కపిల్ దేవ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
[[1976]]-[[1977|77]] సీజన్‌లో [[జమ్ము కాశ్మీర్]] పై ఓపెనింగ్ బౌలర్‌గా రాణించి 36 పరుగులకే 8 వికెట్లు పడగొట్టి తన జట్టును గెలిపించాడు. కాని మళ్ళీీ సీజన్‌లోనూ తదుపరి మ్యాచ్‌లలో రాణించలేడు. హర్యానా జట్టు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిమ్చడంతో అందులో 9 ఓవర్లు బౌలింగ్ చేసి 20 పరుగులకే 7 వికెట్లు సాధించి బెంగాల్ జట్టును 19 ఓవర్లలోనే 58 పరుగులకు కట్టడి చేశాడు.
 
[[1977]]-[[1978|78]] సీజన్‌లో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో 38 పరుగులకే 8 వికెట్లు సాధించి మరో సారి తన ప్రతిభను చాటిచెప్పాడు. అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్సులోనే 3 వికెట్లు సాధించి ఒకే అంతర్జాతీయ మ్యాచ్‌లో 10 వికెట్ల ఘనతను తొలిసారిగా పొందినాడు. తరువాత ఇదే ఘనతను టెస్ట్ క్రికెట్‌లో కూడా రెండు సార్లు సాధించాడు.
 
[[1978]]-[[1979|79]] సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఘనతను పొందినాడు. బ్యాటింగ్‌లో కూడా రెండూ అర్థశతకాలను సాధించాడు. [[ఇరానీ ట్రోఫి]]లో 8 వ నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా క్రీజులో ప్రవేశించి 62 పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫిలో 24 ఓవర్లలో 65 పరుగులకు 7 వికెట్లు సాధించి జాతీయ దృష్టిని ఆకర్షించాడు. దేవధర్ ట్రోఫి మరియు విల్స్ ట్రోఫీలలో నార్త్ జోన్ తరఫున తొలిసారి ప్రాతినిద్యం వహించాడు. ఇదే సీజన్‌లో కపిల్ దేవ్ పాకిస్తాన్ పై తొలి టెస్ట్ మ్యాచ్ కూడా ఆడి ఆరంగేట్రం చేశాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కపిల్_దేవ్" నుండి వెలికితీశారు