"శాసన మండలి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(విస్తరణ)
{{భారత రాజకీయ వ్యవస్థ}}
[[భారత దేశముదేశం|భారతదేశం]] యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభను '''శాసనమండలి (విధాన పరిషత్)''' అంటారు. రాజ్యాంగంలోని 171 అధికరణం ద్వారా ఈ విధాన సభను ప్రారంభించవచ్చు. 2017 నాటికి భారతదేశంలోని 29 రాష్ట్రాలలో కేవలం 7 రాష్ట్రాలలో మాత్రమే శాసనమండలి ఉంది<ref>http://www.gktoday.in/blog/legislative-council-in-india/</ref>. అవి [[ఉత్తర ప్రదేశ్|ఉత్తరప్రదేశ్]], [[బీహార్]], [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]], [[జమ్మూ కాశ్మీరు]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణ]]. రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఇది ఎగువ సభ. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికౌతారు. ఈ సభలోని సభ్యులను ఎన్నికైన స్థానిక సంస్థలు, అసెంబ్లీ సభ్యులు, గవర్నర్, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు మొదలైనవారు ఎన్నుకుంటారు. ఈ సభ్యులను ఎం.ఎల్.సి అని పిలుస్తారు. ఇది శాశ్వత సభ. అనగా [[శాసన సభ]] వలె దీన్ని రద్దు చేయలేము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు.
 
== సభ్యత్వం ==
* 2013 నవంబరు 28 న [[అసోం]] లో శాసన మండలి ఏర్పరచవలసినదిగా భారత యూనియన్ కెబినెట్ ఆమోదించింది.
* కర్ణాటక, మహారాష్ట్రలలో అధ్యయనం చేసిన తరువాత ఒడిశా రాష్ట్ర శాసన మండలిని ఏర్పాటు చేయనుంది.<ref>{{cite news|url=http://www.business-standard.com/article/pti-stories/odisha-names-members-of-committee-on-vidhan-parishad-study-115010701150_1.html|title=Odisha names members of committee on Vidhan Parishad study|accessdate=11 July 2015|agency=Business Standard}}</ref>
* మహారాష్ట్ర విధానసభ వివరాలు: ఎన్నికలు 31, స్థానిక సంస్థలు 21, ఉపాధ్యాయులు 7, గ్రాడ్యుయేట్లు 7, నామినేటెడ్ 12.
 
== రద్దు మరియు పునరుజ్జీవనం ==
శాసనసభ యొక్క ఉనికి రాజకీయంగా వివాదాస్పదంగా ఉంది. కొన్ని రాష్ట్రాలలో కౌన్సిల్ రద్దు చేయబడిన తరువాత దాని పునఃస్థాపనన క్కొరకు అభ్యర్థించారు; దీనికి విరుద్ధంగా, ఒక రాష్ట్రం కోసం కౌన్సిల్ యొక్క పునఃస్థాపన కోసం ప్రతిపాదనలు కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. రాష్ట్ర శాసన మండలి రద్దుచేయడం లేదా పునఃస్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలు భారత పార్లమెంటు నిర్ధారణకు కావాలి.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:భారత రాజకీయ వ్యవస్థ]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2796008" నుండి వెలికితీశారు