పల్లెటూరి పిల్ల: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 26:
'''పల్లెటూరి పిల్ల''', 1950లో విడుదలయిన ఒక [[తెలుగు సినిమా]]. రామారావు మరియు అక్కినేని కలసి నటించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా గురించి రూపవాణిలో ఇలా వ్రాశారు -
 
ఒక పురుషుని చుట్టూ ఇద్దరు స్త్రీలు తిరుగుతూ ఒకరు పాతివ్రత్యాన్ని, మరొకరు వ్యభిచారాన్ని పోషించే ఊకదంపుడు కథలను మద్రాసు ప్రొడ్యూసర్లు పోషిస్తున్న యుగంలో "పల్లెటూరు పిల్ల" కథలోనే ముందుగా క్రొత్తదనం చూపింది. ఒకే అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమిస్తారు. ఒకడు తన ప్రేయసి కోసం ఆదర్శయుతమైన త్యాగాన్ని ప్రదర్శిస్తాడు. దోపిడిగాండ్లలో పరివర్తన తెప్పించి అధికాహార ఉత్పత్తికి దోహదమిస్తుంది ఈ కథ. పశుబలాన్ని మచ్చిక చేసుకొని ప్రజోపయోగకరంగా మలచుకోవచ్చునని తెలుపుతుంది ఈ కథ. ప్రతి పాత్రకూ తగిన ప్రాముఖ్యతనిచ్చి కథకూ సన్నివేశానికీ మంచి బిగువును కల్పించాడు సుబ్బారావు. పల్లె వాతావరణమూ, వారి ఆచారాలు, సంప్రదాయాలు, మంచీ చెడూ చాలా చక్కగా చిత్రీకరించారు. మంచి సంభాషణలు అందించిన తాపీ ధర్మారావును ప్రశంసింపక తప్పదు. ఆదినారాయణరావు సంగీతం పల్లెటూరి వాతావరణానికీ, కథకూ, గమనానికీ, స్థాయికీ బాగా సరిపోయింది. ఎడిటింగ్ చిత్రం యొక్క ఆఖరులో కొంచెం కుంటుపడింది. ఆంజలీ దేవి నటన పాత్రోచితంగా, సహజంగా ఉంది. నాగేశ్వరరావు, రామారావు తమ తమ పాత్రలను సమర్ధవంతంగా నిర్వహించారు. చక్కని హాస్యంతో చిత్రానికి అడుగడుగునా ఇంటరెస్టు కలిగించిన సీతారాం, రామ్మూర్తులను ప్రత్యేకంగా పేర్కొనక తప్పదు. <ref>[http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/94ff8a4a35a9b8876525698d002642a9/e602c4ff07d7ac3b65256e910018e2e2/$FILE/Te200189.pdf రూపవాణిలో సమీక్ష]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/పల్లెటూరి_పిల్ల" నుండి వెలికితీశారు