పాలపర్తి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
'''పాలపర్తి వెంకటేశ్వర్లు''' [[ఈపూరుపాలెం]] లో పేద [[వ్యవసాయం|వ్యవసాయ]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో లక్ష్మీకాంతమ్మ, పోలయ్యలకు పెద్ద కుమారుడిగా జన్మించాడు. స్టూవర్టుపురం పాఠశాలలో పదవతరగతి వరకు, ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకు [[చీరాల]] వి.ఆర్‌.ఎస్‌. వై.ఆర్‌.ఎన్‌. కళాశాలలో చదివాడు. గ్రూప్‌-1 అధికారి నుంచి ఐఏఎస్‌ హోదా లభించి ఆదిలాబాద్‌ కలెక్టర్‌ అయ్యాడు. ఏప్రిల్ 6, 2010న కలెక్టరుగా [[ఆదిలాబాద్ జిల్లా|ఆదిలాబాదు జిల్లా]]<nowiki/>కు వచ్చి అందరి ఆదరాభిమానాలు పొందినాడు. [[కలెక్టరు]]<nowiki/>గా సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా కాసిపేట మండల [[గిరిజనులు]] ఇతన్ని వెలుగు చూపిన దేవుడిగా కొనియాడారు.<ref>[http://www.prabhanews.com/adilabad/article-202164 ఆంధ్రప్రభ పత్రిక తేది 06.04.2011]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> [[నెల్లూరు]] జడ్పీ సీఈవోగా ,డీఆర్‌వోగా, [[తెలుగుగంగ ప్రాజెక్టు|తెలుగుగంగ]] ప్రత్యేక కలెక్టర్‌గా, రైతుబజార్ల ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా పనిచేశారు. రెండో తమ్ముడు ఈపూరుపాలెం సర్పంచి. వెంకటేశ్వర్లు [[వెదుళ్ళపల్లి]] కి చెందిన అంజలిని [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నారు. ఈయనకు ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి.
 
==విశేషాలు==
పాలపర్తి వెంకటేశ్వర్లు 2010 ఏప్రిల్‌ 5న [[ఆదిలాబాద్ జిల్లా|అదిలాబాద్ జిల్లా]] కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. విధి నిర్వహణలో అందరితో కలుపుగోలుగా ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. లక్షెటిపేట మండలం [[దొనబండ]] వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 36 మంది మృతులకు దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. ఎండాకాలంలో తిర్యాణి మండలం కుర్రెఘడ్‌లో గిరిజన గూడెంలో కలుషిత నీరు తాగి ఆరుగురు గిరిజనులు మృతి చెందితే వైద్య బృందంతో గ్రామాన్ని సందర్శించారు. అక్కడ మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. [[ప్రాణహిత నది|ప్రాణహిత]] పుష్కరాలు విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలో మూడు చోట్ల [[పుష్కరాలు]] నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ నిధులు మాత్రం మంజూరు చేయలేదు. దీంతో కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్ని శాఖల నుండి నిధులు సేకరించి మూడు చోట్ల పుష్కరాలు విజయవంతంగా నిర్వహించారు. వర్షాకాలంలో [[ప్రాణహిత]] పరిసర గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఈ సమయంలో బెజ్జూర్‌, సిర్పూర్‌(టి) మండలాల్లో పర్యటించానని ఇది తనకు మరిచిపోలేని సంఘటన అని ఆయన పలుమార్లు గుర్తు చేస్తుండేవారు. జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలు వారి సమస్యలను నేరుగా [[కలెక్టర్ గారు|కలెక్టర్‌]]<nowiki/>కే తెలియజేసేందుకు 'మీ కోసం కలెక్టర్‌' కార్యక్రమాన్ని ప్రారంభించారు. దళిత, గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశారు.<ref>[http://www.prajasakti.com/adilabad/article-359335 ప్రజాశక్తి తేది 13.6.2012]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== మరణం ==