ఎ.ఆర్.కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 5:
 
== రంగస్థల ప్రస్థానం ==
1948నాటికి రాజకీయరంగం మీద వ్యామోహం విడనాడి నాటక రంగంలో ప్రవేశించాడు. 1952నాటికి పూర్తిగా నాటక రంగానికి అంకితమై వినూత్నమైన ప్రయోగాలు చేయాలన్న తపన బయలుదేరింది. జీవిక నిమిత్తం రాష్ట్ర విద్యుత్ బోర్డులో సూపర్వైజర్ గా పనిచేసేవాడు. [[యునెస్కో]] ఆంతర్జాతీయ నాటక సంస్థకు అనుబంధసంస్థగా [[కమలాదేవి ఛటోపాధ్యాయ]] భారతీయ నాట్య సంఘాన్ని స్థాపించారు. ఆమె ప్రోద్బలంతో కృష్ణ 1952లో [[ఇండియన్ నేషనల్ థియేటర్]] నెలకొల్పాడు. 1953లో "దేశం కోసం" నాటక ప్రదర్శన వెల్లువ సృష్టించాడు. 1955లో ఢిలీలో జరిగిన భారతీయ నాట్యసంఘ సమావేశములో ఉపన్యాసమిచ్చి ఆ సంఘపు సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాడు. [[ఆంధ్ర విశ్వకళా పరిషత్]], నాటక కళల విభాగానికి సభ్యునిగా పనిచేశాడు<ref>{{Cite web |url=http://www.andhrauniversity.info/arts/theatrearts/index.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2010-07-03 |archive-url=https://web.archive.org/web/20090301053412/http://www.andhrauniversity.info/arts/theatrearts/index.html |archive-date=2009-03-01 |url-status=dead }}</ref>.
 
1954 అక్టోబరు 1న ఆంధ్రప్రదేశ్ నాట్యసంఘాన్ని స్థాపించి దాని శాఖలను ప్రతిజిల్లాకు వ్యాపింపచేశాడు. ఈ నాట్య సంఘంలో ఇండియన్ నేషనల్ థియేటర్, కళామండలి, సాధనసంఘం, నాట్యకళానికేతన్, నవకళాకేంద్రం సమాజాలు అంతర్భాగమయ్యాయి. 1957లో [[కుందుర్తి ఆంజనేయులు]] రాసిన వచన కవిత్వ నాటకం "ఆశ" ప్రదర్శించాడు. 1959లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పదవీ బాధ్యతలు చేపట్టాడు. [[అబ్బూరి రామకృష్ణారావు]] పరిచయం మరియు సహచర్యం కృష్ణకు ఎంతగానో ఉపకరించాయి. "రంగస్థల శాస్త్రం" అనే మహోన్నత గ్రంథాన్ని వెలువరించాడు. కృష్ణ ఆధ్వర్యంలో నాట్యసంఘం అపూర్వమైన సేవలు చేసింది. పరభాషలలో పేరొందిన నాటకాలను అనువదింపచేసి ప్రదర్శించేవాడు. నాటకాలను జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ప్రదర్శించి అత్యుత్తమ ప్రదర్శనగా ఎంపికైన నాటకాన్ని ఢిల్లీ ఉత్సవాలలో ప్రవేశం కల్పించేవాడు. నాటకరంగానికి సంబంధించిన వివిధ అంశాలలో కళాకారులకు శిక్షణ ఇప్పించేవాడు. నాట్యసంఘం సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు నిర్వహించేది. చర్చలు, గోష్టులు నిర్వహించేది. రాష్ట్రేతర ప్రాంతాలనుండి ప్రముఖ నాటకసమాజాలను ఆహ్వానించి వారిచే ప్రదర్శనలు ఇప్పించేది. నాట్యసంఘం 15వ వార్షికోత్సవాన్ని 33 రోజుల పాటు రాష్ట్రమంతటా జరిపించాడు. నాటకాలమీద వినోదపు పన్ను రద్దు చేయించాడు. ఈర్ష్య, అసూయల కారణంగా నాట్యసంఘం 1973లో పతమనమయ్యింది.
"https://te.wikipedia.org/wiki/ఎ.ఆర్.కృష్ణ" నుండి వెలికితీశారు