జైన మతం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 130:
== ఆంధ్రప్రదేశ్ లో జైన మతం ==
జైనగాథల ప్రకారం జైనమతం క్రీ.పూ నాలుగో శతాబ్దానికే ఆంధ్రదేశంలో ప్రవేశించినట్లు తెలుస్తోంది. [[కళింగ]] రాజైన [[ఖారవేలుడు|ఖారవేలుడి]] ఆదరణ వల్ల కృష్ణా నదికి ఉత్తరంగా తీరప్రాంతంలో ముందంజ వేసింది. అశోకుడి పుత్రుడు సంప్రతి ఆంధ్ర, ద్రవిడ దేశాల్లో జైన వ్యాప్తికి కృషి చేశాడు. [[అమరావతి]] సమీపంలోని వడ్డమాను కొండపై సంప్రతి విహారం ఏర్పడింది. అక్కడే ఖారవేలుడు మహామేఘ వాహన విహారం నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తోంది.
క్రీస్తు శకారంభంలో సుప్రసిద్ధ జైనాచార్యుడైన కొండకుందాచార్యుడు కొనకుండ్ల (అనంతపురం జిల్లా) లో ఆశ్రమం నిర్మించుకుని మతప్రచారం చేస్తూ సిద్ధాంత గ్రంథాలు రచించాడు. వాటిలో సమయసార అనే గ్రంథం శ్వేతాంబర, దిగంభర శాఖలకు ఆదరణీయమైంది.ఆంధ్రదేశంలో జైనమతము బహుళ ప్రాచుర్యము పొందినది అనడానికి ఇక్కడ వారు నిర్మించుకున్న గుహల వలన కొంత రుజువు చెందుతుంది.
[[గుంటుపల్లి (కామవరపుకోట)]] లోని గుహలు బీహారులోని అజీవకు లకు నిర్దేశింపబడిన గుహలకు వాస్తు విషయములలో ఏమాత్రము తేడా కనపడనందున ఇవి జైన మతమునకు సంబందించిన గుహలగానే చెప్పుచుందురు. ఇవికాక [[రామతీర్థం (నెల్లిమర్ల)]] , [[శాలిహుండం]] మొదలగుచోట రాతితో మలచబడిన చిన్న చిన్న ఉద్దేశిక స్తూపములు, జైన స్వస్తిక చిహ్నములు ఇక్కడ జైన మతవ్యాప్తికి చిహ్నములు. ఒరిస్సా-కోస్తా ఆంధ్రప్రాంతములలోని అవశేషములు, కృష్ణా నదీతీర ప్రాంత అవశేషములు రెండూ భిన్న సాంప్రదాయములను సూచిస్తున్నవి. శాలిహుండులోని అవశేషములు, అమరావతిలో కొన్ని అవశేషములు రెండును మౌర్యుల కాలమునాటివే.వీరికాలమున అయోధ్యలోని ఇక్ష్వాకు వంశపు రాజులు కొంతమంది కోస్తా ప్రాంతములోని జైనసాంప్రదాయమునకు కారకులని కొంతమంది చరిత్రకారులు ఊహించుచున్నారు.అందుకే కోస్తా ప్రాంత అవశేషములకు కృష్ణాతీర అవశేషములకు కొంతతేడా కనిపించును. కోస్తా ప్రాంతమును ఏలిన చాళుక్యరాజగు కుబ్జ విష్ణువర్ధనుడు, జైనమతముపట్ల ఎక్కువ అభిమానమున్నవాడు. ఇతని భార్య అయిన మహాదేవి విజయవాడలోని దుర్గ కొండపై నదుంబవసతి అని వసతి ప్రదేశమును జైనులకు స్థాపించెను.ఇది ప్రజ్ఞాశాలి అయిన కవి భద్రాచార్యుని ఆధ్వర్యంలో ఉండేది. ఇట్లు అనేక జైన మత ప్రవక్తలు ఆంధ్రదేశమునందు వచ్చి జైన క్షేత్రములను ఏర్పరిచిరి. కాని బౌద్ధముయందున్న నమ్మకము, ఆంధ్ర ప్రజలకు జైనులయందు లేకుండెను. ఏలనలన జైనమునందు కర్మకాండలు ఆచరించుట ఎంతో కష్టముగా ఉండేవి. బౌద్ధులు మాధ్యమికవాదము అర్ధము చేసుకొనుటకు, సులభముగా ఉండుటయేకాక, ఆచార్య నాగార్జునుడు, జయప్రజాచార్యులు, ఆర్యదేవుడు మొదలగు ప్రతిభావంతులు బౌద్దమత ప్రగతికి దోహదపడిరి.
 
== అహింస ==
"https://te.wikipedia.org/wiki/జైన_మతం" నుండి వెలికితీశారు