"యుద్ధకాండ" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎హనుమ ఓషధి పర్వతాన్ని తెచ్చుట: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి (2405:204:601B:F6E7:9EDC:4469:C6AA:EA1F (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
చి (→‎హనుమ ఓషధి పర్వతాన్ని తెచ్చుట: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను)
పుత్రుల, సోదరుల మరణానికి చింతాక్రాంతుడై యున్న రావణునికి ధైర్యం చెప్పి ఇంద్రజిత్తు యుద్ధరంగానికి వెళ్ళాడు. హోమం చేసి అస్త్రాలను అభిమంత్రించి అదృశ్యరూపుడై వానర సేనను నిశిత శరాలతో చీల్చి చెండాడ సాగాడు. వానర వీరులంతా సంజ్ఞా విహీనులై పోయారు. ఇక ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దానితో అందరూ మూర్ఛిల్లారు. రామ లక్ష్మణ హనుమంతులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నించక తప్పలేదు. అందరూ మరణించారనుకొని సింహనాదం చేసి ఇంద్రజిత్తు విజయోత్సాహంతో లంకలోకి వెళ్ళాడు.
 
మృత ప్రాయులై ఉన్నవారిలో బ్రతికినవారికోసం [[విభీషణుడు]], [[హనుమంతుడు]] వెదుకసాగారు. అప్పుడు [[జాంబవంతుడు]] కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో [[వాయుదేవుడు|వాయువు]]తోనూ, పరాక్రమములో [[అగ్ని]]తోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది [[మృత సంజీవని]], విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని హనుమను కోరాడు.
 
జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్నే సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. రామ లక్ష్మణులూ, వానరులూ సృహలోకి వచ్చారు. విగతులైన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. అయితే ఎప్పటికప్పుడు మరణించిన రాక్షసులను సముద్రంలో త్రోసివేయమని రావణుడు ఆజ్ఞనిచ్చినందువలన రాక్షసులకు ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2824037" నుండి వెలికితీశారు