వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 254:
===ఇతర అభిప్రాయాలు===
AWB వాడుకపై నియంత్రణ మంచిదే. కాకపోతే క్రియాశీలత తక్కువగా వున్న మన వికీకి ఎక్కువ విధానాలు చేయడానికి బదులు తక్కువగా మరియు సులభంగా వుంటేనే వాటిని నిర్ధారించడం, అమలు చేయడం సులువు. నిర్వాహకులకు AWB హక్కు వుంటుంది కాబట్టి ప్రస్తుత ప్రతిపాదనలోగల వివరాల విషయంలో నిర్వాహకత్వం ఎన్నిక సందర్భంలో వాటిని పరిగణించడం జరుగుతుంది కాబట్టి, AWB వాడుక ప్రస్తుత నిర్వాహకులు, స్వచ్ఛందంగా విరమించిన నిర్వాహకులకు (కోరినట్లైతే)పరిమితం చేయడం మంచిది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 23:02, 4 జనవరి 2020 (UTC)

::నాకు తెలిసినంతవరకు చెప్పాలంటే AWB ప్రారంభించిన తొలిదశలో నిర్వాహకులు మినహా మిగితా సభ్యులు దీన్ని వాడుటకు అవకాశం ఉండేది కాదు. నిర్వాహకేతర సభ్యులెవరైనా అభ్యర్థిస్తే వారికి AWB దిద్దుబాట్ల అవకాశం కల్పించాల్సి ఉంటుందనేది అప్పటి సూచన. కాని ప్రారంభంలో నలుగురైదుగురు నిర్వాహకులు మినహా ఎవ్వరూ దీన్ని అధికంగా ఉపయోగించలేరు. నిర్వాహకేతర సభ్యుల నుంచి ఎలాంటి అభ్యర్థనలు కూడా రాలేవు. క్రమక్రమంగా ఒకరిద్దరు మినహా నిర్వాహకులు కూడా దీన్ని ఉపయోగించడం మానివేశారు. నిర్వాహకేతరులు ఎలాంటి అనుమతి లేకుండా AWB ను ఉపయోగించుటకు ప్రస్తుతం అవకాశం ఉన్నాదా? అనే విషయం కూడా నాకు తెలియదు (ప్రారంభంలో మాత్రం లేకుండేది). ఒకవేళ అలా అవకాశం ఉన్నప్పుడు కొత్తసభ్యులను లేదా నియమాలు తెలియని వారికి ఈ అవకాశం దూరం చేయుటకు నియంత్రణ ఉండుట సమంజసమే. కాని ఓటింగు/మద్దతుకు ముందు అర్హతల విషయంలో ఇంకనూ మార్పు చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. చదువరి గారు కూడా "వాడుకరులు పరిశీలించి, తగు సూచనలు, సవరణలూ చేస్తే ..." అన్నారు కాబట్టి ఇప్పుడే మద్దతు తెల్పడం తొందరపాటు చర్యేనని భావిస్తూ అర్హతలకు సంబంధించి కొన్ని సవరణలు/మార్పులు చేర్పులకు ప్రతిపాదన చేస్తున్నాను.
1) అభ్యర్థించే సభ్యుడికి వికీవిధానాలపై తగు పరిజ్ఞానం ఉందని నిర్వాహకులు భావించాలంటే వ్యాసేతర పేజీలపై చేసిన పని, చర్చాపేజీలలో అతని సూచనలు/అభిప్రాయాలపై దృష్టిసారించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రధాన పేరుబడిలో 500 దిద్దుబాట్లు బదులు వ్యాసేతర పేజీలలో దిద్దుబాట్ల సంఖ్యకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది
2) "ప్రధాన పేరుబరిలో కనీసం 500..." అంటే తెవికీలోనేనా? లేదా అన్ని వికీలలో కలిపా? (లేదా తెలుగుకు సంబంధించి సోదర ప్రాజెక్టులు కూడా కలిపా?) అనేది స్పష్టంగా ఉండాలి (తెవికీలో చర్చ జరుగుతోంది/జరిగింది కాబట్టి తెవికీ దిద్దుబాట్లే అని సాధారణంగా అనుకుంటాం). సాధారణంగా కొత్త సభ్యులు AWB అభ్యర్థిన చేయరు, అసలు ఇలాంటిదొకటి ఉన్నట్లుగా కూడా కొత్తవారికి తెలిసే అవకాశం బహుతక్కువే. కొత్త సభ్యులు అభ్యర్థన చేశారంటే వారు తప్పనిసరిగా ఇతర వికీలలో అనుభవమున్నవారై ఉంటారు. ఇతర వికీలలో అనుభవం గడించి తెవికీలో ప్రధాన పేరుబడిలో 500 దిద్దుబాట్లు లేకుండా వికీల అభివృద్ధికి తోడ్పడుతున్న సభ్యుడికి AWB అవకాశం ఎందుకివ్వరాదనే విషయం కూడా మనం ఆలోచించాలి.
3) వ్యాసేతర పేజీలలో వేలాది దిద్దుబాట్లతో తెవికీకి తోడ్పడి ప్రధాన పేరుబడిలో 500 దిద్దుబాట్లు కూడా లేని ఒక నైపుణ్యవంతుడైన సభ్యుడికి అవకాశం దూరం చేయలేముకదా! నేను తెవికీలో చేరిన ప్రారంభంలో అంటే పన్నేండేళ్లల క్రితం దేవా అనే సభ్యుడు వ్యాసంం పేజీలకంటే వ్యాసేతర పేజీల ద్వారానే నైపుణ్యం చూపించిన సంగతి అప్పటి సభ్యులకు గుర్తుండే ఉంటుంది.
4) నిర్వాహకులకు అనుమతి అవసరం లేదు కాని నిర్వాహకులు AWBకై ప్రత్యేక సభ్యనామం సృష్టించుకుంటే వాటికి అనుమతి అవసరం. నిర్వాహకుడు అనే ఏకైక కారణంతో AWB హక్కులు ఇవ్వాలా? ఇప్పటివరకు నిర్వాహక ఓటింగులో AWB గురించి ఆలోచించలేము.
5) నిర్వాహకేతరులెవరైనా AWB దిద్దుబాట్ల హక్కులకోసం కొరకు అభ్యర్థిస్తే అప్పుడు వారికి ఏ నిర్వాహకుడు/అధికారి అయినా హక్కులు ప్రసాదించవచ్చా? లేదా అభ్యర్థనపై చర్చ జరగాలా? ఆ విషయంలో తుదినిర్ణయం (అంటే సదరు సభ్యుడికి అర్హతలు ఉన్నాయనీ) ఎలా తీసుకోవాలి? 6) ఓటింగ్/మద్దతుకై రచ్చబండలో కాకుండా ఒక ప్రత్యేక పేజీ కేటాయిస్తే బాగుంటుంది (రచ్చబండలో లింకిస్తే సరిపోతుంది). [[సభ్యుడు:C.Chandra Kanth Rao| సి. చంద్ర కాంత రావు]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|- చర్చ ]] 12:13, 5 జనవరి 2020 (UTC)

=== చర్చ ===
[[User:Pranayraj1985|Pranayraj Vangari]] గారూ, నాకు గుర్తున్నంతలో.., అలాంటి నియమం పెట్టుకున్న గుర్తు లేదు. అది ఉంటే మాత్రం, పైన రాసిన అర్హతలను సమీక్షించాల్సి ఉంటుంది. ఒకసారి ఆ పేజీ లింకు ఇవ్వండి, చూద్దాం. __[[User:Chaduvari|చదువరి]] ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]]) 07:34, 5 జనవరి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు