపు ద్వారా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఇతర చిన్న చిన్న భాషా సముదాయాల వారు తమ కార్యక్రమాలు చేసుకోవడానికి సహకారం కావాలంటే చేయడమన్నది కూడా లక్ష్యాల్లో చేర్చడం మంచిదని నా భావన. ఇది బయట నుంచి సహకారంలా ఉండవచ్చు. ఇవి లక్ష్యాల్లో ఉంచి- పేరును తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ అనే ఉంచుదామని నా ప్రతిపాదన.
ఈ గ్రూపు ఏర్పాటుకు, దాని నిర్వహణకు బాధ్యతలు స్వీకరించి పనిచేయడానికి నేను సిద్ధమేనని తెలియపరుస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 11:54, 26 డిసెంబరు 2019 (UTC)
==సి.చంద్రకాంతరావు అభిప్రాయాలు==
యూజర్ గ్రూపును ఏర్పాటు చేయాలా ? వద్దా ? అనే ప్రశ్నకు ముందు అసలు యూజర్ గ్రూపు ఏర్పాటు చెయ్యడపోవడం వల్ల తెవికీకి ఇప్పుడున్న ఇబ్బందులేమిటి? ఏర్పాటు చేస్తే ఆ ఇబ్బందులు తీరుతాయా ? అనేదానిపై దృష్టి సారించాలి. తెవికీ సభ్యులు తెవికీలోనే చర్చించుకుంటూ తెవికీని అభివృద్ధిపథంలో పయనింపజేసిన ఒకానొకదశలో యూజర్ గ్రూపులున్నాయా ? చాప్తర్లున్నాయా ? పట్టుమని పదిమంది కూడా చురుకుగా లేని ఇప్పటి తెవికీదశలో, నిర్వహణే భారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో, యూజర్ గ్రూపులకై ఆలోచించడం సమంజసం కాదనిపిస్తుంది ! ఇప్పుడు యూజర్ గ్రూపు ఏర్పాటు అంటాము, ఏడాదికోసారి నివేదిక పంపాలి అంటాము, నివేదికకై గణాంకాలు పెరగాలంటాము, గణాంకాలకై కొందరు సభ్యులను పురమాయిస్తాము, చివరికి నాణ్యతను గాలికొదిలేస్తాము, ఇది ఊబి నుంచి మరింత ఊబిలోకి వెళ్ళడమే తప్ప మరేమి కాదు ! ఇవన్నీ గతానుభవాలే చెబుతున్నాయి. తెవికీలో నాణ్యతలేని వ్యాసాలున్నాయనీ, నిర్వహణ భారంగా మారిందనే అభిప్రాయాలున్న ప్రస్తుత తరుణంలో మళ్ళీ గణాంకాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన దశకు మళ్ళడం భావ్యమనిపించడంలేదు. యూజర్ గ్రూపు ఏర్పాటు చేసి చేయాల్సిన పనులు, యూజర్ గ్రూపు ఏర్పాటు లేకుండా చేయడానికి వీలుపడదా ? యూజర్ గ్రూపు ఏర్పాటు వల్ల ఏమైనా ప్రత్యేక గ్రాంటులు లభిస్తాయా ? పొరుగు రాష్ట్రాలకు చెందిన భాషావికీలవారు ఇలాంటిపని చేయకపోవడానికి ఏమైనా బలమైన కారణం ఉందా ? యూజర్ గ్రూపువల్ల సభ్యుల మధ్య కాని, తెవికీలోకాని అభిప్రాయబేధాలు రావనడానికి నమ్మకం కలిగించగలమా ? వికీమీడియా ఫౌండేషన్‌తో సంప్రదింపులకు ఏ ఇద్దరిని తీసుకోవాలి ? ఆ ఇద్దరికీ ఏదైనా ప్రత్యేకత ఉంటుందా (వేతనంకాని, ప్రాధాన్యతకాని) ? ప్రదిపాదించినవారే బాధ్యత తీసుకుంటామని ఎందుకంటున్నారు ? పలువురు ముందుకువస్తే ఇదివరకు పదవులు పొందినవారిని వదిలేయమని చెప్పగలమా ? ఇలాంటివాటిపై సభ్యులు దృష్టిసారించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ప్రారంభించడం ముఖ్యంకాదు, ఆ తర్వాత తెవికీకి నష్టం జరగకపోవడానికే ఆలోచించాలి. యూజర్ గ్రూపులవల్ల తెవికీకి ప్రయోజనమే తప్ప నష్టమేమీ జరగబోదని నిరూపిస్తే నా మద్దతు తప్పకుండా ఉంటుంది. కాని ముందుగా ఒక్కో అంశంపై వివరంగా చర్చజరగాలి, సమాధానం ఇచ్చేవారు ఓపికతో సమాధానం ఇవ్వాలి. (సందేహాలంటే ఇవి మాత్రమే కావు, ఇతర సభ్యులు కూడా తమ సందేహాలు బహిర్గతపర్చాలి) [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:39, 26 డిసెంబరు 2019 (UTC)
Return to the project page "తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/ప్రాథమిక ప్రతిపాదన".