వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వెలుగొండ విలీనమవుతున్నందున సరిచేయు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
పంక్తి 28:
 
==బాల్యం, విద్యాభ్యాసం==
వై.యస్.రాజశేఖర్ రెడ్డి 1949 జూలై 8 న వైఎస్ఆర్ జిల్లా, [[జమ్మలమడుగు]]లోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు.<ref>{{Cite web |url=http://www.aponline.gov.in/quick%20links/cm/cmprofile.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-07-12 |archive-url=https://web.archive.org/web/20090907191631/http://www.aponline.gov.in/quick%20links/cm/cmprofile.html |archive-date=2009-09-07 |url-status=dead }}</ref> ఆయన తల్లిదండ్రులు [[జయమ్మ]], [[రాజారెడ్డి]]. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా [[బళ్ళారి]]లోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ [[లయోలా కళాశాల]]లో చేరాడు. 1972లో [[గుల్బర్గా విశ్వవిద్యాలయం]] నుంచి వైద్యవిద్యలో పట్టా పుచ్చుకున్నాడు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. [[శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల]] (యెస్.వి.ఆర్.ఆర్), [[తిరుపతి]] నుంచి హౌస్‌సర్జన్ పట్టా పొందాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి యెస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
 
తరువాత కొద్దిరోజులపాటు [[జమ్మలమడుగు]]లోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ [[ఆసుపత్రి]]<nowiki/>లో వైద్య అధికారిగా పనిచేశాడు. ఆ తరువాత 1973లో పులివెందులలో తండ్రి వై.ఎస్.రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. వాళ్ళ కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పారు. తరువాత వాటిని లయోలా సంస్థలకు అప్పగించారు. పులివెందుల దగ్గరిలో ఉన్న [[సింహాద్రిపురం]]లో ఉన్న కళాశాలను మాత్రం ఇప్పటికీ వీరి కుటుంబమే నిర్వహిస్తోంది.
పంక్తి 56:
 
==క్రైస్తవం==
వై.యస్. రాజశేఖరరెడ్డి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సి.ఎస్.ఐ) అనే చర్చికి చెందిన [[ప్రొటెస్టెంటు]] క్రైస్తవుడు. ఈయన తాత [[బ్రిటీషు]] మిషనరీల ప్రభావంతో క్రైస్తవమతం పుచ్చుకున్నాడని<ref>http://news.rediff.com/special/2009/sep/07/dr-ysr-was-a-very-devoted-christian.htm</ref><ref>http://specials.rediff.com/election/2004/may/12sld3.htm</ref>, తండ్రి రాజారెడ్డి మిలటరీలో పనిచేస్తూ [[బర్మా]]లో ఉండగా, అక్కడ క్రైస్తవం పుచ్చుకున్నాడని రెండు వేర్వేరు కథనాలు ఉన్నాయి. ఈయన కుటుంబం [[పులివెందల]]లోని సి.ఎస్.ఐ చర్చికి హాజరౌతుంది. రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లోనూ, మరలా 2009లోనూ కుటుంబసమేతంగా [[బెత్లహాము]]యాత్రకు వెళ్ళివచ్చాడు.<ref>http://election.rediff.com/report/2009/may/25/loksabapoll-ysr-to-visit-bethlehem.htm</ref> క్రైస్తవులైనా పారంపరికంగా వచ్చిన [[హిందూ]] సంప్రదాయాలని వీడలేదు. రాజశేఖరరెడ్డి [[తిరుమల]]ను అనేకమార్లు సందర్శించి [[వెంకటేశ్వరస్వామి]] దర్శనం చేసుకొని [[పూజలు]] చేశాడు.<ref>http://www.hindu.com/2005/05/06/stories/2005050612790300.htm</ref><ref>http://www.hindu.com/2009/02/04/stories/2009020450910200.htm</ref><ref>http://www.hindu.com/2009/09/05/stories/2009090559220400.htm</ref> అయితే రాష్ట్రంలో క్రైస్తవ ప్రభావం పెంచడానికి, మతమార్పిళ్ళను ప్రోత్సహించడానికి తోడ్పడ్డాడని కొంతమంది ఈయన్ను విమర్శించారు.<ref>{{Cite web |url=http://www.haindavakeralam.com/HkPage.aspx?PAGEID=9124&SKIN=B |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-09-18 |archive-url=https://web.archive.org/web/20100103200705/http://haindavakeralam.com/hkpage.aspx?PageID=9124&SKIN=B |archive-date=2010-01-03 |url-status=dead }}</ref> ఈయన అల్లుడు [[అనిల్ కుమార్]] మత ప్రచారకుడు. బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మీలాను పెళ్ళి చేసుకున్న తర్వాత [[క్రైస్తవం]] స్వీకరించి మతప్రచారకుడయ్యాడు. ఈయన ప్రాభవం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే పెరగడంతో ఎన్నో విమర్శలకు ఊతమిచ్చినట్టైంది.
 
==హెలికాప్టర్ ప్రమాదంలో మృతి==