యం.యస్.స్వామినాధన్: కూర్పుల మధ్య తేడాలు

3 మూలాలను భద్రపరచి వాటిని 0 పనిచేయనివిగా గుర్తించాను) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 30:
స్వామినాథన్ 1925 [[ఆగష్టు 7]] న [[తమిళనాడు]]లోని [[కుంభకోణం]]<nowiki/>లో జన్మించాడు. అతను డా.ఎం.కె.సాంబశివన్, పార్వతి దంపతులకు రెండవ కుమారుడు. అతను తన తండ్రి నుంచి "మన మనస్సులో 'అసాధ్యం' అనే మాట సాధారణంగా వస్తుంది. దానికి ధృఢ సంకల్పంతో కృషిచేసిన తరువాత గొప్పపనులు సాధించవచ్చు." అనే విషయాన్ని నేర్చుకున్నాడు. వైద్యవృత్తిలో ఉన్న అతని తండ్రి ఎం.కె. సాంబశివన్ మహాత్మాగాంధీ అనుచరుడు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువుల బహిష్కరణ సందర్భంగా [[కుంభకోణం]]<nowiki/>లో అతని విదేశీ దుస్తులను దగ్దం చేసాడు. స్వదేశీ ఉద్యమం భారతీయులు విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా, గ్రామీణ పరిశ్రమను కాపాడడటం అనే రాజకీయ ప్రయోజనంతో రూపొందించబడినది. అతని తండ్రి తమిళనాడులో భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జరిగిన దేవాలయ ప్రవేశ ఉద్యమంలో దళితుల ఆలయ ప్రవేశ కార్యక్రమానికి నాయకత్వం వహించాడు. [[ఫైలేరియా|ఫైలేరియాసిస్]] అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న కుంభకోణం ప్రాంతంలో ఆ వ్యాధిని నిర్మూలించడానికి అతని తండ్రి కృషిచేసాడు. తన తండ్రి చేస్తున్న కార్యక్రమాల వల్ల బాల్యంలో అతనికి సేవాభావన కలిగింది.
 
తన 11వ యేట తండ్రి మరణించాడు. అతని భాద్యతలను అతని మామయ్య ఎం.కె.నారాయణస్వామి (రేడియాలజిస్టు) చూస్తుండేవాడు. ప్రారంభ విద్యను స్థానిక పాఠశాలలో చదివాడు. తరువాత కుంభకోణంలోని కాథలిక్ లిటిల్ ఫ్లవర్ హైస్కూలు లో చదివి మెట్రిక్యులేషన్ ను పూర్తిచేసాడు.<ref>The 1971 Ramon Magsaysay Award for Community Leadership [http://www.rmaf.org.ph/Awardees/Biography/BiographySwaminathanMS.htm/ "BIOGRAPHY of Moncompu Sambasivan Swaminathan"/] {{Webarchive|url=https://web.archive.org/web/20100721221524/http://www.rmaf.org.ph/Awardees/Biography/BiographySwaminathanMS.htm |date=2010-07-21 }} Retrieved on 26 March 2013</ref> వైద్యులు గల కుటుంబ నేపథ్యంలో అతను మెడికల్ పాఠశాలలో చేరాడు. కానీ అతను 1943 నాటి భయంకరమైన బెంగాల్ కరువును చూసినప్పుడు, భారతదేశం నుండి ఆకలిని తొలగించటానికి తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను [[మహాత్మా గాంధీ]] చే ప్రభావితమై ఈ నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే అతను వైద్యరంగం నుండి వ్యవసాయ రంగానికి మారిపోయాడు.<ref>[https://m.youtube.com/watch?v=UPHgwdAF-LY MS Swaminathan - On future of Indian agriculture], YouTube</ref> అతను కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం లోని మహారాజా కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తిచేసాడు. అతను ఆ కళాశాలలో 1940 నుండి 44 వరకు చదివి జంతుశాస్త్రంలో బి.యస్సీ డిగ్రీని తీసుకున్నాడు.
 
ఎం.ఎస్. స్వామినాథన్ వివాహం మీనా స్వామినాథన్ తో జరిగింది. 1951లో కేంబ్రిడ్జ్ లో చదివినప్పుడు ఆమె పరిచయమయింది. వారు తమిళనాడులోని చెన్నైలో నివసించారు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఐదుగురు మనుమలు ఉన్నారు. వారి కుమార్తెలలో డా.సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు డిప్యూటీ డైరక్టరు జనరల్ గానూ, రెండవ కుమార్తె డా. మధుర స్వామినాథన్ బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో ఆర్థిక శాస్త్రంలో అధ్యాపకురాలిగానూ, మూడవ కుమార్తె నిత్యా స్వామినాథన్ ఉత్తర అంగోలియా విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/యం.యస్.స్వామినాధన్" నుండి వెలికితీశారు