లక్ష్మి (నటి): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 20:
లక్ష్మి 1975లో విజయవంతమైన హిందీ చిత్రం జూలీలో ప్రధాన పాత్ర పోషించిన నటిగా ప్రసిద్ధి చెందింది. ఆ సినిమాలో లక్ష్మి నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నది.<ref>[http://deep750.googlepages.com/FilmfareAwards.pdf 1st Filmfare Awards 1953]</ref>
 
ఈమె తండ్రి వై.వి.రావు [[నెల్లూరు జిల్లా]]కు చెందిన ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, నటుడు అనేక ప్రముఖ సాంఘిక విషయాలపై ఆధారితమైన సినిమాలను నిర్మించాడు.<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/fr/2003/08/22/stories/2003082201400400.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-05-24 |archive-url=https://web.archive.org/web/20090626045843/http://www.hinduonnet.com/thehindu/fr/2003/08/22/stories/2003082201400400.htm |archive-date=2009-06-26 |url-status=dead }}</ref> ఈమె తల్లి [[రుక్మిణి]] తమిళ నటి. అమ్మమ్మ నుంగబాక్కం జానకి కూడా నటే. కళాకారుల కుటుంబంలో జన్మించిన లక్ష్మి మూడవ తరము నటి. 15 యేళ్ల వయసులోనే సినీరంగంలో ప్రవేశించింది. ఈమె తొలి సినిమా 1968 లో విడుదలైన తమిళ సినిమా "జీవనాంశమ్". 1970వ దశకంలో తారగా వెలుగొందిన లక్ష్మి దక్షిణ భారత భాషలన్నింటిలో నటించింది. ఈమె నటించిన మలయాళంలో విజయవంతమైన చట్టకారి (1974) చిత్రాన్ని హిందీలో జూలీ (1975) అనే పేరుతో, [[తెలుగు]]లో "మిస్ జూలీ ప్రేమకథ" (1975) గా పునర్నిర్మించి విడుదల చేశారు. జూలీ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు బెంగాళీ సినీ పాత్రికేయ సంఘం యొక్క "సంవత్సరపు ఉత్కృష్ట నటన" పురస్కారాన్ని అందుకున్నది. <ref>[{{Cite web |url=http://www.bfjaawards.com/legacy/pastwin/197639.htm |title=69th & 70th Annual Hero Honda BFJA Awards 2007] |website= |access-date=2009-05-24 |archive-url=https://web.archive.org/web/20080119012515/http://www.bfjaawards.com/legacy/pastwin/197639.htm |archive-date=2008-01-19 |url-status=dead }}</ref> జూలీ చిత్రం యొక్క విజయం తర్వాత లక్ష్మి మరే హిందీ చిత్రంలోనూ నటించక దక్షిణాది భాషల సినిమాలపైనే దృష్టిపెట్టింది. 1977లో విడుదలైన తమిళ సినిమా [[శిలా నేరంగలిల్ శిలా మణితారగళ్]] లో నటనకు జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని అందుకొని ఆ పురస్కారం తమిళ సినిమాకై అందుకొన్న దక్షిణాదికి చెందిన తొలి నటి అయ్యింది. 1980లలో కథానాయకి పాత్రలు కరువైన తరుణంలో తల్లి పాత్రలు, అమ్మమ్మ పాత్రలలో సహాయనటిగా చేయటం ప్రారంభించింది. జీన్స్ (1998) చిత్రంలో ఐశ్వర్యా రాయ్ బామ్మ గానూ, హల్‌చల్ (2004) లో కరీనా కపూర్ బామ్మగానూ నటించింది. 400కు పైగా సినిమాలు చేసిన లక్ష్మి, రాజకీయాలలో కూడా అడుగుపెట్టింది.
 
==వ్యక్తిగత జీవితము==
"https://te.wikipedia.org/wiki/లక్ష్మి_(నటి)" నుండి వెలికితీశారు