త్యాగరాజ ఆరాధనోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
'''త్యాగరాజ ఆరాధన''' ప్రముఖ [[వాగ్గేయకారుడు]] [[త్యాగరాజు]]ను స్మరించుకుంటూ సంవత్సరానికి ఒకసారి జరిగే సంగీతోత్సవాలు. ఈ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు త్యాగయ్యకు తమ నివాళులు అర్పించడానికి విచ్చేస్తారు. ఈ ఉత్సవం త్యాగరాజు కావేరీ నది ఒడ్డున సమాధి సమీపంలో [[పుష్య బహుళ పంచమి]] నాడు జరుగుతుంది. ఈ రోజు సంగీత విద్వాంసులంతా ఆయన [[సమాధి]] చుట్టూ కూర్చుని ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారు.<ref>http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/tiruvaiyaru-gears-up/article3216630.ece</ref> సంగీతాన్ని ఆలపించే విద్వాంసులే కాక భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు ఆ సంగీతాన్ని వినడానికి అక్కడికి వస్తారు.<ref>http://www.saigan.com/heritage/music/aradhana.htm</ref>
== చరిత్ర ==
ఈ ఆరాధన ప్రతి సంవత్సరం త్యాగరాజు స్వామి పరమపదించిన రోజైన పుష్య బహుళ [[పంచమి]] రోజున ''శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ'' ఆధ్వర్యంలో జరుగుతుంది. తమిళనాడు లోని, [[తంజావూరు జిల్లా]], [[తిరువయ్యూరు]]లోని త్యాగరాజు సమాధి ప్రాంగణంలో ఈ ఉత్సవం జరుగుతుంది.<ref>{{Cite web |url=http://www.saintthyagarajar.com/aradhanafestival.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-05-06 |archive-url=https://web.archive.org/web/20090125091256/http://saintthyagarajar.com/aradhanafestival.htm |archive-date=2009-01-25 |url-status=dead }}</ref>
 
ప్రస్తుతం జరుగుతున్న ఆరాధనా సంప్రదాయానికి వంద సంవత్సరాలకన్నా తక్కువ వయసే ఉంటుంది. త్యాగరాజు 1847లో మరణించాడు. మరణానికి కొద్దిరోజుల ముందుగా ఆయన సాంప్రదాయ బద్ధంగా అన్నీ త్యజించి సన్యాసిగా మారాడు. ఆయన మరణించిన తరువాత భౌతిక కాయాన్ని కావేరీ నది ఒడ్డున ఖననం చేసి అక్కడే ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఆయన శిష్యులంతా వారి వారి స్వస్థలాలకు చేరుకుని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని వారి ఇళ్ళలోనే జరుపుకునే వారు. 1903 సంవత్సరం వచ్చేసరికి ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన స్మారక నిర్మాణం పాడుపడిపోయే స్థితికి వచ్చింది. అప్పుడే, ఆయన దగ్గర విద్యనభ్యసించిన ఇద్దరు విద్యార్థులు దాన్ని సందర్శించడం జరిగింది. వారే ప్రముఖ సంగీత విద్వాంసులు ఉమయాల్పురం కృష్ణ భాగవతార్, మరియు సుందర భాగవతార్లు. వారు తమ గురువు సమాధికి అలాంటి పరిస్థితి కలగడం చూసి చలించిపోయారు. అప్పటికప్పుడే ఆ ప్రాంతాన్ని పునరుద్ధరణకు ఏర్పాట్లు చేశారు. ప్రతిసంవత్సరం ఆయన వర్థంతిని అక్కడే జరపడానికి నిశ్చయించారు.