స్టెతస్కోప్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధ → గ్రంథ (2) using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 10:
ఈ స్టెతస్కోప్ ఉపయోగంతో లెనెక్ ఇంతకుముంచు తెలియని ఎన్నో రోగాల లక్షణాల్ని కనుగొని వాటిని నమోదుచేశాడు. 1818లో "Societe de I'Ecole de Medicine"కు అతను ఒక పత్రాన్ని సమర్పించాడు. తరువాతి సంవత్సరం అతను కనుగొన్న పరిశోధనల్ని వివరిస్తూ ఒక గ్రంథాన్ని ప్రచురించాడు. ఒక్కొక్క గ్రంథ ప్రతితో సహా అతను నిర్మించిన స్టెతస్కోపులు కూడా అమ్మబడ్డాయి. లేనెక్ తన 45వ ఏట పిన్న వయసులోనే [[క్షయ వ్యాధి]] పీడితుడై చనిపోవడం శోచనీయం.
[[Image:Stethoscope pink.JPG|thumb|అకస్టిక్ స్టెతస్కోపు.]]
తదుపరి వైద్యుల్ని చూడగానే గుర్తించేలాగ స్టెతస్కోప్‌ లు వారి పరికరాలయ్యాయి. కాలం గడిచేసరికి లెనెక్ కనుగొన్న మోనారల్ స్టెతస్కోప్‌కు (దానికి ఆ పేరు రావడానికి కారణం ఒక చెవికే అది వాడబడేది) పరిశోధకులు మెరుగులు దిద్దారు. దానిలో చెప్పుకోదగ్గది పియెర్ అడాల్ఫ్ పియరీ (1794-1879)ది. అతను "ప్లెక్సిమీటెర్" అనే యింకొక పరికరాన్ని స్టెతస్కోప్‌లోకి చేర్చి స్టెతస్కోప్ పరిమాణాన్ని సగానికి తగ్గించాడు. వంగేలాటి సరళమైన మోనారల్ స్టెతస్కోప్‌లు కూడా ప్రవేశపెట్టాయి. వీటికి 14 నుండి 18 అంగుళాలు పొడుగుగా పట్టుతో కప్పబడిన స్ప్రింగులకు ఒక వైపు గుండె ఆనించుకునేలాటి బిళ్ళ, మరిఒకవైపు చెవికి వినిపించడానికి ఒక చిన్న బిళ్ళ చేర్చబడ్డాయి<ref>Samuel Wilks, "Evolution of the stethoscope", ''Popular Science'', '''vol.22''', no.28, pp.488-491, Feb 1883 {{ISSN|0161-7370}}.<br />Golding Bird, [http://books.google.co.uk/books?id=9FXVoGcVJygC&pg=PA440#v=onepage&q&f=true "Advantages presented by the employment of a stethoscope with a flexible tube"], ''London Medical Gazette'', '''vol.1''', pp.440-412, 11 December 1840.</ref>. ఇంకొక మాదిరి స్టెతస్కోపును 1828లో చార్లెస్ జేంస్ బ్లూసియస్ నిర్మించాడు<ref>Wilks, p.490, cites Comins, "A flexible stethoscope", ''Lancet'' 29 August 1829.</ref>.లెనెక్ పరికరం కంటే యిది చిన్నది. సుకరమైనది కూడా. ఆ తరువాత థెర్మోమీటర్ లాటి వైద్య పరికరాలను కూడా తీసుకుని వెళ్ళేలా స్టెతస్కోపులు ఉపకరించాయి<ref>{{cite web|last=Duffin|first=Jacalyn|title=Big Ideas: Jacalyn Duffin on the History of the Stethoscope|url=http://ww3.tvo.org/video/182217/jacalyn-duffin-history-stethoscope|publisher=TVO|accessdate=28 November 2012|website=|archive-url=https://web.archive.org/web/20130927173037/http://ww3.tvo.org/video/182217/jacalyn-duffin-history-stethoscope|archive-date=27 సెప్టెంబర్ 2013|url-status=dead}}</ref>. ఏనుగు దంతంలాటి విలువైన వస్తువులతో మోజు గొలిపేలా నిర్మించబడ్డ స్టెతస్కోపుల్ని ఉన్నత వర్గ వైద్యులు వాడుకునేవారు. మోనారల్ స్టెతస్కోప్ 30 ఏళ్లకు పైగా వాడుకలో ఉన్నాక పరిశోధకులు రెండు చెవులతో వాడుకునేలాటి పరికరాన్ని నిర్మించడం గురించి ఆలోచించారు. అయితే రష్యాలో, ఇంగ్లాండులోనూ 19వ శతాబ్దం మధ్య భాగం వరకు ఈ మోనరల్ స్టెతస్కోప్ అధిక వ్యాప్తిని పొందింది.
==వ్యాపార రంగంలో స్టెతస్కోపు==
సిన్సినాటిలో 1851లో డా.మార్ష్ బైనారల్ స్టెతస్కోప్ నమూనాను వ్యారపరంగా ప్రవేశపెట్టి ఆద్యుడయ్యాడు. యాభై ఏళ్ళ తరువాత గుండెపై ఉంచుకునే విభాజకం గురించి ఆలోచన కార్యరూపం దాల్చింది. [[న్యూయార్క్]] లో నార్తెర్న్ డిస్పన్సరీలోని డా.జార్జ్ కామంకు మార్ష్ నమూనాపై ఆధారపడిన్ బైనారల్ స్టెతస్కోప్‌ను 1855లో కనుగొన్న ఫలితం దక్కింది. ఈ నమూనాకు ప్రజాదరణ కలగడానికి పదేళ్ళు పట్టింది. 1863లో ఒకేసారి శ్రోత గుండెలో రెండు వివిధ ప్రదేశాలలో చప్పుడు విని పరిశీలించేలా రెండు చెస్ట్ పీసులతో వేరే స్టెతస్కోప్‌ను స్కాట్ అలీసన్ కనుగొన్నాడు. కాని యిది ఆచరణ సాధ్యమనిపించుకోలేదు. 1884లో ఐడన్ స్మిత్ విభిన్నమైన బైనారల్ స్టెతస్కోప్‌ను మూత్ర సంబంధియైన సూక్ష్మనాళికగానూ, రక్తస్రావాన్ని ఆపేట్టుగానూ నిర్మించాడు. 1885లో ఫోర్ద్ గంట చెస్ట్ పీస్ కనుగొనబడింది. చెవులకు గొట్టాలలోని చప్పుడును రెండు రబ్బర్ గొట్టాల ద్వారా ప్రసరింపజేసేలాగ ఒక ఉక్కు చెస్ట్ పీస్ అడుగు భాగం నల్ల చేవమాను లేక దంతంతో వుండేలాగ నిర్మితమైంది. 1910లో మళ్ళీ విభాజక చెస్ట్ పీస్ ప్రవేశించే అవకాశం కలిగింది. ఫోర్డ్ గంటని పలుచటి పొరతో సన్నటి చప్పుడును గాలనం చేసి, ఎక్కువ ధ్వని ప్రసరించడానికి సాధ్యమయింది. ఇప్పుడు వాడుకలో వున్న నవీన స్టెతస్కోప్‌కు ఇది ప్రమాణమైంది.
"https://te.wikipedia.org/wiki/స్టెతస్కోప్" నుండి వెలికితీశారు