కార్బన్ మొనాక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (3), దృవ → ధ్రువ (7), పలితా → ఫలితా using AWB
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 81:
}}
 
'''కార్బన్ మొనాక్సైడ్''' రంగు, వాసన మరియు రుచి లేనటువంటి, గాలికన్న బరువైన [[వాయువు (భౌతిక శాస్త్రం)|వాయువు]]. వాతావరణంలో 35ppm మించి ఉన్నచో మనుష్యులకు ప్రమాదకరం. జీవుల, జీవ ప్రక్రియ సమయంలో అల్ప ప్రమాణంలో కార్బన్ మొనాక్సైడ్ ఉత్పత్తి అగును. కార్బన్ మొనాక్సైడ్ ఒక [[కార్బన్]] [[పరమాణువు]], మరో [[ఆక్సిజన్]] పరమాణువుతో త్రిబంధ సంయోగం ఏర్పరచు కొనుట వలన ఏర్పడును. [[అణువు]] లోని త్రిబంధాలలో రెండు సమయోజనీయ బంధాలు కాగా మూడవది ద్విధ్రువ సమయోజనీయ బంధం.ఇది అతి సాధారణంగా ఆక్సోకార్బన్, సైయనైడ్ అయానులతో, నైట్రోసోనియం కేటయాన్‌తో, మరియు [[నత్రజని]] [[అణువు]]తో ఐసో ఎలెక్ట్రానిక్ గా ప్రవర్తించును. సమన్వయ సంక్లిష్ట సమ్మేళనాలలో కార్బన్ మొనాక్సైడ్ లిగండ్ (ligand) ను కార్బోనైల్ అంటారు.
 
కార్బన్ కలిగిన పదార్థాలను పాక్షికంగా ఆక్సీకరణం చెయ్యడం వలన కార్బన్ మొనాక్సైడ్ వాయువును ఉత్పత్తి చెయ్యవచ్చును. కార్బన్ కలిగిన పదార్థాల లేదా సేంద్రియపదార్థాల దహనసమయంలో [[కార్బన్ డయాక్సైడ్]]ను ఉత్పత్తి చెయ్యుటకు ఆక్సిజన్ అందుబాటులో లేనప్పుడు కార్బన్ మొనాక్సైడ్ ఏర్పడును.మూసి వుంచిన/ సంవృత ఆవరణలో, తక్కువ [[గాలి]] అందుబాటు ఉన్న ప్రదేశాలలో స్టవ్ వెలుగుతున్నప్పుడు, లేదా అంతర్గత దహన యంత్రాలు పనిచేయునపుడు కార్బన్ మొనాక్సైడ్ అధిక ప్రమాణంలో ఉత్పత్తి అగును. కార్బన్ మొనాక్సైడ్‌ను ఆక్సిజన్ సమక్షంలోలేదా [[వాతావరణం]] లోని గాలిలో నీలి జ్వాల వెలువరిస్తూ మండి కార్బన్ డయాక్సైడ్‌ను వెలువరించును.
"https://te.wikipedia.org/wiki/కార్బన్_మొనాక్సైడ్" నుండి వెలికితీశారు