జపాన్: కూర్పుల మధ్య తేడాలు

23 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 110:
తరువాత 1600 వరకు మళ్ళీ అంతర్యుద్ధాలు కొనసాగాయి. 1639లో జపాన్ షోగన్ నాయకత్వం ''సకోకు'' ("closed country") లేదా "ఏకాంత విధానం" అని ప్రసిద్ధమైన విధానాన్ని అనుసరించింది. సుమారు రెండున్నర శతాబ్దాల కాలం కొనసాగిన ఈ సమయంలో జపాను బయటి ప్రపంచం నుండి సంబంధాలు దాదాపు పూర్తిగా తెంచుకొని ఏకాకిగా ఉంది. ఈ సమయాన్ని ఎడో కాలం అని కూడా అంటారు. ఈ కాలంలో జపాను అధ్యయనాన్ని జపానువారే కొనసాగించారు. ఈ ప్రక్రియను కోకుగాకు లేదా "జాతీయ అధ్యయనం" అంటారు. అయితే [[నెదర్లాండ్స్]] అధీనంలో ఉన్న "డెజిమా" (నాగసాకి లోనిది) సంబంధాల ద్వారా పాశ్చాత్య విజ్ఞానాన్ని మాత్రం అధ్యయనం చేయడం కొనసాగించారు.<ref>{{cite web |last=Hooker |first=Richard |url=http://www.wsu.edu/~dee/GLOSSARY/KOKUGAKU.HTM |title=Japan Glossary; Kokugaku |publisher=Washington State University |date=[[1999-07-14]] |accessdate=2006-12-28 |website= |archive-url=https://web.archive.org/web/20060828004748/http://www.wsu.edu/~dee/GLOSSARY/KOKUGAKU.HTM |archive-date=2006-08-28 |url-status=dead }}</ref>
 
[[1854]] [[మార్చి 31]]న, [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] సైనికాధికారి కమొడోర్ మాత్యూ పెర్రీ నాయకత్వంలో అమెరికాకు చెందిన "నల్ల ఓడలు" బలవంతంగా జపాన్ ఏకాంతాన్ని విచ్ఛిన్నం చేశారు. తరువాత జరిగిన వివిధ ఒప్పందాలు, ఘటనలు, యుద్ధాల కారణంగా జపాన్ దేశంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. పాశ్చాత్య పరిపాలన, ప్రజా ప్రాతినిధ్య విధానం అమలై రాజరికం నామమాత్రమయ్యింది. ఇలా జరిగిన పరిణామాలను మెయిజీ పునరుద్ధరణ అంటారు. ఆ తరువాత జపాన్ ఒక పారిశ్రామిక శక్తిగా రూపుదిద్దుకొంది. తన ప్రాబల్యాన్ని మరింత విస్తృత పరచేందుకు యుద్ధాలు చేసింది. 1894-1895 కాలంలో మొదటి చైనా - జపాను యుద్ధము, 1904-1905 లో రష్యా - జపాన్ [[యుద్ధము]] జరిగాయి. [[తైవాన్]], [[కొరియా]], దక్షిణ సఖలిన్ జపాన్ అధీనంలోకి వచ్చాయి.<ref>{{cite web |url= http://filebox.vt.edu/users/jearnol2/MeijiRestoration/imperial_japan.htm |title=Japan: The Making of a World Superpower (Imperial Japan) |author=Jesse Arnold | publisher = vt.edu/users/jearnol2 | accessdate=2007-03-27 |website= |archive-url=https://web.archive.org/web/20070409113749/http://filebox.vt.edu/users/jearnol2/MeijiRestoration/imperial_japan.htm |archive-date=2007-04-09 |url-status=dead }}</ref>
 
20వ శతాబ్దం ఆరంభంలో జపాన్ మరింత బలపడింది. [[మొదటి ప్రపంచ యుద్ధం]]లో జపాన్ మిత్ర పక్షాల తరఫున ఉండి విజయంలో భాగం పంచుకొంది. తరువాత తన అధికారాన్ని విస్తరిస్తూ 1931లో మంచూరియాను ఆక్రమించింది. దీనిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అందుకు నిరసనగా జపాన్ [[నానాజాతి సమితి]] నుండి బయటకు వచ్చింది. 1936లో [[నాజీ]] [[జర్మనీ]]తో కమ్యూనిస్టు వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకొంది. 1941లో [[అక్ష రాజ్యాలు|అక్ష రాజ్యాల కూటమి]]లో చేరి [[జర్మనీ]], [[ఇటలీ]]<nowiki/>లకు తోడుగా [[రెండవ ప్రపంచ యుద్ధం]]లో పాల్గొంది.<ref>{{cite web |url= http://www.friesian.com/pearl.htm |title= The Pearl Harbor Strike Force |author= Kelley L. Ross | publisher = friesian.com |accessdate=2007-03-27}}</ref>
"https://te.wikipedia.org/wiki/జపాన్" నుండి వెలికితీశారు