ఋతు సంహారము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎కథావస్తువు: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 3:
[[విశ్వనాథ సత్యనారాయణ]] రచించిన ఈ ఋతు సంహార కావ్యానికి మూలకథావస్తువు, కావ్యరచన విషయంలో కాళిదాసు రచించిన '''ఋతు సంహారము''' కావ్యం ప్రభావం ఉంది. ఆ ప్రభావం నేరుగా ఆయన ఎంచుకున్న కావ్యనామంపైనే కనిపిస్తోంది.<ref name="మసన చెన్నప్ప-తెలుగు ఋతువులు">{{cite book|last1=చెన్నప్ప|first1=మసన|title=విశ్వనాథ సాహితీ సమాలోచనం (తెలుగు ఋతువులు)|date=సెప్టెంబరు 3, 1995|publisher=యువభారతి|location=హైదరాబాద్|edition=ప్రథమ ముద్రణ}}</ref> కానీ విశ్వనాథ సత్యనారాయణ రచనలోని వర్ణనలపై మాత్రము ఆ ప్రభావమేమీలేదు సరికదా ఆయన చిన్నతనంలో చూచిన తెలుగు వాతావరణం వర్ణనలే ఉన్నాయి. ఈ కావ్యాన్ని నిజజీవితంలో విశ్వనాథ సత్యనారాయణ తన చిన్నతనంలో చూసిన పల్లెజీవితంలోని తెలుగు ఋతువులనే వర్ణించానని తెలిపారు<ref name="విశ్వనాథలోని నేను">{{cite book|last1=భరతశర్మ|first1=పేరాల|title=విశ్వనాథ శారద (విశ్వనాథలోని నేను వ్యాసం)|date=సెప్టెంబరు, 1982|publisher=విశ్వనాథ స్మారక సమితి|location=హైదరాబాదు}}</ref>.
== కథావస్తువు ==
తెలుగు ఋతువులు కావ్యానికి కథావస్తువు తెలుగు నాట [[వసంత ఋతువు|వసంత]], గ్రీష్మాది ఋతువులు ఎలా ప్రవర్తిల్లుతాయి, వాటి వల్ల ప్రజాజీవితంలో సూక్ష్మమైన భేదాలు ఎలా వాటిల్లుతాయి, ఆచార వ్యవహారాలు ఎలా వుంటవి మొదలైన విషయాలతో కూడివుంటుంది. ఇది వర్ణన ప్రధానమైన [[కావ్యము]]. కేవల ఋతువర్ణనలకే పరిమితం కాకుండా ప్రత్యేకించి తెలుగు నాట ఆయా ఋతువులు ఎలా వుంటాయన్నది రచించడం వల్ల ఈ కావ్యానికొక ప్రత్యేకత ఏర్పడింది. ఇదే పేరుగల తన కావ్యాన్ని కాళిదాస మహాకవి గ్రీష్మ ఋతువుతో ప్రారంభించగా విశ్వనాథ సత్యనారాయణ మాత్రం దీనిని వసంతంతో ప్రారంభం చేశారు. వసంత ఋతువు అందరికీ ప్రీతిపాత్రమైనదనే కాక [[తెలుగు]] వారి తొలి పండుగైన [[సంవత్సరాది]] [[వసంతం]]<nowiki/>లోనే ప్రారంభమవడమూ కారణం కావచ్చు. తెలుగు నేల మీద పల్లె [[ప్రకృతి]]<nowiki/>ని సర్వాంగ సుందరంగా అభివర్ణించిన [[కావ్యము|కావ్యం]]<nowiki/>గా దీనిని పలువురు విమర్శకులు పేర్కొన్నారు.<ref name="మసన చెన్నప్ప-తెలుగు ఋతువులు" />
=== వసంతర్తువు ===
వసంతఋతువు వర్ణనను విశ్వనాథ సత్యనారాయణ ప్రియురాలి ఎదచెమర్చడంతో, బాలికల వాలుజడల్లో మల్లెమొగ్గలు కనిపించడం, వేపకొమ్మ చిగురించి [[కోకిల]] కుహూరావాలు చేయడం వంటివాటితో ప్రారంభమైనాయని మొదలుపెట్టారు. భార్యాప్రవాసివోలె గొంతెత్తి కూజితాలు చేసే [[కోకిల]]<nowiki/>నూ, కొబ్బరిమొవ్వు గెలను తొలచి కలాలిలాగ అందులోని [[కల్లు]] రుచికి మరిగిన [[ఉడుత]]<nowiki/>ను, ఇతరుల కోసం లోభివానిలాగా ప్రతిపువ్వునూ వెతికి తేనెబొట్లు సేకరించే తుమ్మెదలను వర్ణించారు. మల్లెపూవులను తెలుగు రసికలోకాన్ని మురిపించే [[కళాపూర్ణోదయం]], [[ఆముక్తమాల్యద]], [[మనుచరిత్ర]] మొదలైన కావ్యాలుగా వర్ణించడం విశేషం.<ref name="మసన చెన్నప్ప-తెలుగు ఋతువులు" />
"https://te.wikipedia.org/wiki/ఋతు_సంహారము" నుండి వెలికితీశారు