ఏ.యం.రాజా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 35:
| weight =
}}
'''ఏ.యం.రాజా''' ('''అయిమల మన్మథరాజు రాజా''') (జూలై 1, [[1929]] - [[1989]]) 1950వ దశకములో [[తమిళ]], [[తెలుగు]] సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. [[విప్రనారాయణ]], [[చక్రపాణి]], [[ప్రేమలేఖలు]], [[మిస్సమ్మ]] పాటలు రాజా గాత్ర మాధుర్యానికి కొన్ని మచ్చు తునకలు. ఈయన వివిధ భాషలలో 10,000 పాటలు పాడి, వందకు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చాడు.<ref>{{Cite web |url=http://www.indiafilm.com/sing.htm#amr |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-04-12 |archive-url=https://web.archive.org/web/20090729151814/http://www.indiafilm.com/sing.htm#amr |archive-date=2009-07-29 |url-status=dead }}</ref>
 
ఏ.యం.రాజా [[1929]], జూలై 1 న [[చిత్తూరు]] జిల్లాలోని [[రామచంద్రపురం]]లో మన్మధరాజు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు.<ref>http://www.tfmpage.com/ppp/amraja.html</ref> మూడు నెలల ప్రాయంలోనే తండ్రి మరణించడంతో ఈయన రేణుకాపురానికి తరలి వెళ్ళింది. అక్కడే రాజా తన చదువు ప్రారంభించాడు. 1951లో [[మద్రాసు]] [[పచ్చయప్ప కళాశాల]] నుండి [[బి.ఎ]]. పట్టా పొందాడు. ఈయన చదువుకునే రోజుల్లోనే సంగీతంపై ఆసక్తితో మూడేళ్ళపాటు సాధనచేసి నేర్చుకున్నాడు. పచ్చయప్ప కళాశాల సంగీత పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. 1951లో కుమారి సినిమాకు నేపథ్యగాయకునిగా పనిచేయటానికి ఒప్పందం కుదిరింది. ఆ తరువాత సంసారంలో సినిమాలో పాడాడు. ఆ తరువాత అప్పట్లో విడుదలైన దాదాపు సినిమాలన్నింటిలో రాజా గొంతు వినిపించేది. ఈయన గాత్రం 1954, 1955 సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో విపరీతంగా విహారం చేసింది.
"https://te.wikipedia.org/wiki/ఏ.యం.రాజా" నుండి వెలికితీశారు