కాలేయం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరాబాద్ → హైదరాబాదు, మధ్యం → మద్యం, పని చేస్తు → పన using AWB
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 54:
 
===వైద్య చికిత్సలు===
కేన్సర్ వ్యాపించిన పరిధిని అనుసరించి వేరు వేరు సర్జరీ విధానాలు ఉంటాయి. కాకపోతే, లివర్ కేన్సర్ వచ్చిన వారిలో ఎక్కువ మంది సిరోసిస్ సమస్య ఉన్నవారే ఉంటారు. వారిలో లివర్‌లోని మిగతా భాగం కూడా దెబ్బ తినిపోయి ఉంటుంది. పైగా రక్తస్రావానికి సంబంధించి, రక్తం గడ్డ క ట్టడానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉంటాయి. అందుకే వీరిలో చాలా మందికి శస్త్ర చికిత్స చేయలేం. సర్జరీ ద్వారా కణితినీ, దెబ్బ తిన్న భాగాన్నంతా తొలగిస్తే మిగతా లివర్ శరీరానికి సరిపోదు. ఇలాంటి స్థితిలో లివర్ మార్పిడి చికిత్సే మార్గంగా ఉంటుంది. ఒకవేళ కేన్సర్ కణితి ఉన్నా, మిగతా లివర్ అంతా బాగానే ఉంటే అప్పుడు ఆ కణితిని మాత్రమే తొలగించే హెపాటిక్ రిసెక్షన్ సరిపోతుంది. క ణితి 5 సెంటీమీటర్లకన్నా మించకుండా ఉండి, అది రక్తనాళాల్లోకి వ్యాపించకుండా ఉంటే హెపాటిక్ రిసెక్షన్ చేయవచ్చు. లివర్ స్థితిని అనుసరించి, కొన్ని సార్లు కీమోథెరపీలు ఉంటాయి. ఇటీవలి కాలంలో దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉండే కొత్త తరహా కీమోథెరపీలు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా కీమోఎంబలైజేషన్ థెరపీ ఒకటి. ఇది కీమోథెరపీగానే కాకుండా కేన్సర్ కణితికి రక్రప్రసరణ కూడా అందకుండా చేస్తుంది. బాగా పెద్దవైన కణుతులకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇటీవలి కాలంలో రేడియో ఎంబలైజే షన్ థెరపీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, క్రయో అబ్లేషన్, ఇథెనాల్ అబ్లేషన్ థెరపీలు కూడా వచ్చాయి. వీటిలో కొన్ని సిరోసిస్ వ్యాధిగ్రస్తులకు కూడా ఉపయుక్తంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో లివర్ కేన్సర్ నివారణలో అత్యాధునికమైన టెక్నాలజీ కీలక పాత్ర వహిస్తోంది.<ref>[http://www.beautyepic.com/drinks-to-detoxify-liver/- కాలేయం నిర్విషీకరణ కొసం కొని ఉపయొగాలు ]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
ఒకదాన్ని మించి మరొకటి లివర్ చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే లివర్ కేన్సర్ లక్షణాలను గుర్తించిన మరుక్షణమే డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. వ్యాధిని ముందే గుర్తించి, మునుముందే చికిత్స తీసుకోవడం ఒక్కటే రోగి ముందు లేదా అతని అయినవాళ్ల ముందున్న ప్రధాన బాధ్యత. కాకపోతే వైద్యపరీక్షలకు వెళితే ఎక్కడ కేన్సర్ ఉన్నట్లు బయటపడుతుందోనని చాలా మంది పరీక్షలకే వెళ్లకుండా ఉండిపోతారు. ఒకవేళ నిజంగా కేన్సర్ ఉంటే పరీక్షలు చేయించకుండా ఉండిపోవడం వల్ల దానికదే తగ్గిపోదు కదా! తగ్గకపోగా వ్యా«ధి మరింత ముదిరి ప్రాణాపాయానికి దారి తీస్తుంది. మన ప్రాణాల మీద మనకు ఏకాస్త ప్రీతి ఉన్నా, అనుమానం కలిగిన వెంటనే పరీక్షలకు వెళ్లడం అత్యవసరం.
"https://te.wikipedia.org/wiki/కాలేయం" నుండి వెలికితీశారు