పదార్థము: కూర్పుల మధ్య తేడాలు

చి 202.80.227.101 (చర్చ) చేసిన మార్పులను Bommarillu యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 2:
'''పదార్థం''' (ఫ్రెంచ్: matière, జర్మన్, డచ్: materie, ఆంగ్లం: matter, స్పానిష్, పోర్చుగీస్, ఇటాలియన్: materia) అనేది వివిధ భౌతికరాశుల తో కూడిఉంటుంది. పదార్థం సాధారణంగా [[పరమాణువు|పరమాణువులు]], [[అణువు|అణువులు]], [[బణువు|బణువుల]] తో నిర్మించబడి ఉంటుంది. పదార్థం కొంత [[ద్రవ్యరాశి]]ని కలిగి వుండడంతో పాటు కొంత [[స్థలం|స్థలాన్ని]] కూడా ఆక్రమిస్తుంది. ద్రవ్యరాశి, [[పొడవు]], [[కాలము]] వంటి కొలతలతో పదార్థమును నిర్వచించ వచ్చు. [[ఐన్‌స్టయిన్]] [[సాపేక్ష సిద్దాంతం]] ప్రకారం పదార్థం మరియు శక్తి పరస్పరం ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారగలవు.
 
పదార్థాలు ముఖ్యంగా [[ఘనం]], [[ద్రవం]], [[వాయువు (భౌతిక శాస్త్రం)|వాయువు]] అనే మూడు స్థితుల్లో ఉంటాయి. వీటిలో వాయుస్థితి అతిసరళమైనది. వాయువుకు నిర్దిష్టమైన ఆకృతి ఉండవు. వాయువుకు సంకోచ, వ్యాకోచ లక్షణాలు ఉండటం వల్ల దాన్ని ఉంచిన పాత్రను పూర్తిగా ఆక్రమిస్తుంది. వాయుస్థితిలో ఉన్న పదార్థాల అణువులు అమిత వేగాలతో భూమ్యాకర్షణ శక్తికి అతీతంగా తేలికగా కలిసిపోతాయి. దీన్నే 'వాయు వ్యాపనం' అని అంటారు.
 
'''పదార్థం''' లేదా ద్రవ్యం (matter) అంటే ఏమిటి? ఆధునిక భౌతిక శాస్త్రం ప్రకారం పదార్థానికీ, [[శక్తి]]కీ మధ్య నిజంగా తేడా ఏమీ లేదనీ, పదార్థాన్ని కేవలం శక్తి యొక్క రూపాంతరంగా భావించవచ్చనిన్నీ తెలుస్తోంది. అయినప్పటికీ పదార్థం అనే దానికి ఒక స్వతంత్రమయిన అస్తిత్వం ఉంది. మన నిత్య అనుభవంలో మనకి అనేక వస్తువులు తారస పడతాయి. చెట్లు, పువ్వులు, కాయలు, నీరు, కారు, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, ఇలా ఎన్నో. కంటికి కనబడని గాలి కూడా పదార్థమే, కాని అది మన స్పర్శకి 'కనబడుతుంది'. ఆమ్లజని, ఉదజని, నత్రజని కూడా పదార్దాలే. సూక్ష్మ ప్రపంచంలో ఉండే [[బణువులు]] (molecules), అణువులు (atoms), పరమాణువులు (sub-atomic particles) కూడా పదార్థాలే. ఇలా పదార్థం అంటే ఏమిటో సోదాహరణంగా వివరించటం ఒక ఎత్తు, పదార్థం అనే మాటకి ఒక నిర్వచనం తయారు చెయ్యటం మరొక ఎత్తు.
"https://te.wikipedia.org/wiki/పదార్థము" నుండి వెలికితీశారు