తిరుమల బ్రహ్మోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
===గరుడ వాహనం===
[[బొమ్మ:garudavahanam.jpg|right|thumb|200px|శ్రీవారి గరుడ వాహనం]]
స్వామివారి ప్రధాన వాహనం [[గరుడుడు]]. అందుకే గరుడుడిని 'పెరియ తిరువాడి' (ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు) అంటారు. అయిదోరోజు రాత్రి జరిగే ఈ సేవకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో అన్నిరోజులూ ధృవబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడవాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్పస్వామికి అలంకరింపజేస్తారు. అలాగే ఈరోజునే, శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడీ [[ఆంజనేయస్వామి]] ఆలయం నుంచి రాష్ట్ర ప్రజల తరఫున [[ముఖ్యమంత్రి]] సమర్పించే నూతన వస్త్రాలను స్వామివారు స్వీకరిస్తారు. గరుడ వాహనసేవలో స్వామి సరసన దేవేరులు ఉండరు.
 
ఆరోజు ఉదయం, హనుమద్వాహనసేవ జరుగుతుంది. [[హనుమంతుడు]], [[శ్రీరాముడు|శ్రీరాముని]] నమ్మినబంటు. త్రేతాయుగంలో తనకు అపార సేవలందించిన ఆ భక్తుడిని తాను మర్చిపోలేదంటూ, ఆ బంటుకు మళ్ళీ తన సేవాభాగ్యం కలిగించే దివ్య దృశ్యం ఇది. తాను సైతం ఆ మహా[[విష్ణువు]] స్వరూపమేనని భక్తులకు స్వామి తెలియజేసే మధుర సన్నివేశమది.