భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

చి నాటక రచయితకు లింకు ఇచ్చాను
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 44:
 
== నాటక ప్రస్థానం ==
ఈయన మేనమామ ధరణి శ్రీనివాసరావు ప్రసిద్ధ [[నాటక రచయిత]]. భాను ప్రకాష్ కేశవ్ మెమోరియల్ స్కూల్లో చదువుతున్న సమయంలో 11 ఏళ్ల వయస్సులో తొలిసారిగా వార్షికోత్సవాల సందర్భంగా స్టేజీపై నటించారు. ఆ తొలి నాటకం పేరు ‘తార్‌మార్’. ఇందులో భాను మంచి వేషం వేశారు. అందులోని బాల భాను నటన అందరికీ నచ్చింది. ప్రిన్సిపాల్ ఒక మొమెంటోతో ప్రశంసించారు. దాంతో భాను నటనపట్ల తనలోని ఆసక్తిని మరింత పెంచుకున్నారు.
 
తమ కాలనీలోని మిత్రులను ఒకచోట చేర్చి తానే నాటకాలు రూపొందించి [[వినాయకచవితి]] మండపాల్లో వాటిని ప్రదర్శించడం ప్రారంభించారు. అప్పట్లోనే హైదరాబాదులో [[ఎస్.కె. ఆంజనేయులు]] అనే నాటక ప్రయోక్త సహజం నిర్వహించే ‘విసృతి’ నాట్యమండలి వారి నాటకాలు, వారి రిహార్సల్స్‌ని శ్రద్ధగా, దగ్గర్నించి పరిశీలించేవారు. ఆ ప్రేరణతో తాను కూడా నాటకాలకు దర్శకత్వం వహించాలన్న నిర్ణయానికి వచ్చారు.
పంక్తి 56:
ఒకసారి ‘చీకటి కోణాలు’ నాటకంలో భాను ప్రకాష్ నటనను [[స్థానం నరసింహారావు]] వారు అభినందించారు. ఇంకా ‘[[ఆకాశవాణి]]’లో కూడా ఆయన ‘ఏ గ్రేడ్’ ఆర్టిస్టుగా చాలా నాటకాల్లో పాల్గొన్నారు. [[ఢిల్లీ]], [[మద్రాస్]], [[కలకత్తా]], కాన్పూర్‌లలో నాటకాలను ప్రదర్శించి పలువురి మెప్పు పొందారు.
 
‘చంద్రగుప్త’, ‘[[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]]’, ‘విశ్వశాంతి’, ‘[[సుడిగాలి]]’‘సుడిగాలి’, ‘ఆపద్భాందవులు’, ‘[[న్యాయం]]’‘న్యాయం’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’, ‘గాలివాన ’, ‘జీవన్నాటకం’, ‘ఒంటి కాలి పురుగు’, ‘గాలి గోపురం’, ‘బాపూ బాటలో’ వంటి [[నాటకాలు]] ఈయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘[[గాలిపటం]]’‘గాలిపటం’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో ఈయన తన నటనను కూడా ప్రదర్శించి మంచిపేరుగాంచారు.
 
తెలుగునాట నాటక వికాసానికి అనితరంగా దోహదం చేసిన ఉదాత్త కళాకారుడు భాను ప్రకాష్. ప్రధానంగా [[హైదరాబాదు]] రాష్ట్రంలో సాంఘిక నాటకానికి బీజావాహన చేసింది ఈయనే.
"https://te.wikipedia.org/wiki/భాను_ప్రకాష్" నుండి వెలికితీశారు