సప్తగిరి ఎక్స్‌ప్రెస్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
== కథ ==
రంగస్థల కళల్లో డిగ్రీ పూర్తిచేసిన సప్తగిరికి సినిమాలంటే ఇష్టంతో తన స్నేహితులో కలసి షార్ట్ ఫిల్మ్‌లు తీసుకుంటుంటాడు. నిజాయితీపరుడైన హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న సప్తగిరి తండ్రి శివప్రసాద్ తన కొడుకుని పెద్ద పోలీస్ ఆఫీసర్‌ని చేయాలని కలలు కంటూ ఉంటాడు. సప్తగిరి ఏరియాలోని మాణిక్యం అనే ముఠా నాయకుడు తన గ్యాంగ్‌తో చైన్ స్నాచింగ్‌లు, అమ్మాయిలను వ్యభిచార కూపాల్లోకి నెట్టడం వంటి అరాచకాలు చేస్తుంటాడు. ఆ మాణిక్యానికి డీఎస్పీ పాపాయమ్మ (పోసాని కృష్ణమురళి) తోడుగా ఉంటాడు. అంతేకాకుండా అమ్మాయిలను వ్యభిచార కూపాల్లోకి నెట్టే గ్యాంగ్‌ను పాపాయమ్మ భార్య (హేమ) నడిపిస్తుంటుంది. మాణిక్యం అరాచకాలు అరికట్టాలని, అతన్ని ఎన్‌కౌంటర్ చేయాలని ఎస్పీ (షాయాజీ షిండే) డీఎస్పీ పాపాయమ్మను ఆదేశిస్తారు. అయితే మాణిక్యం, డీఎస్పీ, అతని భార్య అక్రమ దందాలపై హెడ్‌కానిస్టేబుల్ శివప్రసాద్ రహస్యంగా ఒక నివేదిక తయారుచేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ.. మాణిక్యంతో శివప్రసాద్‌ను చంపించేస్తాడు. తన తండ్రిని చంపిన దుర్మార్గులపై సప్తగిరి పగ తీర్చుకోవడం మిగతా కథ.<ref>{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=చిత్రజ్యోతి (రివ్యూ) |title=సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ |url=https://www.andhrajyothy.com/artical?SID=349080 |accessdate=7 January 2020 |work=www.andhrajyothy.com |date=23 December 2016 |archiveurl=https://web.archive.org/web/20161225155108/https://www.andhrajyothy.com/artical?SID=349080 |archivedate=25 డిసెంబర్ 2016 |language=te |url-status=live }}</ref>
 
== నటవర్గం ==