సమాచార ఉపగ్రహం: కూర్పుల మధ్య తేడాలు

చి Remove categories to move them to talk page later
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 4:
వైర్‌లెస్ సమాచార వ్యవస్థ, సిగ్నళ్ళ ప్రసారం కోసం విద్యుదయస్కాంత తరంగాలను వాడుతుంది. ఈ తరంగాలు ప్రయాణం చేసేందుకు గాను మూలము, గమ్యమూ రెండూ కూడా ఒకదానికొకటి ''కనబడే '' రేఖలో (దృగ్రేఖ - లైన్ ఆఫ్ సైట్) ఉండాలి. అంచేత గోళాకారపు భూమి యొక్క వక్రత వీటిని అడ్డగిస్తుంది. సమాచార ఉపగ్రహం, మూలం  నుండి (ఈ రెండూ దృగ్రేఖలో ఉంటాయి కాబట్టి) ఈ సిగ్నళ్ళను స్వీకరించి, తిరిగి గమ్యానికి పంపిస్తుంది (ఈ రెండూ కూడా దృగ్రేఖలోనే ఉంటాయి కాబట్టి). తద్వారా సమాచార సిగ్నళ్ళు భూమి వక్రతను అధిగమిస్తాయి.<ref>{{వెబ్ మూలము|url=http://satellites.spacesim.org/english/function/communic/index.html|title=Satellites - Communication Satellites|publisher=Satellites.spacesim.org|accessdate=2016-02-10}}</ref>
 
సమాచార ఉపగ్రహాలు విస్తృతమైన రేడియో, మైక్రోవేవ్ పౌనఃపున్యాలను (ఫ్రీక్వెన్సీ) వాడుతాయి. వివిధ సిగ్నళ్ళు ఒకదానికొకటి అడ్డగించుకోకుండా ఉండేందుకు ఏయే సంస్థలు ఏయే పౌనఃపున్యాల బ్యాండ్లను వాడవచ్చుననే విషయమై నిబంధనలను ఏర్పరచారు. ఈ బ్యాండ్ల కేటాయింపు కారణంగా సిగ్నళ్ళ అడ్డగింపు బాగా తగ్గిపోయింది.<ref name="aerospace.org">{{cite web|url=http://www.aerospace.org/2013/12/12/military-satellite-communications-fundamentals/|title=Military Satellite Communications Fundamentals &#124; The Aerospace Corporation|date=2010-04-01|accessdate=2016-02-10|website=Aerospace|archive-url=https://web.archive.org/web/20150905170449/http://www.aerospace.org/2013/12/12/military-satellite-communications-fundamentals/|archive-date=2015-09-05|url-status=dead}}</ref>
 
== చరిత్ర ==
పంక్తి 17:
1968 లో ప్రయోగించిన ప్రాజెక్ట్ SCORE అమెరికా వారి మొదటి సమాచార ఉపగ్రహం. దానిలో ఒక టేపు రికార్డరును ఉంచి మౌఖిక సందేశాలను రికార్డు చేసి తిరిగి ప్రసారం చేసారు. అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్‌హోవర్ ప్రపంచానికి క్రిస్ట్‌మస్ శుభాకాంక్షలను దాని ద్వారా ప్రసారం చేసారు.<ref>{{cite url|title=Communications Satellites|url=http://www.satmagazine.com/story.php?number=768488682|publisher=AIAA|edition=5th|date=March 16, 2007|isbn=978-1884989193|last1=Martin|first1=Donald|last2=Anderson|first2=Paul|last3=Bartamian|first3=Lucy}}</ref> ఫిల్కో నిర్మించిన కొరియర్ 1B, మొట్టమొదటి తక్షణ రిపీటర్ ఉపగ్రహం. 
 
సమాచార ఉపగ్రహాల్లో రెండు రకాలున్నాయి - పాసివ్, యాక్టివ్. పాసివ్ ఉపగ్రహాలు తమ వద్దకు వచ్చిన స్సిగ్నలును రిసీవరు దిశగా ప్రతిఫలిస్తాయి, అంతే. అవి సిగ్నలును ఉద్దీపనం (యాంప్లిఫై) చెయ్యవు. అందుచేత ట్రాన్స్‌మిట్టరు వద్ద సిగ్నలులో ఉన్న శక్తి రిసీవరు వద్దకు చేరుకునేసరికి బాగా క్షీణించి చాలా బలహీనంగా ఉంటుంది. ఉపగ్రహం భూమినుండి చాలా ఎత్తులో ఉండడం చేత, అంతరిక్షంలో ప్రయాణించేటపుడు శక్తిని కోల్పోవడం చేత ఇలా జరుగుతుంది. యాక్టివ్ ఉపగ్రహాలు తమ వద్దకు వచ్చిన సిగ్నలును ఉద్దీపించి, తిరిగి రిసీవరుకు ప్రసారం చేస్తాయి.<ref name="aerospace.org2">{{cite web|url=http://www.aerospace.org/2013/12/12/military-satellite-communications-fundamentals/|title=Military Satellite Communications Fundamentals &#124; The Aerospace Corporation|date=2010-04-01|accessdate=2016-02-10|website=Aerospace|archive-url=https://web.archive.org/web/20150905170449/http://www.aerospace.org/2013/12/12/military-satellite-communications-fundamentals/|archive-date=2015-09-05|url-status=dead}}</ref> తొలి సమాచార ఉపగ్రహాలు, పాసివ్ ఉపగ్రహాలే. అయితే ఇవి ప్రస్తుతం అంతగా వినియోగంలో లేవు. AT&T కి చెందిన టెల్‌స్టార్, రెండవ సమాచార ఉపగ్రహం. ఉపగ్రహ సమాచారాన్ని అభివృద్ధి చెయ్యాలని వివిధ దేశాలకు చెందిన సంస్థలు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందానికి అనుగుణంగా దీన్ని తయారుచేసి, ప్రయోగించారు. 1962 జూలై 10 న [[నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్|నాసా]] దీన్ని కేప్ కానెవరల్ నుండి ప్రయోగించింది. ఇది ప్రైవేటు సంస్థలు స్పాన్సరు చేసిన మొట్టమొదటి ఉపగ్రహం. 1962 డిసెంబరు 13 న ప్రయోగించిన రిలే 1, 1963 నవంబరు 22 న మొట్టమొదటిసారిగా పసిఫిక్ మహా సముద్రం ఒకవైపు నుండి రెండో వైపుకు సిగ్నలును ప్రసారం చేసింది.<ref name="NASA-SP-93">{{cite web|url=http://ntrs.nasa.gov/archive/nasa/casi.ntrs.nasa.gov/19660009169_1966009169.pdf|title=Significant Achievements in Space Communications and Navigation, 1958-1964|accessdate=2009-10-31|publisher=NASA|year=1966|pages=30–32|work=NASA-SP-93}}</ref>
 
భూస్థిర ఉపగ్రహాల కంటే కొద్దిగా ముందు వచ్చింది, సింకామ్ 2. 1963 జూలై 26 న ప్రయోగించిన సింకామ్ 2, [[భూ సమన్వయ కక్ష్య]] (జియోసింక్రొనస్ ఆర్బిట్) లోని మొట్టమొదటి సమాచార ఉపగ్రహం. ఇది భూభ్రమణ వేగంతో సమానమైన కోణీయ వేగంతో పరిభ్రమించినప్పటికీ భూ సమన్వయ కక్ష్యలో ఉండడం చేత, దీనికి ఉత్తర-దక్షిణ చలనం ఉండేది. ఈ కారణంగా దీన్ని రిసీవర్లు సరిగా అనుసరించడం కోసం ప్రత్యేక పరికరాలు వాడాల్సి వచ్చేది. దాని తర్వాత వచ్చిన సింకామ్ 3, మొట్టమొదటి భూస్థిర సమాచార ఉపగ్రహం.
"https://te.wikipedia.org/wiki/సమాచార_ఉపగ్రహం" నుండి వెలికితీశారు