దక్షిణ మధ్య రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 5:
[[File:A View of Anakapalle Train station.jpg|thumb|250px|right|<center>దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఈశాన్యాన చివరిది అనకాపల్లి రైల్వేస్టేషన్</center>]]
 
[[భారతదేశం]] లోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన '''దక్షిణ మధ్య రైల్వే''' [[1966]], [[అక్టోబర్ 2]]న ఏర్పడింది. ఈ రైల్వే జోన్ [[సికింద్రాబాదు]] ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీని పరిధిలో ప్రస్తుతం 6 రైల్వే విభాగములు ఉన్నాయి. [[తెలంగాణ]] లోని [[హైదరాబాదు]], సికింద్రాబాదు, [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[గుంతకల్లు]], [[విజయవాడ]], [[గుంటూరు]] లతో పాటు [[మహారాష్ట్ర]]కు చెందిన [[నాందేడ్]] మండలములు దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నాయి. ప్రధానంగా [[ఆంధ్రప్రదేశ్‌]] మఱియు [[తెలంగాణ]]లో విస్తరించియున్న ఈ డివిజన్ కొంతమేరకు [[కర్ణాటక]], [[మధ్యప్రదేశ్]], మహారాష్ట్రలలో కూడా వ్యాపించియున్నది. మొత్తం 5752 కిలోమీటర్ల నిడివి కలిగిన రైలు మార్గం ఈ జోన్‌లో విస్తరించిఉన్నది. దేశంలో అత్యధిక లాభాలు ఆర్జించే జోన్‌లలో ఇది ఒకటి.<ref>{{Cite web |url=http://www.eenadu.net/emsmain.asp?qry=2502ems3 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-10-26 |archive-url=https://web.archive.org/web/20080305025126/http://www.eenadu.net/emsmain.asp?qry=2502ems3 |archive-date=2008-03-05 |url-status=dead }}</ref>
==చరిత్ర==
1966, అక్టోబరులో [[భారతీయ రైల్వే]]లో 9వ జోన్‌గా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేయబడ్డది.<ref>{{Cite web |url=http://scrailway.gov.in/web/hist.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-10-26 |archive-url=https://web.archive.org/web/20081015170053/http://www.scrailway.gov.in/web/hist.htm |archive-date=2008-10-15 |url-status=dead }}</ref> [[దక్షిణ రైల్వే]] జోన్ నుండి విజయవాడ మఱియు [[హుబ్లీ]] డివిజన్లను, [[మధ్య రైల్వే]] లోని సికింద్రాబాదు మరియు [[షోలాపూర్]] డివిజన్లు వేరు చేసి ఈ జోన్‌ను ఏర్పాటుచేశారు. [[1977]] [[అక్టోబర్]], 2న దక్షిణ రైల్వేకు చెందిన [[గుంతకల్లు రైల్వే డివిజను|గుంతకల్లు డివిజను]] దీనిలో విలీనం చేయబడింది. అదే సమయంలో [[షోలాపూర్]] డివిజన్‌ను [[మధ్య రైల్వే]]కు బదిలీ చేశారు. [[1978]]లో సికింద్రాబాదు డివిజన్‌ను రెండుగా విభజించి హైదరాబాదు డివిజన్‌ను నూతనంగా ఏర్పాటుచేశారు.[[2003]], [[ఏప్రిల్ 1]]న కొత్తగా ఏర్పడిన గుంటూరు మరియు నాందేడ్ డివిజన్లు కూడా ఈ జోన్‌లో భాగమయ్యాయి. అదివరకు దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగిన హుబ్లి డివిజన్‌ను నూతనంగా ఏర్పాటైన [[నైరుతి రైల్వే]]లో విలీనం చేశారు. ప్రస్తుతం ఈ జోన్ పరిధిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5 డివిజన్లు (సికింద్రాబాదు, హైదరాబాదు, విజయవాడ, గుంటూరు మరియు గుంతకల్లు), మహారాష్ట్రకు చెందిన ఒక డివిజను (నాందేడ్) కలిపి మొత్తం ఆరు (6) డివిజన్లు ఉన్నాయి.
 
==డివిజన్ల పరిధి==
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_మధ్య_రైల్వే" నుండి వెలికితీశారు