అంకిత: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
| occupation = నటి, నిర్మాత
}}
రస్నా బేబీగా పేరొందిన '''అంకితా ఝవేరీ''' ([[1982]], [[మే 27]])<ref>{{Cite web |url=http://www.telugucinema.com/c/publish/stars/ankita_interview_2.php |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-05-29 |archive-url=https://web.archive.org/web/20070917051945/http://www.telugucinema.com/c/publish/stars/ankita_interview_2.php |archive-date=2007-09-17 |url-status=dead }}</ref> చిన్నతనంలో [[రస్నా]] వంటి ఉత్పత్తుల ప్రకటనలలో నటించింది. కథానాయికగా ఈమె మొదటి చిత్రం [[వై.వి.ఎస్.చౌదరి]] నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన [[లాహిరి లాహిరి లాహిరిలో]]. ఆ తరువాత ఈమె [[సింహాద్రి]] వంటి ఒకటి రెండు విజయవంతమైన చిత్రాలలో నటించింది. అయితే కొత్త కథనాయకిల వెల్లువలో ఈమెకూ అవకాశాలు తగ్గటంతో ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలకు పరిమితం అయింది.
==జీవిత విశేషాలు==
అంకిత [[ముంబై|ముంబాయి]]<nowiki/>లో పుట్టి పెరిగింది. ఈమె తండ్రి [[గుజరాతీ]], తల్లి [[పంజాబీ]]. తండ్రి వజ్రాల వ్యాపారి. దక్షిణ [[ముంబాయి]]కి చెందిన ఈమె కుటుంబం అంకిత సినిమాలలో ప్రవేశించడానికి మంచి ప్రోత్సాహం ఇచ్చారని చెప్పుకున్నది.<ref>http://www.idlebrain.com/celeb/interview/interview-ankita.html</ref> [[ముంబాయి]]లోని హెచ్.ఆర్.కళాశాలలో బీ.కాం పూర్తి చేసిన అంకిత మూడేళ్ల వయసులో రస్నా వ్యాపార ప్రకటనలో నటించి రస్నాబేబీగా ప్రసిద్ధి చెందింది. రస్నా ప్రకటన తర్వాత అంకిత వీడియోకాన్ తదితర అనేక వ్యాపార ప్రకటనలలో నటించింది.<ref>[http://www.hindu.com/2001/05/04/stories/0404403j.htm Rasna doll's debut into films] The Hindu మే 4, 2001</ref> 2002లో వై.వి.చౌదరి లాహిరి లాహిరి లాహిరిలో సినిమా కోసం హీరోయిన్ను వెతకడానికి ముంబాయి వెళ్ళినప్పుడు అంకిత ఫోటోలు చూసి, ఆమె రస్నా బేబీ రూపం నచ్చడంతో ఆ సినిమాలో కథానాయకిగా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా విజయవంతమవ్వటంతో తెలుగులో వెనువెంటనే అనేక సినిమా అవకాశాలు వచ్చాయి. లాహిరి లాహిరి లాహిరిలో తర్వాత ప్రేమలో పావనీ కళ్యాణ్ సినిమాలో అంకిత నటనకు మన్ననలు పొందింది. దాంతో జూనియర్ ఎన్టీయార్ సరసర సింహాద్రిలో నటించే అవకాశం వచ్చింది. సింహాద్రి విజయవంతమవటంతో అంకితకు అనేక సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కొన్ని చెత్త సినిమాలు చేయటం వల్ల తెలుగు సినీరంగంలో వెనకబడిపోయింది. సినిమాల మధ్యలో వచ్చిన ఖాళీ సమయంలో ఆర్నెల్ల పాటు లండన్ వెళ్ళి అక్కడ సినీ దర్శకత్వంలో డిప్లొమా పొంది తిరిగివచ్చింది.<ref>{{Cite web |url=http://www.telugucinema.com/c/publish/stars/ankita_interview.php |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-05-29 |archive-url=https://web.archive.org/web/20071012205039/http://telugucinema.com/c/publish/stars/ankita_interview.php |archive-date=2007-10-12 |url-status=dead }}</ref>
 
==అంకిత కథానాయకిగా నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/అంకిత" నుండి వెలికితీశారు