అల వైకుంఠపురములో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
"తొలిసారి అల్లు అర్జున్ ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేశాడు. తన మార్కు స్టైల్ తో కనిపిస్తూనే పంచ్ లు, కామెడీ సన్నివేశాలలో అదరగొట్టేశారు. నాయికానాయకుల మధ్య సన్నివేశాలు తెరపై అందంగా ఉన్నాయి. మధ్య తరగతి తండ్రిగా మురళీ శర్మ నటన చాలా చక్కగా ఉంది. ఆద్యంతం తన మేనరిజంతో ఆకట్టుకొన్న మురళి శర్మకు చిత్రంలో అల్లు అర్జున తర్వాత స్థాయి పాత్ర దక్కింది. దానిని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. కథా నేపథ్యం పాతదే అయినా త్రివిక్రం చూపించిన విధానం కొత్తగా ఉంది. ఇన్ని పాత్రలను తెరపైన చూపిస్తూ, ప్రతి పాత్రకు ప్రత్యేకత కల్పించడం త్రివిక్రం కే చెల్లింది." అని ఈనాడు తెలిపింది. <ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/Allu-Arjun-and-Trivikram-Ala-Vaikunthapurramloo-telugu-movie-review/0203/120005972|date=12 January 2020|accessdate=13 January 2020|first=|last=ఈనాడు|website=eenadu.net}}</ref>
 
"బన్ని అనగానే మనందరికి గుర్తొచ్చేది ఎనర్జీ, డ్యాన్స్‌లు, కామెడీ పంచింగ్‌ టైమ్‌. అయితే ఈ సినిమాలో వీటితో పాటు ఎమోషన్స్‌తో ఆకట్టుకున్నాడు.. మైమరిపించాడు.ఈ సినిమాతో నటుడిగా, హీరోగా వంద శాతం ప్రూవ్‌ చేసుకున్నాడు. అల్లు అర్జున్‌ తర్వాత చెప్పుకోవాల్సింది మురళీ శర్మ గురించి. కన్నింగ్‌, శాడిజం ఇలా పలు వేరియేషన్స్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కొడుకుపై శాడిజం చూపించే తండ్రిగా మురళీ శర్మ జీవించాడు. పూజా హేగ్డే చాలా అందంగా కనిపిస్తుంది. ట్రైలర్‌లో బన్ని చెప్పినట్టు ‘మేడమ్‌ సర్‌.. మేడమ్‌ అంతే’ అనే విధంగా పూజా ఉంటుంది. అందంతో పాటు అభినయంతో హావభావాలను పలికించింది.పంచభక్ష పరమాన్నాలు వడ్డించిన విస్తరిలా నిండుగా, అందంగా ఈ సినిమా ఉంటుంది. త్రివిక్రమ్‌ మార్క్‌​ టేకింగ్‌.. అల్లు అర్జున్‌ కామెడీ టైమింగ్‌, యాక్టింగ్‌, డ్యాన్స్‌లు, పాటలు సింపుల్‌గా చెప్పాలంటే సినిమా సరదా సరదాగా, ఎక్కడా బోర్‌ కొట్టకుండా సాఫీగా సాగుతూ వెళ్తుంది. సినిమా మొదలైన కొద్ది నిమిషాల్లోనే కథేంటో సగటు ప్రేక్షకుడికి అర్థమవుతుంది. అయితే కథ ముందే చెప్పేసి దాదాపు మూడు గంటల పాటు ప్రేక్షకుడిని కుర్చీలోంచి లేవకుండా చేయడంలో త్రివిక్రమ్‌ సక్సెస్‌ అయ్యాడు. కథ ముందే తెలిసినా తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి సగటు ప్రేక్షకుడికి కలిగేలా స్క్రీన్‌ ప్లే ఉంటుంది." అని సాక్షి కి చెందిన సంతోష్ యాంసాని తెలిపారు. <ref>{{Cite web|url=https://www.sakshi.com/news/movies/allu-arjun-ala-vaikunthapurramuloo-telugu-movie-review-and-rating-1255256|date=12 January 2020|accessdate=13 January 2020|first=|last=Sakshi|website=https://www.sakshi.com/}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అల_వైకుంఠపురములో" నుండి వెలికితీశారు