జావా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 2:
'''జావా''' అనేది [[సన్ మైక్రో సిస్టమ్స్]] రూపొందించిన ఒక [[కంప్యూటర్ భాష]] . దీనిని 1995 లో సన్ సంస్థ యొక్క జావా ప్లాట్ ఫాంలో ప్రధానమైన భాగంగా విడుదల చేశారు. దీని సింటాక్సు చాలా వరకు [[సీ]], [[సీ ప్లస్ ప్లస్]] లను పోలి ఉన్నప్పటికీ, వాటికంటే సులభతరమైన ఆబ్జెక్టు మోడల్ ఆధారంగా అభివృద్ధి చేయబడింది. కానీ ఇది ''సీ''/''సీ ప్లస్ ప్లస్'' లాగా క్రింది స్థాయి ప్రోగ్రామింగ్ చేయడానికి అంతగా అనుకూలించదు. జావా ప్రోగ్రాములు ఎక్జిక్యూట్ చెయ్యడానికి ముందు జావా కంపైలర్‌చే [[బైట్ కోడ్]] లోకి తర్జుమా చెయ్యాలి. ఈ బైట్ కోడ్ ఫైలును జావా వర్చువల్ మెషీన్ ఎక్జిక్యూట్ చేస్తుంది. జావా వర్చువల్ మెషీన్ అన్ని రకాలైన కంప్యూటర్లలో పనిచేసే విధంగా రూపొందించబడి ఉంటుంది. కాబట్టి జావా డెస్కుటాప్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, పిడిఏలు మొదలైన అన్ని రకాల కంప్యూటర్లలో పనిచేస్తుంది.
== చరిత్ర ==
1991లో ఒక సెట్ టాప్ బాక్సు ప్రాజెక్టు కోసం మొట్టమొదటి సారిగా జావాను తయారుచేసారు. దీని రూపకర్తలు జేమ్స్ గోస్లింగ్, పాట్రిక్ నాటన్, క్రిస్ వర్త్, ఎడ్వర్డ్ ఫ్రాంక్, మరియు మైక్ షెరిడాన్.<ref>Jon Byous, [http://java.sun.com/features/1998/05/birthday.html ''Java technology: The early years'']. Sun Developer Network, no date [ca. 1998]. Retrieved [[April 22]], [[2005]].</ref> ఇంకా బిల్ జాయ్, జోనాథన్ పేన్, ఫ్రాంక్ యెల్లిన్, ఆర్థర్ వాన్ హాఫ్, టిమ్ లింఢామ్ మొదలైన వారు దీన్ని అభివృద్ధి పరచడంలో పాలు పంచుకొన్నారు. మొట్ట మొదటి పనిచేసే వర్షన్ ను రూపొందించడానికి గోస్లింగ్ బృందానికి 18 నెలల సమయం పట్టింది. మొదట్లో జావాను [[ఓక్]] అని పిలిచేవారు (గోస్లింగ్ పని చేసే ఆఫీస్ బయట ఉండే ఓక్ వృక్షానికి గుర్తుగా ఆ పేరు పెట్టాడు). తరువాత [[గ్రీన్]] అనీ, చివరకు జావా అనీ రూపాంతరం చెందింది.<ref>http://blogs.sun.com/jonathan/entry/better_is_always_different {{Webarchive|url=https://web.archive.org/web/20090905083207/http://blogs.sun.com/jonathan/entry/better_is_always_different |date=2009-09-05 }}.</ref>
 
జావాను ఇప్పుడు ఇంటర్నెట్ అప్లికేషన్లలో విరివిగా వాడుతున్నప్పటికీ నిజానికి మొదట్లో దీన్ని ఇంటర్నెట్ ను దృష్టిలో పెట్టుకొని రూపొందించలేదు. మైక్రోవేవ్ ఒవెన్లు, రిమోట్ కంట్రోళ్ళు తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు దీనిని రూపొందించడానికి ప్రేరణ. వీటిలో చాలా రకాలైన సిపియు లను కంట్రోలర్లుగా వాడుతుంటారు. ఒక వర్చువల్ మెషీన్ను తయారు చేసి, దానికోసం సీ/సీ ప్లస్ ప్లస్ భాషలను పోలి ఉండే ఒక కంప్యూటరు భాషను తయారు చేయాలన్నది గోస్లింగ్ మొదట్లో నిర్దేశించుకున్న లక్ష్యాలు.<ref>Heinz Kabutz, [http://www.artima.com/weblogs/viewpost.jsp?thread=7555 ''Once Upon an Oak'']. Artima, Retrieved [[April 29]], [[2007]].</ref>
పంక్తి 52:
* [http://sunsite.uakom.sk/sunworldonline/swol-07-1995/swol-07-java.html Java: The Inside Story]
* [http://ei.cs.vt.edu/~wwwbtb/book/chap1/java_hist.html A history of Java]
* [https://web.archive.org/web/20120809054027/http://computing.open.ac.uk/m254/ M254 Java Everywhere] (free open content documents from the [http://www.open.ac.uk/ Open University])
* [http://java.sun.com/docs/books/jls/download/langspec-3.0.pdf Java Language Specification (pdf)]
 
"https://te.wikipedia.org/wiki/జావా" నుండి వెలికితీశారు