హుసేన్ సాగర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బుద్ధ విగ్రహం: విస్తరించు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 28:
 
== గణేశ విగ్రహాల నిమజ్జనం==
ప్రతి సంవత్సరం [[వినాయక చవితి]] అనంతరం హుస్సేన్ సాగర్‌లో గణేశ విగ్రహాల [[నిమజ్జనం]] జంటనగరాలలో ఒక ముఖ్యమైన వార్షిక సంరంభంగా పరిణమించింది.దీనివల్ల, ఈ సరస్సును "వినాయక్ సాగర్" గా కూడ కొంతమంది పిలవటం పరిపాటయ్యింది. కోలాహలంగా, అనేక వాహనాలలో, వివిధ సైజులలో వినాయకులు ఊరేగింపుగా తెచ్చి [[సరస్సు]]<nowiki/>లో నిమజ్జనం చేస్తారు. ఏటా దాదాపుగా 30,000 పైగా విగ్రహాలు ఇలా నిమజ్జనం చేయబడుతాయని అంచనా. ట్రాపిక్ సమస్యలను నియంత్రించడానికి, మతపరమైన కల్లోలాలు తలెత్తకుండా ఉండడానికి నగర పాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తారు. బందోబస్తు కోసం 30,000 పైగా పోలీసు బలగం ఈ సమయంలో విధి నిర్వహరణలో ఉంటారు. విగ్రహాల సంఖ్యను, ఊరేగింపు రూట్లను, నిమజ్జనా కార్యకలాపాలను పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నారు.<ref>[{{Cite web |url=http://www.newspoint.us/2007/09/17/hi-tech-guidance-for-ganesh-nimajjan.html |title=న్యూస్ పాయింట్ వార్త 17/9/2007] |website= |access-date=2008-07-01 |archive-url=https://web.archive.org/web/20120121221025/http://www.newspoint.us/2007/09/17/hi-tech-guidance-for-ganesh-nimajjan.html |archive-date=2012-01-21 |url-status=dead }}</ref> నిమజ్జనం జరిగిన మర్నాడు చూస్తే, అంతకుముందువరకు ఎన్నో పూజలందుకున్న విగ్రహాల మీదకెక్కి వాటిని పగులగొట్టి వాటిల్లో అమర్చిన ఇనప చువ్వలు తీసుకుపోతున్నవారు కనిపిస్తారు. చివరకు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ముక్కలుగా మారిన ఆ విగ్రహాలు నీటిలో మిగిలిపోతాయి.ఈ విధంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేయబడి, రసాయనిక రంగులు పూయబడిన విగ్రహాలను ఇంత పెద్ద యెత్తున నిమజ్జనం చేయడం వల్ల సరస్సు నీరు కలుషితమౌతుందని పర్యావరణ పరిరక్షణావాదులు హెచ్చరిస్తున్నారు.<ref>[http://www.ias.ac.in/currsci/dec102001/1412.pdf విక్రమరెడ్డి, విజయకుమార్ నివేదిక]</ref> విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కాకుండా మట్టితో చేస్తే పర్యావరణం మీద ప్రభావం చాలావరకు తగ్గించవచ్చని, నిపుణుల అభిప్రాయం.
 
==చెరువులో కాలుష్యం==
"https://te.wikipedia.org/wiki/హుసేన్_సాగర్" నుండి వెలికితీశారు