వంగపండు ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత విశేషాలు: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
ఈయన [[పార్వతీపురం]] దగ్గర [[పెదబొండపల్లి]]లో [[1943]] జూన్ లో జన్మించారు. తండ్రి జగన్నాధం తల్లి చినతల్లి.2008, నవంబరు 23 న తెనాలిలో ఈయనకు [[బొల్లిముంత శివరామకృష్ణ]] సాహితీ అవార్డును [[బి.నరసింగరావు]] చేతులమీదుగా ప్రధానం చేశారు.<ref>[http://www.hindu.com/2008/11/24/stories/2008112458330300.htm Vangapandu feted The Hindu నవంబర్ 24, 2008]</ref> ప్రజలకోసం బ్రతికిన [[నాజర్]] లాంటి కళాకారుడని [[వంగపండు]]నువంగపండును పోలుస్తారు. వంగపండు ప్రసాదరావు, [[గద్దర్]]తో కలిసి 1972లో పీపుల్స్ వార్ యొక్క సాంస్కృతిక విభాగమైన [[జన నాట్యమండలి]]ని స్థాపించాడు. వంగపండు మూడు దశాబ్దాలలో 300కు పైగా పాటలు వ్రాశాడు. అందులో 12 పాటలు అన్ని గిరిజన మాండలికాలతో పాటు [[తమిళం]], [[బెంగాళీ]], [[కన్నడ]] మరియు [[హిందీ]] వంటి పది భారతీయ భాషలలోకి కూడా అనువదించబడినవి. "యంత్రమెట్టా నడుస్తు ఉందంటే..." అనే పాట ఒక ఆచార్యునిచే ఆంగ్లంలో కూడా అనువదించబడి [[అమెరికా]], [[ఇంగ్లాండు]]లో అభిమానం చూరగొన్నది.<ref>[http://www.hindu.com/thehindu/mp/2004/08/02/stories/2004080201670300.htm Sings his way into hearts - The Hindu ఆగష్టు 02, 2004]</ref> విప్లవ కవిత్వంలో పాట ప్రముఖ పాత్ర వహించింది. [[సుబ్బారావు పాణిగ్రాహి]], వంగపండు ప్రసాదరావు, [[గద్దర్]] మొదలైనవారు విప్లవ భావాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళారు.
==వంగపండు భావాలు,అనుభవాలు ==
*పూజల పేరిట వృథాగా డబ్బు ఖర్చుపెట్టను. నా చిన్నతనంలో పంట నూర్పిళ్లప్పుడు రాత్రిపూట మా తాత వాళ్లు పొలం దగ్గరకి వెళితే నేనూ వాళ్లతో పోయేవాడిని. అప్పుడు మా తాత, నాయిన, పెదనాయిన దేవుళ్ల కథలు చెప్పేవారు. శివుడు, రాముడు, కృష్ణుడు గురించి చెబుతూ వాళ్లను తలుచుకుంటూ పడుకోమనేవారు.ఇన్నేళ్లయ్యాక కూడా ఇప్పుడు పడుకున్నాసరే నాటి సంఘటనలు, దేవుళ్ల కథలు అన్నీ గుర్తుకువస్తాయి,
"https://te.wikipedia.org/wiki/వంగపండు_ప్రసాదరావు" నుండి వెలికితీశారు