కొలాములు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
'''కొలాము'''లు [[మహారాష్ట్ర]], [[ఆంధ్రప్రదేశ్]] సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదిమజాతి తెగ. వాళ్ళ భాషలో "కొలావర్లు"(kolavars) అని వ్యవహరిస్తారు. తెలుగు ప్రాంతాలలో వీరిని మన్నెవార్లు అని, మారాఠీ ప్రాంతాలలో కొలాములు అని వ్యవహరిస్తారు. కొలాములు [[గోండి (భాష)|గోండి]] భాషకు దగ్గరగా ఉండే [[ద్రావిడ భాషలు|మధ్య ద్రవిడ భాషా]] కుటుంబానికి చెందిన కొలామీ భాషను మాట్లాడతారు. గోండులతో, [[పరధాను]]లతో మాట్లాడేటప్పుడు కొలాములు గోండీలో మాట్లాడతారు. కొలాములలో చాలా మందికి గోండీ భాషపైన మంచి పట్టు వుంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతపు కొలాములు ఇప్పుడు వాళ్ళ భాషను పూర్తిగా వదిలేసి తెలుగులోనే మాట్లాడుతుంటారు. అలాగే [[మహారాష్ట్ర]]లోని [[కిన్వట్]] తాలూకాలోని కొలాములు [[మరాఠీ]] మాట్లాడతారు.
 
కొలాములు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 1981 జనగణన ప్రకారం మహారాష్ట్రలో నివసించే కొలాముల జనాభా 1,18,073. అందులో 58,772 మంది స్త్రీలు, 59,301 మంది పురుషులు. కొలాములు ప్రధానంగా [[యావత్మల్]], [[నాందేడ్]], [[చంద్రపూర్]], [[ఘడ్‌చిరోలీ]], [[వార్ధా]] జిల్లాలలోనూ నివసిస్తున్నారు. అందులో కూడా 86% జనాభా యావత్మల్, నాందేడ్ జిల్లాలలోనే కేంద్రీకృతమై ఉన్నారు.<ref >[http://books.google.com/books?id=TmDRNTYw49EC&pg=PA143&lpg=PA143&dq=kolam+tribe&source#v=onepage&q=kolam%20tribe&f=false Encyclopaedic profile of Indian tribes By Sachchidananda, R. R. Prasad]</ref> 1991 జనగణన ప్రకారం అదిలాబాదు జిల్లాలో వీరి జనాభా 41,254.<ref name=apgov-kolam>{{Cite web |url=http://www.aptribes.gov.in/html/tcr-studies-eci-kolam.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2010-09-28 |archive-url=https://web.archive.org/web/20120506065835/http://www.aptribes.gov.in/html/tcr-studies-eci-kolam.htm |archive-date=2012-05-06 |url-status=dead }}</ref>
 
కొలాములు తాము [[మహాభారతం]]లో పాత్రలైన [[భీముడు]], హిండింబిల సంతతని భావిస్తారు. కొలాములు హిడింబిని తమ కులదైవతగా, భీముని ఆదిదేవునిగా పూజిస్తారు. భీముని కళ్యాణాన్ని (భీమ్యక్ లగ్న) పండగగా జరుపుకుంటారు. వీరికి అదిలాబాదు జిల్లా ప్రాంతాలలో నివసించే ఇతర తెగలైన గోండులు, ప్రధానులు, తోటీలతో పరస్పర సత్సంబంధాలు ఉన్నాయి.<ref name=apgov-kolam/>
"https://te.wikipedia.org/wiki/కొలాములు" నుండి వెలికితీశారు