మురళీ మనోహర్ జోషి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 58:
ఈయన తన చిన్న వయసులో ఆర్‌ఎస్‌ఎస్‌తో సంప్రదించి, 1953–54లో ఆవు రక్షణ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1955 లో ఉత్తరప్రదేశ్ కి చెందిన కుంబ్ కిసాన్ ఆండోలన్‌లో పాల్గొని, భూమి ఆదాయ అంచనాను సగానికి తగ్గించాలని కోరాడు. భారతదేశంలో అత్యవసర కాలంలో (1975-1977), జోషి 26 జూన్ 1975 నుండి 1977 లోక్ సభ ఎన్నికల వరకు జైలులో ఉన్నాడు. ఈ ఎన్నికల్లో అల్మోరా నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. భారత చరిత్రలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జనతా పార్టీ (అప్పటి తన పార్టీని కూడా కలిగి) అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన జనతా పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1980 లో జనతా పార్టీ పేరు భారతీయ జనతా పార్టీ లేదా బిజెపిగా మార్చారు. ఈయన మొదట కేంద్ర కార్యాలయాన్నికి ప్రధాన కార్యదర్శిగా, ఆ తరువాత పార్టీ కోశాధికారి నియమించబడ్డాడు. ఈయన బీహార్, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. ఆ తరువాత, అటల్ బిహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో బిజెపి భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఈ మంత్రివర్గంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా పనిచేశాడు. ఈయన బీజేపీ అభ్యర్థిగా వారణాసి నియోజకవర్గం నుండి 15 వ లోక్‌సభకు ఎన్నికైయ్యాడు. ఈయన 1996 లో 13 రోజుల పాటు ప్రభుత్వానికి హోంమంత్రిగా పనిచేశాడు. 2009 లో బీజేపీ మానిఫెస్టో ప్రిపరేషన్ బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యాడు. వారణాసి నుండి సిట్టింగ్ ఎంపిగా ఉన్న ఈయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి ఆ సీటు కోసం వదులుకున్నాడు. కానీ కాన్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 2.23 లక్షల ఓట్ల తేడాతో గెలిచాడు.
==మరిన్ని విశేషాలు==
ఈయన భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో సభ్యుడు. ఈయన బిజెపి ముఖ్య నాయకులలో ఒకరిగా ఉన్నారు. ఈయన 1991 మరియు 1993 మధ్య భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన కాన్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి మాజీ పార్లమెంటు సభ్యుడు. ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశాడు. ఈయనకు భారత ప్రభుత్వం 2017 లో రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్‌ పురస్కారంతో ఈయనను సత్కరించింది.
 
==మూలాలు==
{{Reflist}}
"https://te.wikipedia.org/wiki/మురళీ_మనోహర్_జోషి" నుండి వెలికితీశారు