డి. కె. అరుణ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 26:
 
==రాజకీయ జీవితం==
డి.కె.అరుణ [[1996]]లో [[మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం]] నుంచి [[తెలుగుదేశం పార్టీ]] తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్ చేతిలో 3700 ఓట్ల తేడాతో ఓడిపోయింది.<ref>{{Cite web |url=http://www.dkaruna.com/personal.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-05-26 |archive-url=https://web.archive.org/web/20090513105320/http://www.dkaruna.com/personal.html |archive-date=2009-05-13 |url-status=dead }}</ref> [[1998]]లో కాంగ్రెస్ తరఫున అదే స్థానంలో పోటీచేసి మళ్ళీ పరాజయం పొందింది. ఆ అనంతరం [[1999]]లో గద్వాల శాసనసభ స్థానంలో పోటీచేసి టిడిపీ అభ్యర్థి [[గట్టు భీముడు]] చేతిలో ఓడిపోయింది. 2004లో కాంగ్రెస్ టికెట్టు లభించకపోవడంతో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీచేసి విజయం పొంది తొలిసారిగా శాసనసభలో ప్రవేశించింది. 2004లో అరుణకు జిల్లాలోనే అత్యధిక మెజారిటీ లభించడం విశేషం. సమాజ్‌వాదీ పార్టీ తరఫున గెలిచిననూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యురాలిగా కొనసాగింది. దీనితో ఫిబ్రవరి 2007లో సామాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైంది.<ref>http://www.hindu.com/2007/02/21/stories/2007022108240400.htm</ref> 2009లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి అయిన కృష్ణమోహన్ రెడ్డిపై 10331 ఓట్ల ఆధిక్యతతో విజయం పొందినది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref> గద్వాల మండల అధ్యక్షుడిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఈమెకు వరుసకు అల్లుడు కావడం గమనార్హం. 2009 ఎన్నికల అనంతరం రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లా తరఫున ఇద్దరికి స్థానం లభించగా డి.కె.అరుణకు చిన్నతరహా పరిశ్రమలు, చక్కెర, ఖాదీ, గ్రామీణ పరిశ్రమలశాఖా మంత్రిపదవి లభించింది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/డి._కె._అరుణ" నుండి వెలికితీశారు