ఆలె నరేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 30:
2004 ఎన్నికలలో [[మెదక్]] [[లోక్‌సభ]] నియోజకవర్గం నుండి [[తెరాస]] పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన నరేంద్ర, [[తెరాస]] యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటంతో కేంద్రమంత్రి అయ్యారు. ఒకటిన్నర సంవత్సరం తర్వాత, ప్రత్యేక తెలంగాణ విషయమై తగిన చర్యలు తీసుకోవట్లేదని [[తెరాస]] కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు నరేంద్ర, ఇతర [[తెరాస]] మంత్రులతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశారు.
 
2008 జనవరిలో నరేంద్ర ఉత్తరప్రదేశ్ మహిళా ముఖ్యమంత్రి [[మాయావతి]] ఆధ్వర్యములోని [[బహుజన సమాజ్]] పార్టీలో చేరారు.<ref name="merinews.com">{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.merinews.com/catFull.jsp?articleID=128999 | title= బహుజన సమాజ్ పార్టీలో చేరిక | publisher= మేరీన్యూస్.కాం | date= ఏప్రిల్ 24, 2008 }}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి, 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనారు. అనంతర కాలంలో [[భారతీయ జనతా పార్టీ]]<nowiki/>లో చేరి పనిచేశారు.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
పంక్తి 37:
 
==రాజకీయ జీవితం==
ప్రారంభం నుంచి [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] సభ్యుడైన నరేంద్ర [[1983]] నుంచి [[1994]] మధ్యకాలంలో [[భారతీయ జనతా పార్టీ]] తరఫున [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు [[హిమాయత్‌నగర్]] నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎన్నికైనారు. [[1978]]లో [[ఖైరతాబాదు]] నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.జనార్థనరెడ్డి చేతిలో కేవలం 659 ఓట్ల తేడాతో ఓడిపోయారు<ref>{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.telangana.com/Hyderabad/hyd_poli.htm| title= రాజకీయాలు| publisher= తెలంగాణా.కాం| date= ఏప్రిల్ 24, 2008| website= | access-date= 2008-04-22| archive-url= https://web.archive.org/web/20080515071836/http://www.telangana.com/Hyderabad/hyd_poli.htm| archive-date= 2008-05-15| url-status= dead}}</ref>. [[1980]]లో హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.ఎస్.నారాయణ చేతిలో పరాజయం పొందినారు. [[1983]]లో [[హిమయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం]] నుంచి పోటీ చేసి [[పి.ఉపేంద్ర]] పై గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. [[1985]]లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి కె.ప్రభాకరరావుపై గెలుపొందారు. [[1992]]లో హిమయత్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో గెలుపొంది మూడవసారి శాసనసభలో అడుగుపెట్టారు. [[1994]]లో [[తెలుగుదేశం]] పార్టీకి చెందిన [[కృష్ణయాదవ్]] పై ఓడిపోయారు.[[1999]]లో [[భారతీయ జనతా పార్టీ]] తరఫున లోక్‌సభకు [[కాంగ్రెస్]] పార్టీకి చెందిన [[బాగారెడ్డి]]పై విజయం సాధించి తొలిసారి లోక్‌సభ సభ్యులైయ్యారు. [[2003]] వరకు భారతీయ జనతా పార్టీలో మంచి పేరు సంపాదించుకొని అభిమానులచే టైగర్‌గా పిలుపించుకున్నారు. ప్రత్యేక [[తెలంగాణా]] వాదంతో కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించిన పార్టీలో చేరి ఆ పార్టీలో రెండో ముఖ్య నాయకుడిగా వ్యవహరించారు. [[2004]]లో మళ్ళీ మెదక్ నియోజకవర్గం నుంచి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] తరఫున పోటీ చేసి భారతీయ జనతా పార్టీకు చెందిన [[పి.రామచంద్రారెడ్డిపై]] 1,23,756 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండో పర్యాయం లోక్‌సభలో అడుగుపెట్టడమే కాకుండా [[మే 23]] న కేంద్రంలో [[మన్మోహన్ సింగ్]] నేతృత్వం లోని యుపిఏ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిపదవిని పొందారు.
 
నకిలీ వీసా కేసులో చిక్కుకొని [[ఏప్రిల్]] [[2007]]లో [[తెలంగాణా రాష్ట్ర సమితి]] నుంచి బహిష్కృతుడై <ref>{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.rediff.com/news/2007/apr/26ap.htm| title=వార్తలు |publisher=రెడిఫ్.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref>, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (నరేంద్ర) అనే కొత్త పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి జనాదరణ లభించకపోవడంతో [[2008]] [[జనవరి 8]] న [[హైదరాబాదు]]లో [[మాయావతి]] సమక్షంలో [[బహుజన సమాజ్ పార్టీ]]లో చేరారు.<ref name="merinews.com"/> అమెరికాతో అణుఒప్పందం విషయంలో వామపక్షాలు యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్న పిదప జరిగిన పరిణామాలతో నరేంద్ర యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైయ్యారు.
"https://te.wikipedia.org/wiki/ఆలె_నరేంద్ర" నుండి వెలికితీశారు